Toyota Hilux Mild Hybrid With Diesel Engine: టయోటా తన పికప్ ట్రక్ హైలక్స్‌ను మైల్డ్ హైబ్రిడ్ సెటప్‌తో రివీల్ చేసింది. ఈ డీజిల్ పవర్డ్ ఎస్‌యూవీ భవిష్యత్తు కొత్తగా హైబ్రిడ్ దారివైపు మళ్లుతుందని అనుకోవచ్చు.


హైలక్స్ ఎంహెచ్ఈవీ ప్రాథమికంగా 2.8 లీటర్ డీజిల్ ఇంజన్‌పై ఆధారపడింది. ఇది మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో రానుంది. ఇందులో ఉన్న 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ మైలేజీని పెంచడానికి, డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగవ్వడానికి ఉపయోగపడుతుంది. హైలక్స్ మైల్డ్ హైబ్రిడ్ కూడా ఒక చిన్న బ్యాటరీ, మోటారును కలిగి ఉంది. ఇది కారు టార్క్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ప్రామాణిక డీజిల్ ఇంజిన్‌తో పోలిస్తే ఇది మైలేజీని 10 శాతం వరకు పెంచడంలో సహాయపడుతుంది.


ఇందులో మార్పుల గురించి మాట్లాడినట్లయితే హైలక్స్ ఆఫ్ రోడ్ సామర్థ్యంలో ఎటువంటి మార్పు లేదు. టయోటా తెలుపుతున్న దాని ప్రకారం హైలక్స్ మైల్డ్ హైబ్రిడ్ 70 సెంటీమీటర్ల లోతైన నీటిలోకి ప్రవేశించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని కారణంగా ఈ డీజిల్ ఇంజన్ దాని ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌లో ఎక్కువ కాలం పనిచేయగలదు.


ఈ తేలికపాటి హైబ్రిడ్ హైలక్స్ యూరప్ అంతటా, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలో కూడా సేల్‌కు రానుంది. ఫార్చ్యూనర్‌ను భారతదేశంలో కూడా ఈ ఇంజిన్‌తో విక్రయిస్తున్నారు. హైలక్స్, ఫార్ట్యూనర్ రెండూ ఇక్కడే తయారు అవుతున్నాయి. ఈ ఇంజన్ కార్బన్ ఎమిషన్స్‌ను తగ్గించడం, మైలేజీని పెంచడంపై దృష్టి సారిస్తోంది. భవిష్యత్తులో మరింత మైల్డ్ హైబ్రిడ్ ఎంపికను కూడా పొందవచ్చు.


ముఖ్యమైన విషయం ఏమిటంటే హైలక్స్ తర్వాత, ఎంహెచ్ఈవీ టెక్నాలజీ గ్లోబల్ మార్కెట్ కోసం ఫార్చ్యూనర్‌లో కూడా అందుబాటులోకి రానుంది. అందువల్ల ఈ సాంకేతికత భారతదేశంలో మొదట ఫార్చ్యూనర్‌లో, తరువాత హైలక్స్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే ఫార్చ్యూనర్ భారతదేశంలో పెద్ద సంఖ్యలో అమ్ముడవుతోంది.


భారతదేశంలో డీజిల్ ఇంజన్ల టెస్టింగ్ పెరుగుతోంది. ఉద్గార నిబంధనలు కూడా కఠినతరం అవుతున్నాయి. డీజిల్ ఇంజిన్‌లు, ఫార్చ్యూనర్ వంటి పెద్ద ఎస్‌యూవీల భవిష్యత్తు మైల్డ్ హైబ్రిడ్‌ల లాంచ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది వాహనాల జీవిత కాలాన్ని పెంచుతుంది. టయోటా దీని అసలు మైలేజీని వెల్లడించనప్పటికీ, హైలక్స్ మైల్డ్ హైబ్రిడ్ గురించిన మరింత సమాచారం రాబోయే రోజుల్లో వెల్లడి కానుంది.


టయోటా పెట్రోల్ జీఎక్స్ వేరియంట్ ఆధారంగా ఇన్నోవా హైక్రాస్ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 20.07 లక్షల నుంచి రూ. 20.22 లక్షల మధ్య ఉండనుంది. ఈ కారు ధర స్టాండర్డ్ జీఎక్స్ వేరియంట్ కంటే రూ. 40,000 ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో కొన్ని మార్పులు కూడా చేశారు. ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్ మాత్రం చాలా తక్కువగా చేశారు. మధ్యలో ఉన్న గ్రిల్‌పై కొత్త క్రోమ్ గార్నిష్, ముందూ వెనుకా ఉన్న బంపర్‌ల్లో కొత్త ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌లు చూడవచ్చు. కానీ దాని ప్లాటినం వైట్ ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్ కోసం మీరు అదనంగా రూ.9,500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. తక్కువ జీఎక్స్ ట్రిమ్‌పై రూపొందిన కారణంగా హైఎండ్ వేరియంట్లలో లభించే బంపర్ గార్నిష్, పెద్ద అల్లాయ్ వీల్స్ ఇందులో లేవు.


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!