జులై 1వ తేదీన టొయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ పెద్ద ప్రకటన చేయనుందని తెలిపింది. అయితే అదేం ప్రకటన అనే సంగతి మాత్రం సస్పెన్స్. హైరైడర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని టొయోటా లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మారుతి, టొయోటా రెండూ కలిసి ఈ కారును రూపొందించాయి. దీనికి డీ22 అని కోడ్‌నేమ్ పెట్టారు.
టొయోటా లాంచ్ చేయనున్న కార్లలో హైరైడర్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. మనదేశం కోసం ఈ కారును భారీగా లోకలైజ్డ్ చేశారు. దీనికి సంబంధించిన స్పై షాట్ ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఇమేజెస్ ద్వారా ఈ కారు ఎక్స్‌టీరియర్ డిజైన్ లీక్ అయింది.
ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఫ్లోటింగ్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ టచ్‌స్క్రీన్ సిస్టం, 360 డిగ్రీల కెమెరా వంటి మోడర్న్ ఫీచర్లు హైరైడర్‌లో ఉండనున్నట్లు సమాచారం. హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్స్ కాంబినేషన్‌గా ఈ కారు లాంచ్ కానుంది.
ఇందులో ఎలక్ట్రిక్ మోటార్‌కు కనెక్ట్ అయిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించనున్నారు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంది. మైల్డ్ హైబ్రిడ్ మోడల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వాగన్ టైగున్, ఎంజీ ఆస్టర్‌లతో ఈ కారు పోటీ పడనుంది. దీని ధర రూ.10 లక్షల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?