మహీంద్రా తన రాబోయే కొత్త SUV XUV7XO కు సంబంధించి మరో టీజర్‌ను విడుదల చేసింది. ఈ SUVని భారత మార్కెట్లోకి జనవరి 5, 2026న విడుదల చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది. మహీంద్రా XUV7XO ప్రీ-బుకింగ్ డిసెంబర్ 15 నుండి ప్రారంభమవుతుంది. దీని కోసం రూ. 21,000 టోకెన్ అమౌంట్ కట్టాలి. Mahindra XUV7XO వాస్తవానికి XUV700 మోడల్‌కు సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వేరియంట్. ఇది డిజైన్, ఫీచర్ల పరంగా అనేక పెద్ద మార్పులతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
కొత్త టీజర్‌లో కొత్త రంగు, కొత్త లుక్ చూడవచ్చు
కొత్త టీజర్‌లో మహీంద్రా XUV7XO ఎరుపు రంగులో చూడవచ్చు. ఇది మునుపటి కంటే మరింత స్పోర్టీ లుక్ ఇస్తుంది. SUVలో కొత్త ఫ్రంట్ గ్రిల్, నలుపు రంగు ORVMలు, కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. హెడ్‌ల్యాంప్‌ల డిజైన్ 2 భాగాలుగా కనిపిస్తుంది. దీనితో పాటు, SUVలో మార్పు చేసిన బంపర్, కొత్త LED DRLలు, వెనుక భాగంలో పూర్తి-వెడల్పు లైట్ బార్‌ను కూడా ఆశిస్తున్నారు. అయితే బోనెట్, ఫెండర్, డోర్స్ మెటల్ షీట్‌లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
లోపలి భాగం మరింత ప్రీమియం, హై-టెక్
Mahindra XUV7XO ఇంటీరియర్ కూడా చాలా ప్రీమియంగా ఉండబోతోంది. ఇందులో 3 స్క్రీన్‌లతో కూడిన పెద్ద సెటప్ ఉండవచ్చు. ఇటీవల XEV 9eలో కూడా అలాగే కనిపించింది. ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. ముందు, వెనుక వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్, స్లైడింగ్ సెకండ్-రో సీట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో (Android Auto), ఆపిల్ కార్ ప్లే (Apple CarPlay), వైర్‌లెస్ ఛార్జర్ వంటి సౌకర్యాలు లభిస్తాయని భావిస్తున్నారు.
ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్):బేస్ మోడల్ (MX పెట్రోల్ 7-సీటర్): ₹13.66 లక్షలకు ప్రారంభంటాప్ మోడల్ (AX7L డీజిల్ AT AWD): సుమారు ₹23.71 లక్షలుఆటోమేటిక్ వేరియంట్ (అత్యంత చవకైనది): సుమారు ₹21.14 లక్షలు (AX5 పెట్రోల్ AT) అని ప్రస్తుతానికి ప్రచారం జరుగుతోంది. కొత్త మోడల్ ధరలపై కంపెనీ మరిన్ని వివరాలు త్వరలో అందజేయనుంది. రెండు రోజుల్లో బుకింగ్స్ ప్రారంభించనున్నామని మహీంద్రా కంపెనీ తెలిపింది.
భద్రత, ఇంజిన్‌లో కొత్తగా ఏముంది..
భద్రత కోసం మహీంద్రా XUV7XOలో లెవెల్-2 ADAS మరింత మెరుగుపరిచారు. మహీంద్రా XUV7XOలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సహా హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటాయి. ఇంజిన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు. ఇందులో అదే 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఎంపికలు ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 200 PS ఎనర్జీ ఇస్తుంది. అయితే డీజిల్ ఇంజిన్ 185 PS వరకు శక్తినిస్తుంది. డీజిల్ వేరియంట్‌లో మాత్రమే AWD ఆప్షన్ లభిస్తుంది.