Top Mileage Cars in India | భారతదేశ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న కారణంగా ఇప్పుడు కేవలం స్టైల్, ఫీచర్లను మాత్రమే కాకుండా మైలేజ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకవేళ మీ బడ్జెట్ రూ. 10 లక్షలు అయితే, మార్కెట్‌లో ఈ ధరలో పలు కంపెనీల ఉత్తమ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లు అద్భుతమైన ఇంధన సామర్థ్యంతో పాటు లగ్జరీ, ప్రీమియం ఫీచర్లు సహా మోడ్రన్ లుక్‌తో వస్తాయి. ఈ కార్ల గురించి తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఆల్టో K10
మీరు తొలిసారి కారు కొనుగోలు చేయాలనుకుంటే, బడ్జెట్ పరిమితంగా ఉంటే, మారుతి ఆల్టో K10 ఒక అద్భుతమైన ఎంపిక. దీని ధర రూ. 3.7 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. Maruti Suzuki Alto K10 కారు దాదాపు 24.8 km/l మైలేజ్ ఇస్తుంది. ఆల్టో K10 కాంపాక్ట్ సైజు, తక్కువ మెయింటనెన్స్ ఖర్చు, సులభమైన నిర్వహణ కారణంగా కొత్త డ్రైవర్లకు ఇది ఫేమస్ అయింది. రోజువారీ ఆఫీసుకు వెళ్లడానికి లేదా నగరంలో రోజువారీ చిన్న ప్రయాణాల కోసం నమ్మదగిన, చవకైన కారు మారుతి ఆల్టో కే10.
మారుతి సుజుకి వాగన్ R
మారుతి వాగన్ R భారతదేశంలో అత్యంత నమ్మదగిన, కస్టమర్ల పొందిన ఫ్యామిలీ కార్లలో ఒకటి. దాదాపు రూ. 5 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారు గరిష్టంగా 26.1 km/l మైలేజ్ ఇస్తుంది. దీని అధిక సీటింగ్ పొజిషన్, పెద్ద క్యాబిన్ స్పేస్, మెరుగైన వీక్షణ దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. మారుతి వాగన్ ఆర్ (Maruti WagonR) నగర ట్రాఫిక్‌లో కూడా చాలా సులభమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అందుకే ఇది చాలా మందికి ఆల్-రౌండర్ ఎంపికగా మారింది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్
మీరు కారు స్టైల్, మైలేజ్ రెండూ కోరుకునే వారు అయితే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పవచ్చు. ఈ కారు దాదాపు రూ. 5.7 లక్షల ప్రారంభ ధరకు లభిస్తుంది. ఎక్స్‌టర్ కారు 19 km/l వరకు మైలేజ్ ఇస్తుంది. ఎక్స్‌టర్ దాని ఆధునిక SUV లుక్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఫీచర్-రిచ్ ఇంటీరియర్ కారణంగా యువతను బాగా ఆకర్షిస్తోంది. బడ్జెట్‌లో SUV లాంటి లుక్, ఫీల్ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్.
టాటా పంచ్
టాటా పంచ్ (Tata Punch) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో SUVలలో ఒకటి. దీని బేస్ మోడల్ దాదాపు రూ. 6 లక్షలకు మార్కెట్లో లభిస్తుంది. టాటా పంచ్ దాదాపు 18 km/l మైలేజ్ ఇస్తుంది. టాటా పంచ్ దాని బలమైన బిల్డ్ క్వాలిటీ, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో ఫేమస్ అయింది. ప్రీమియం ఇంటీరియర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎత్తు-సర్దుబాటు సీట్లు వంటి ఫీచర్లు ఇచ్చారు. చిన్న కుటుంబాలకు సురక్షితమైన, స్టైలిష్, నమ్మదగిన SUV టాటా పంచ్.
Also Read: Mahindra New SUV: మహీంద్రా XUV7XO బుకింగ్, లాంచ్ డేట్ ఫిక్స్.. ధర ఎంత, కొత్త టీజర్ లో ఇవి గమనించారా