ప్రస్తుతం మనదేశంలో ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది. ఎస్‌యూవీల సేల్స్ కూడా మెల్లగా వేగం పుంజుకుంటున్నాయి. టొయోటా ఇటీవలే మనదేశంలో కొత్త అర్బన్ క్రూజర్ హైరైడర్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. దీని వెయిటింగ్ పీరియడ్ ఐదు నుంచి ఆరు నెలల మధ్యలో ఉంది. అలాగే మారుతి సుజుకి గ్రాండ్ విటారా వెయిటింగ్ పీరియడ్ కూడా అంతే. దీనికి ఏకంగా 50 వేలకు పైగా ప్రీ-లాంచ్ బుకింగ్స్ రావడం విశేషం. ఇక మహీంద్రా స్కార్పియో ఎన్ డెలివరీలు అయితే 2024లో ప్రారంభంలో జరగనున్నాయి. ఒకవేళ దీపావళి పండుగ నాటికి కొత్త కారు మీ చేతికి రావాలనుకుంటే ఈ ఆప్షన్లు ట్రై చేయడం బెస్ట్.
1. రెనో కిగర్ (నాలుగు నుంచి ఆరు వారాలు)
ఈ విభాగంలో రెనో కిగర్ కంటే హ్యుండాయ్ వెన్యూ, టాటా నెక్సాన్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ కిగర్ కూడా మరీ తీసి పారేయదగ్గ కారేమీ కాదు. అద్భుతమైన ఎక్స్‌టీరియర్ డిజైన్, స్టైలింగ్‌ను ఇందులో అందించారు. దీన్ని మనదేశంలోని యువ వినియోగదారుల కోసం రూపొందించారు. ఈ కారు వెయిటింగ్ పీరియడ్ నాలుగు నుంచి ఆరు వారాల మధ్యలో ఉంది.
2. టాటా నెక్సాన్ (ఎనిమిది నుంచి 10 వారాలు)
ప్రస్తుతం హైదరాబాద్‌లో టాటా నెక్సాన్ ఎస్‌యూవీ వెయిటింగ్ పీరియడ్ మూడు నుంచి నాలుగు నెలల మధ్యలో ఉంది. అయితే కొన్ని వేరియంట్లను మాత్రం అంతకు ముందే పొందవచ్చు. దీనికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగానే ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ కారు అమ్మకాలు ఏకంగా 51 శాతం పెరగడం విశేషం. ఈ కారును ఇప్పటికి ఇప్పుడు ఆర్డర్ చేస్తే దీపావళికి కొంచెం అటూఇటుగా డెలివరీ కానుంది.
3. నిస్సాన్ మ్యాగ్నైట్ (ఒకటి నుంచి మూడు నెలలు)
సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మరో సక్సెస్‌ఫుల్ కారు ఇదే. ఇది ఒక బడ్జెట్ ఫ్యామిలీ ఎస్‌యూవీ. నిస్సాన్ మ్యాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ పేపర్ మీద కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నా కొందరు డీలర్లు వారి దగ్గర స్టాక్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇవి త్వరగానే డెలివరీ అయ్యే అవకాశం ఉంది.
4. మారుతి సుజుకి బ్రెజా (ఒక నెల)
కొత్త బ్రెజా కారు మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న కార్లలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం హైదరాబాద్‌లో దీని వెయిటింగ్ పీరియడ్ నెలలోపే ఉందని తెలుస్తోంది. అది కూడా కొన్ని వేరియంట్ల మీదనే. కొన్ని వేరియంట్లు కొనాలంటే వెయిటింగ్ తప్పదు.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?