Toyota Urban Cruiser Taisor: ప్రముఖ కార్ల కంపెనీ టయోటా భారతదేశంలో టేజర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. టయోటా అర్బన్ క్రూయిజర్ టేజర్ అనేది మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఆధారంగా రూపొందించిన మోడల్. టయోటా ఫ్రాంక్స్‌ను కంపెనీ తిరిగి రీబ్యాడ్జ్ చేసింది. మారుతి ఫ్రాంక్స్ కంటే టయోటా టేజర్‌లో కొన్ని విభిన్న ఫీచర్లు కనిపించాయి. భారతదేశంలో టయోటా లాంచ్ చేసిన ఎస్‌యూవీలలో టేజర్ అతి చిన్న ఎస్‌యూవీ. టయోటా ఈ మోడల్‌లో 12 వేరియంట్‌లను మార్కెట్‌లో విడుదల చేసింది.


టయోటా ఎక్స్‌టీరియర్ డిజైన్
టయోటా టేజర్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో చాలా బాడీ ప్యానెల్‌లు మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఆధారిత మోడల్‌ను పోలి ఉంటాయి. కానీ దీని ఫ్రంట్ గ్రిల్‌ను కంపెనీ రీడిజైన్ చేసింది. టయోటా ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌ను ఉపయోగించింది. టయోటా తన మోడల్‌లో కొత్త 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ను కూడా అమర్చింది.


టేజర్ ఫీచర్లు ఇవే...
టయోటా లాంచ్ చేసిన ఈ కొత్త ఎస్‌యూవీ తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ సిస్టమ్‌లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, స్మార్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం టయోటా టేజర్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) అందించారు. అదే సమయంలో కారులో పిల్లల భద్రతపై కూడా దృష్టి పెట్టారు. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్ కూడా వాహనంలో అందించారు.


టయోటా టేజర్ ఇంజిన్ ఇలా...
టయోటా అర్బన్ క్రూయిజర్ టేజర్‌లో 1.2 లీటర్, 4 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ 1.0 లీటర్, 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజన్ 90 హెచ్‌పీ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంది. అదనంగా ఆప్షనల్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ కూడా ఉంది.


టయోటా అర్బన్ క్రూయిజర్ టేజర్ ధర
టయోటా అర్బన్ క్రూయిజర్ టేజర్‌కు సంబంధించి 12 వేరియంట్లు మార్కెట్‌లో లాంచ్ అయ్యయి. ఈ కారు ధర రూ. 7.74 లక్షల నుంచి మొదలవుతుంది. దీనికి సంబంధించిన టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 13.04 లక్షల వరకు ఉంటుంది. ఇవి రెండూ ఎక్స్ షోరూం ధరలే.


మరోవైపు టయోటా ఫార్చ్యూనర్‌కు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. పెద్ద ఫ్యామిలీ ఉండి అందరూ కలిసి బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు దీన్ని మంచి ఆప్షన్‌గా పెట్టుకున్నారు. దీని ధర రేంజ్‌లో ఎక్కువ మైలేజీని అందించే కారు కూడా ఇదే కావడం విశేషం. సరిగ్గా మెయింటెయిన్ చేస్తే దీనిపై ఎన్ని లక్షల కిలోమీటర్లు అయినా సులభంగా తిరిగేయడమే టయోటా ఫార్చ్యూనర్ స్పెషాలిటీ. ఒకవేళ రూ.10 లక్షల్లోపు ధరలో ఈ కారు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో లభిస్తే దీన్ని కొనుగోలు చేయవచ్చని నిపుణులు అంటున్నారు.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!