Toyota Urban Cruiser EV India Launch Date: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. Toyota కూడా తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ SUVని మన మార్కెట్‌కు పరిచయం చేయబోతోంది. Toyota Urban Cruiser EV రేపు, అంటే జనవరి 20, 2026న అధికారికంగా లాంచ్‌ కానుంది. ఈ మిడ్‌సైజ్‌ ఎలక్ట్రిక్ SUV ద్వారా, టయోటా, ఇప్పటికే ఈ విభాగంలో ఉన్న బలమైన పోటీదారులను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.

Continues below advertisement

ఎక్స్‌టీరియర్ డిజైన్ ఎలా ఉంటుంది?

Toyota Urban Cruiser EV, డిజైన్ పరంగా Maruti e Vitaraకు చాలా దగ్గరగా ఉంటుంది. అయితే, టయోటా ప్రత్యేకత కనిపించేలా కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా ఫ్రంట్‌ ఎండ్‌లో షార్ప్‌గా కనిపించే LED హెడ్‌ల్యాంప్స్‌, DRLs ఉంటాయి. ఇవి బ్లాక్ ట్రిమ్‌లో అమర్చారు. ఈ డిజైన్, ప్రీమియం Toyota Camryలో కనిపించే LED DRL సిగ్నేచర్‌ను గుర్తు చేస్తుంది.

Continues below advertisement

ఫ్రంట్ బంపర్ దిగువ భాగంలో సింపుల్‌గా కనిపించే ఎయిర్ డ్యామ్‌లు, వెర్టికల్ వెంట్స్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ చూస్తే, బలమైన స్టాన్స్‌తో పాటు డోర్ల దిగువ భాగంలో మందపాటి క్లాడింగ్ కనిపిస్తుంది. ముఖ్యంగా రియర్ బంపర్ వద్ద ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక భాగంలో రాప్ అరౌండ్ టెయిల్ లైట్ డిజైన్ ఇచ్చారు. ఇది e Vitara కంటే భిన్నమైన LED లైట్ సిగ్నేచర్‌తో ఉంటుంది. అలాగే, ఏరో ఆప్టిమైజ్డ్ 18 ఇంచుల అలాయ్ వీల్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

ఇంటీరియర్‌లో ఏముంటుంది?

ఇంటీరియర్ విషయానికి వస్తే, Urban Cruiser EVలో కూడా Maruti e Vitara తరహా లేఅవుట్‌నే ఆశించవచ్చు. అసిమెట్రికల్ డ్యాష్‌బోర్డ్ డిజైన్, డ్యువల్ స్క్రీన్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.

సాఫ్ట్ టచ్ సర్ఫేస్‌లు, లెదరెట్ సీట్ అప్‌హోల్స్టరీ, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్‌తో పాటు నిల్వకు సరిపడా స్థలాన్ని టయోటా అందించనుంది. HVAC నియంత్రణలకు ఫిజికల్ బటన్‌లు ఇవ్వడం వల్ల వాడకం మరింత సులభంగా ఉంటుంది. బూట్ స్పేస్ అధికారికంగా వెల్లడించకపోయినా, అంతర్జాతీయ మార్కెట్ మోడల్‌లో 310 లీటర్ల వరకు బూట్ స్పేస్ ఉంది. భారత వెర్షన్‌లో కూడా ఫుల్ సైజ్ స్పేర్ వీల్‌, చార్జింగ్ కేబుల్ ట్రే వచ్చే అవకాశం ఉంది.

బ్యాటరీ, రేంజ్ వివరాలు

Toyota Urban Cruiser EVలో 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఇవి ఫ్రంట్ వీల్ డ్రైవ్ సెటప్‌తో వస్తాయి. పవర్ అవుట్‌పుట్‌ సుమారు 144hp నుంచి 174hp మధ్య ఉండవచ్చని అంచనా. రేంజ్ విషయానికి వస్తే, e Vitara మాదిరిగానే సింగిల్‌ ఛార్జ్‌తో గరిష్టంగా 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండొచ్చు.

ఫీచర్లు, భద్రత

ఫీచర్ల పరంగా Urban Cruiser EV చాలా రిచ్‌గా ఉండనుంది. వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, డ్రైవ్ మోడ్‌లు, ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి సదుపాయాలు ఉండే అవకాశం ఉంది. భద్రత పరంగా 7 ఎయిర్‌బ్యాగ్స్‌, 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 ADAS, TPMS, ESC వంటి ఫీచర్లు ఇవ్వవచ్చు. e Vitaraకి 5 స్టార్ భద్రత రేటింగ్ రావడం, Urban Cruiser EVకి కూడా ప్లస్ అవుతుంది.

అంచనా ధర

Toyota Urban Cruiser EV ధరలు రూ.19 లక్షల నుంచి రూ.25 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ధర) మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారు... Hyundai Creta Electric, Maruti e Vitara, MG ZS EV, Tata Curvv EV, Mahindra BE 6 లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.