TVS Apache RTR 160 4V Features: టీవీఎస్‌ అపాచీ RTR 160 4V - 160cc సెగ్మెంట్లో దాదాపు ఏళ్లుగా టాప్‌లో నిలుస్తున్న బైక్‌. పెర్ఫార్మెన్స్‌, రోజువారీ వినియోగంలో ఈజీ హ్యాండ్లింగ్‌ & సెగ్మెంట్‌లోనే మంచిన ఫీచర్లు దీని బలాలు. ఇవన్నీ కలిపి ఈ బైక్‌ను యువతలో ఒక బెస్ట్‌ సెల్లర్‌గా మార్చాయి. మీరు కూడా ఈ బైక్‌ కొనాలని భావిస్తే, ముందుగా ఈ 5 ముఖ్య విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

Continues below advertisement

1. Apache RTR 160 4V ఇంజిన్‌ ఎంత పవర్ ఇస్తుంది?

Apache RTR 160 4V 159.7cc, ఆయిల్‌-కూల్డ్‌, సింగిల్‌-సిలిండర్‌ ఇంజిన్‌తో వచ్చింది. ముఖ్యంగా ఈ బైక్‌ రైడ్‌ మోడ్స్‌ ప్రకారం పవర్‌ అవుట్‌పుట్‌ మారడం దీని స్పెషాలిటీ.

Continues below advertisement

Sport మోడ్‌లో:

  • పవర్‌: 17.6hp @ 9,250rpm
  • టార్క్‌: 14.73Nm @ 7,500rpm

Urban & Rain మోడ్స్‌లో:

  • పవర్‌: 15.6hp @ 8,650rpm
  • టార్క్‌: 14.1Nm @ 7,250rpm

అంటే సిటీకి స్మూత్‌ పవర్‌, హైవేపై పీక్‌ రెస్పాన్స్‌ ఇవ్వడంలో Apache 160 4V ఒక షార్ప్‌ & పవర్‌ఫుల్‌ బైక్‌.

2. Apache RTR 160 4V సీటు ఎత్తు ఎంత?

ఈ బైక్‌ సీటు ఎత్తు 800mm మాత్రమే. అంటే 5.3ft నుంచి 6ft వరకు ఉన్న రైడర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్ట్‌గా డ్రైవ్‌ చేయగలరు. హైట్‌ ఎక్కువగా ఉన్న లేదా తక్కువ ఉన్న చాలామందికి ఈ బండి సరిగ్గా సెట్‌ అవుతుంది.

3. ఈ బైక్‌లో ఉన్న టాప్‌ ఫీచర్లు ఏమిటి?

Apache RTR 160 4V ఫీచర్లు వేరియంట్‌ ఆధారంగా మారుతాయి.

టాప్‌ వేరియంట్‌లో ప్రత్యేక ఫీచర్లు:

  • 5-inch TFT క్లస్టర్‌
  • Sport, Urban, Rain రైడ్ మోడ్స్‌
  • ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌
  • USD ఫోర్క్‌

లోయర్‌ వేరియంట్స్‌లో:

  • టెలిస్కోపిక్‌ ఫోర్క్‌
  • బేసిక్‌ LCD ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌

తన సెగ్మెంట్‌ బైక్స్‌తో పోలిస్తే, ఫీచర్ల పరంగా Apache 160 4V చాలా రిచ్‌గా ఉంటుంది.

4. Apache RTR 160 4V ఏయే రంగుల్లో లభిస్తుంది?

ఈ బైక్‌ 5 ఆకర్షణీయమైన కలర్స్‌లో వస్తోంది:

  • Marine Blue
  • Racing Red
  • Matte Black
  • Granite Grey
  • Pearl White

అయితే కొన్ని కలర్స్‌ టాప్‌ వేరియంట్‌ (TFT వేరియంట్‌)కి మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి వేరియంట్‌-కలర్‌ కాంబినేషన్‌ను షోరూమ్‌లో స్పష్టంగా చెక్‌ చేయడం మంచిది.

5. Apache RTR 160 4V ధర ఎంత?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ బైకర్లు ఎక్కువగా చెక్‌ చేసే అంశాల్లో ధర ఒకటి.

బేస్‌ వేరియంట్‌ (రియర్‌ డ్రమ్ బ్రేక్‌): ₹1.13 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

టాప్‌ వేరియంట్‌ (TFT + USD ఫోర్క్‌): ₹1.30 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌ దృష్టితో చూస్తే ఈ బైక్‌ ధర చాలా కాంపిటేటివ్‌గా ఉంటుంది.

Apache RTR 160 4V ఎవరికీ సరిగ్గా సరిపోతుంది?

డైలీ కమ్యూటింగ్‌తో పాటు వీకెండ్‌ హైవే రైడ్స్‌ కోసం కూడా పవర్‌, కంఫర్ట్‌ & మైలేజ్‌ మధ్య సరైన బ్యాలెన్స్‌ కలిగిన బైక్‌ కావాలనుకునే వారికి Apache RTR 160 4V ఒక అద్భుతమైన ఎంపిక. 160cc సెగ్మెంట్లో బైక్‌ కొనాలనుకునే వారు Apache 160 4Vను కచ్చితంగా షార్ట్‌లిస్ట్‌ చేసుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.