Toyota November 2025 Deals: టయోటా, ఈ నవంబర్ నెలలో మంచి వార్త చెప్పింది. ఫెస్టివ్ సీజన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలను సాధించిన తర్వాత, ఇప్పుడు, తన ప్రముఖ మోడళ్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. దాదాపు తన మొత్తం లైనప్‌ను డిస్కౌంట్ పరిధిలోకి తీసుకొచ్చింది.
టయోటా కార్ ఆఫర్స్ - నవంబర్ 2025
Toyota Land Cruiser 300టయోటా లైన్‌అప్‌లో అత్యంత ఖరీదైన SUV అయిన ల్యాండ్ క్రూయిజర్ 300పై ఈ నెలలో రూ.13.17 లక్షల వరకు భారీ తగ్గింపు లభిస్తోంది. ZX, GR-S ట్రిమ్‌లలో లభించే ఈ ఫ్లాగ్‌షిప్ SUV ధరలు రూ.2.16 కోట్ల నుంచి రూ.2.25 కోట్ల వరకు ఉన్నాయి.
Toyota Vellfireరూ.10.85 లక్షల వరకు తగ్గింపుతో వెల్ల్‌ఫైర్ రెండో అత్యధిక డిస్కౌంట్ పొందిన మోడల్. హై వెర్షన్ ధర రూ.1.2 కోట్ల నుంచి ప్రారంభమై, VIP ఎగ్జిక్యూటివ్ లాంజ్ వేరియంట్ రూ.1.3 కోట్ల వరకు ఉంటుంది.
Toyota Camryసెడాన్ విభాగంలో లభించే క్యామ్రీపై రూ.5.43 లక్షల వరకు ఆఫర్ ఉంది. ఎలిగెంట్, స్ప్రింట్ ఎడిషన్‌ల ధరలు రూ.47.48 లక్షలుగా ఉన్నాయి. అదనంగా ప్లాటినం వైట్ పెయింట్ ఆప్షన్ కోసం రూ.14,000 అదనంగా చెల్లించాలి.
Toyota Hyryderమారుతి గ్రాండ్ విటారాకు ట్విన్ మోడల్‌గా ఉన్న హైరైడర్‌పై రూ.1.51 లక్షల వరకు తగ్గింపును ప్రకటించారు. ఈ SUV ధరలు రూ.10.95 లక్షల నుంచి రూ.19.76 లక్షల వరకు ఉన్నాయి.
Toyota Glanzaహైరైడర్ తరువాత గ్లాంజాపై రూ.1.27 లక్షల వరకు ఆఫర్ లభిస్తోంది. మారుతి బాలెనో ఆధారంగా రూపొందిన ఈ హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ.6.39 లక్షల నుంచి రూ.9.15 లక్షల వరకు ఉన్నాయి.
Toyota Taisorమారుతి ఫ్రాంక్స్‌కి బ్యాడ్జ్ ఇంజినీర్డ్ వెర్షన్‌గా వచ్చిన టైసర్ SUVపై రూ.1.17 లక్షల వరకు ఆఫర్ నడుస్తోంది. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO వంటి మోడళ్లతో ఇది పోటీ పడుతోంది. ధరలు రూ.7.21 లక్షల నుంచి రూ.12.06 లక్షల వరకు ఉన్నాయి.
Toyota Fortunerభారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVల్లో ఒకటైన ఫార్చ్యూనర్‌పై రూ.1 లక్ష వరకు తగ్గింపు లభిస్తోంది. స్టాండర్డ్, లెజెండర్, GR-S మోడళ్ల ధరలు రూ.33.65 లక్షల నుంచి రూ.48.85 లక్షల వరకు ఉన్నాయి.
Toyota Hiluxపికప్ ట్రక్ సిగ్మెంట్‌లో ఉన్న హైలక్స్‌పై కూడా రూ.1 లక్ష వరకు ఆఫర్ ప్రకటించారు. స్టాండర్డ్, హై ట్రిమ్‌ల ధరలు రూ.28.02 లక్షల నుంచి రూ.35.37 లక్షల వరకు ఉన్నాయి.
Toyota Innova Crystaఈ సెగ్మెంట్‌లో ల్యాడర్-ఫ్రేమ్ MPVగా ఉన్న ఇన్నోవా క్రిస్టాపై రూ.70,000 వరకు ఆఫర్ ఉంది. GX నుంచి ZX వేరియంట్‌ల ధరలు రూ.18.66 లక్షల నుంచి రూ.25.36 లక్షల వరకు ఉన్నాయి.
Toyota Rumionమారుతి ఎర్టిగా ఆధారంగా వచ్చిన రూమియన్ MPVపై రూ.35,000 వరకు తగ్గింపును టయోటా ప్రకటించింది. S, G, V ట్రిమ్‌ల ధరలు రూ.10.44 లక్షల నుంచి రూ.13.61 లక్షల వరకు ఉన్నాయి.
ఈ ఆఫర్లు నగరానికీ, డీలర్ స్టాక్ లభ్యతకీ అనుగుణంగా మారవచ్చని టయోటా స్పష్టం చేసింది. కాబట్టి, సమీప టయోటా షోరూమ్‌లో ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.