మీరు అధిక మైలేజ్, హైబ్రిడ్ టెక్నాలజీ కలిగిన మిడ్ సైజ్ SUVని కొనుగోలు చేయాలనుకుంటే Toyota Urban Cruiser Hyryderపై ఓ లుక్కేయండి. ఈ SUV  మారుతి గ్రాంట్ విటారా (Maruti Grand Vitara), Hyundai Creta, కియా సెల్టోస్ (Kia Seltos), Honda Elevate, స్కోడా కుషక్ (Skoda Kushaq) వంటి మోడళ్లకు గట్టి  పోటీని ఇస్తుంది.

Continues below advertisement

ఈ కార్‌ను కొనుగోలు చేయడానికి మీ వద్ద మొత్తం నగదు లేకపోయినా పరవాలేదు. ఫుల్ పేమెంట్ చేయకుండానే ఈ కార్‌ను కార్ లోన్‌పై కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ కొనుగోలు చేయాలనుకుంటే, రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి నెలా ఎంత EMI చెల్లించాల్సి ఉంటుందో పూర్తి వివరాలు తెలుసుకోండి. 

కార్ ఆన్ రోడ్ ధర

Continues below advertisement

Toyota Urban Cruiser Hyryder బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర హైదరాబాద్‌లో సుమారు ₹11.31 లక్షలు మరియు ఆన్-రోడ్ ధర ₹13.9 లక్షలుగా ఉంది. అయితే మీ సిటీ, పన్నులు/ఛార్జీలను బట్టి ఆన్-రోడ్ ధర మారుతుంది. ₹1 లక్ష డౌన్ పేమెంట్ చేశాక ₹13.9 లక్షల్లో ₹1 లక్ష తీసివేస్తే సుమారు ₹12.9 లక్షల లోన్ అవుతుంది. మీరు సంవత్సరానికి 9.8% వడ్డీ రేటుతో 7 సంవత్సరాలకి లోన్ తీసుకుంటే, ప్రతి నెలా ₹21,265 EMI అవుతుంది. 6 ఏళ్లకు లోన్ తీసుకుంటే ప్రతినెలా ఈఎంఐ రూ.23,749 చెల్లించాలి. ఒకవేళ 5 ఏళ్లకు కార్ లోన్ తీసుకుంటే కనుక ప్రతినెలా ఈఎంఐ రూ.27,260 కట్టాలి.

వాస్తవానికి బ్యాంకు వడ్డీ రేటు, మీ క్రెడిట్ హిస్టరీ, లోన్ కాలపరిమితి, ప్రాసెసింగ్ ఫీజు, ఆన్-రోడ్ ధరపై ఆధారపడి EMI కాస్త పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. మీరు 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలవారీ EMI తగ్గొచ్చు. కానీ మొత్తం వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు.  ఎక్కువ డౌన్ పేమెంట్ చేస్తే లోన్ అమౌంట్ తగ్గి, EMIతో పాటు మొత్తం వడ్డీ భారం తగ్గుతుంది.

Also Read: E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు

కార్ ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే మీ చివరి కొనుగోలు ధర కాదు. ఆన్-రోడ్ ధరలో రోడ్ టాక్స్ లేదా RTO, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇతర అవసరమైన ఛార్జీలు కలిసి ఉంటాయి. కారు ప్రారంభ ధర సుమారు ₹11 లక్షలు ఉందని చూసి, అంతే మొత్తానికి ఫైనాన్సింగ్ చేసుకోవచ్చని భావించరాదు. 

కార్ ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Hyryder బేస్ E వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, కీ-లెస్ ఎంట్రీ, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు లభిస్తాయి. పై వేరియంట్లయిన S, G, V మోడళ్లలో మరిన్ని ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. ఉదాహరణకు, ఎత్తైన వేరియంట్లలో 7 అంగుళాలు లేదా 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay/Android Auto, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు  ఉన్నాయి.

ఇంజిన్, మైలేజ్ విషయానికొస్తే Toyota Hyryder ప్రత్యేకత దాని వేర్వేరు పవర్‌ట్రెయిన్ ఎంపికలే. ఇందులో 1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ అవుట్‌పుట్ 103 PS,  137 Nm గా పేర్కొన్నారు. 1.5 లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లో 116 PS పవర్ లభిస్తుంది. 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లీటరుకు సుమారు 26.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.  Hyryderలో CNG, స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్లు ఉన్నాయి. స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్ క్లెయిమ్ చేసిన మైలేజ్ దాదాపు 27.97 కిలోమీటర్ల వరకు ఉంది.

Also Read: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?

కార్ ప్రత్యేకత

ఈ SUV మరొక పెద్ద ప్రత్యేకత ఏంటంటే, కస్టమర్లు తమ అవసరం, బడ్జెట్‌కు అనుగుణంగా విభిన్న పవర్‌ట్రెయిన్‌ను ఎంచుకోవచ్చు. మీ ప్రాధాన్యత తక్కువ ప్రారంభ ధర, సాధారణ పెట్రోల్ వాడకం అయితే, బేస్ పెట్రోల్ వేరియంట్‌ సరిపోతుంది. ఎక్కువ మైలేజ్ కోసం కొనుగోలుదారులకు CNG, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్లు ఉంటాయి. హైబ్రిడ్ వేరియంట్ల ధర బేస్ పెట్రోల్ మోడల్ కంటే ఎక్కువ.