TVS Apache RTX 300 First Look: భారత బైక్ మార్కెట్‌లో TVS కొత్తగా తెచ్చిన అడ్వెంచర్ బైక్ "అపాచే RTX 300". ఈ బైక్ డిజైనింగ్, ఇంజిన్ పవర్, ఫీచర్లు అన్నీ చూసినపుడు, TVS తన గేమ్‌ను ఎలా మార్చిందో అర్థమవుతుంది.
శక్తిమంతమైన ఇంజిన్Apache RTX 300 రూపకల్పనలో కొత్త Next-Gen TVS RT-XD4 ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. 299.1 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, DOHC ఇంజిన్ 36 PS పవర్ ఇస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్, స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ జత కలుస్తాయి. ఇవన్నీ కలిపి బైక్ రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత సున్నితంగా, అదే సమయంలో రసవత్తరంగా చేస్తాయి. అంటే, ఇది రైడింగ్ ఫన్ ఇచ్చే పవర్‌ఫుల్ బైక్.
అడ్వెంచర్ డిజైన్ & ప్రెజెన్స్Apache RTX 300 బైక్ ఫస్ట్ లుక్‌లోనే సూదంటురాయిలా ఆకర్షిస్తుంది. చక్కగా డిజైన్ చేసిన బీక్ తరహా ఫ్రంట్, LED హెడ్‌ల్యాంప్స్, టాల్ విండ్‌షీల్డ్, స్ప్లిట్ సీట్, అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్ వంటివన్నీ RTX 300 ని పెద్ద అడ్వెంచర్ బైక్‌లా చూపిస్తాయి. ఫిజికల్ బల్క్ తక్కువగా ఉన్నా, ప్రెజెన్స్ మాత్రం సాలిడ్‌గా ఉంది.
టెక్నాలజీ & ఫీచర్లుఇది కేవలం శక్తిమంతమైన బైక్ మాత్రమే కాదు, దీని టెక్ ప్యాకేజ్ కూడా హై లెవెల్‌లో ఉంటుంది. TFT డిస్‌ప్లేలో నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, టెర్రైన్ అడాప్టివ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ మిటిగేషన్ - ఇలా.. సేఫ్టీ, కంఫర్ట్, ఫన్ అన్నీ కలిపి ఇవ్వగలిగేలా ఈ బీస్ట్ రూపుదిద్దుకుంది.
రైడ్ మోడ్స్‌గా Urban, Rain, Tour, Rally అనే నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. అంటే వాతావరణం ఎలా ఉన్నా, రోడ్డు ఎలా ఉన్నా Apache RTX 300 మీ మూడ్‌కి తగ్గట్లే నడుస్తుంది.
ధర & పోటీ బైక్‌లు అపాచే RTX 300 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.99 లక్షలు. దీని ప్రత్యర్థి బైక్‌లు - KTM 250 Adventure, Royal Enfield Scram 440 వంటివి. కానీ RTX 300 ఇచ్చే ఫీచర్లు, ప్రైసింగ్ బ్యాలెన్స్ మార్కెట్‌లో మంచి ఇంపాక్ట్ కలిగించేలా ఉన్నాయి.
యువతకు కొత్త అడ్వెంచర్ ఫీలింగ్ఈ మోటార్ సైకిల్... రోడ్ బైక్, అడ్వెంచర్ బైక్ రెండింటి మేళవింపు. స్టైల్, పవర్, టెక్నాలజీని సమపాళ్లలో కలిపిన RTX 300 యువ రైడర్లకు “నెక్ట్స్ లెవెల్ థ్రిల్” ఇస్తుంది. ట్రావెల్, లాంగ్ రైడ్స్, డైలీ రైడింగ్.. ఏదైనా కావచ్చు, అపాచే RTX 300 అన్ని సందర్భాల్లో బలంగా నిలబడే బైక్‌గా కనిపిస్తోంది.
ఫైనల్ ఇంప్రెషన్TVS కి ఇది ఒక పెద్ద జంప్. ఇప్పటివరకు అపాచే సిరీస్‌లో స్ట్రీట్ బైక్స్ మాత్రమే ఉండగా, RTX 300 తో అడ్వెంచర్ సెగ్మెంట్‌లోకీ అడుగు పెట్టింది. RTX 300 తన లుక్, ఫీచర్లు, పవర్ ప్యాకేజింగ్‌తో యంగ్ జనరేషన్‌ని బలంగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.