Trisha Krishnan Net Worth and Luxury Lifestyle Details Trisha Krishnan: చెన్నై సోయగం త్రిష కృష్ణన్ ఇప్పటికీ సౌత్ ఇండియాలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతోంది సుమారు రూ. 85 కోట్ల నెట్ వర్త్ తో ఈ "క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా" తన సత్తా చాటుతోంది.. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా భారీగా సంపాదిస్తున్న త్రిషకు చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఖరీదైన ఇళ్లు ఉన్నాయి.. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్ల కలెక్షన్ ఆమె లైఫ్ స్టైల్ కు నిదర్శనంగా నిలుస్తోంది.. పొన్నియిన్ సెల్వన్ సినిమా సక్సెస్ తర్వాత ఆమె తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసింది.. ఒక్కో సినిమాకు ఇప్పుడు రూ. 10 నుండి 12 కోట్ల వరకు డిమాండ్ చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. రెండు దశాబ్దాలుగా వెండితెరపై తన మేజిక్ ను కొనసాగిస్తూ కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేస్తోంది.

Continues below advertisement

తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో త్రిష పేరు తెలియని వారు ఉండరు. 1999లో 'జోడి' సినిమాతో తన కెరీర్ ను చిన్న రోల్ తో ప్రారంభించిన ఈ అమ్మడు, ఇప్పుడు సౌత్ లోనే హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ. 85 కోట్లు ఉంటుందని సమాచారం. కేవలం సినిమాల ద్వారానే కాకుండా, బ్రాండ్ ప్రమోషన్లు, డిజిటల్ కొలాబరేషన్ల ద్వారా కూడా ఆమె భారీగా వెనకేస్తోంది.

రెమ్యునరేషన్ లో తగ్గేదే లే..ఒకప్పుడు ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లు తీసుకున్న త్రిష, ఇప్పుడు తన రేంజ్ ను పెంచేసింది. 'పొన్నియిన్ సెల్వన్ 1' ఘనవిజయం సాధించిన తర్వాత ఆమె తన పారితోషికాన్ని రూ. 5 కోట్లకు పెంచింది. రీసెంట్ గా విజయ్ తో చేసిన 'లియో' సినిమాకు కూడా భారీగానే తీసుకుంది. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టుల కోసం ఆమె రూ. 10 నుంచి 12 కోట్ల వరకు వసూలు చేస్తోందని టాక్ నడుస్తోంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం దాదాపు రూ. 9 కోట్లు ఛార్జ్ చేస్తూ తన డిమాండ్ ను చాటుకుంటోంది.

Continues below advertisement

విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లు..త్రిషకు చెన్నైలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఒక లగ్జరీ హౌస్ ఉంది. దీని విలువ సుమారు రూ. 10 నుంచి 12 కోట్లు ఉంటుందని అంచనా. టాలీవుడ్ సినిమాల కోసం హైదరాబాద్ లో కూడా ఆమె ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసింది, దాని విలువ రూ. 6 నుంచి 7 కోట్లు ఉంటుంది. ఇక కార్ల విషయానికి వస్తే, ఆమె గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, బీఎండబ్ల్యూ 5-సిరీస్, రేంజ్ రోవర్ ఎవోక్ వంటి సూపర్ కార్లు ఉన్నాయి. ఈ కార్ల మొత్తం విలువ దాదాపు రూ. 4 కోట్ల వరకు ఉంటుంది.

సినీ ప్రయాణం - అద్భుతమైన విజయాలు..ప్రభాస్ తో నటించిన 'వర్షం' (2004) సినిమా త్రిషను రాత్రికి రాత్రే స్టార్ ను చేసింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. గిల్లి, సామీ, ఆరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, విన్నైతాండి వరువాయా వంటి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా దళపతి విజయ్ తో ఆమె కెమిస్ట్రీ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గిల్లి నుంచి రీసెంట్ గా వచ్చిన 'ది గోట్' సినిమా వరకు వీరిద్దరి కాంబినేషన్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా రాజ‌కీయంగాను వీరి పేర్లు జ‌నాల్లో నానుతున్నాయి. త్రిష కార‌ణంగానే విజ‌య్ భార్య విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసింద‌నే పుకార్లు ఉన్నాయి. తాజాగా జ‌రిగిన ఒక ఈవెంట్ కు ఇద్ద‌రూ ఒకే ర‌క‌మైన దుస్తులు ధ‌రించి రావ‌డం అగ్నికి ఆజ్యం పోసింది. మ‌రోవైపు టాలెంట్, అందం కలగలిసిన త్రిష తన సంపాదనను రియల్ ఎస్టేట్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ స్మార్ట్ గా ముందుకు వెళ్తోంది. ఇన్నేళ్లయినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. కొత్త హీరోయిన్లు వస్తున్నా, సీనియర్ స్టార్ గా త్రిష తన స్థానాన్ని పదిలం చేసుకుంది.