Adventure Motorcycles India 2025: భారత మోటార్‌సైకిల్ మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా, యువత కమ్యూటర్ బైక్స్‌కే పరిమితం కాకుండా... ట్రావెల్‌, ట్రైల్‌, లైఫ్‌స్టైల్‌ను కలిపిన బైక్స్‌ను ఎంచుకుంటోంది. దీని ఫలితంగా శక్తిమంతమైన ఇంజిన్‌, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వచ్చే ప్రీమియం అడ్వెంచర్ బైక్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.

Continues below advertisement

2025 సంవత్సరం భారత అడ్వెంచర్ బైక్ ప్రేమికులకు ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఏడాది కొన్ని ఆసక్తికరమైన ADV (అడ్వెంచర్) మోడళ్లు మార్కెట్‌లోకి వచ్చాయి. వాటిలో టాప్‌ 5 అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను ఒకసారి గుర్తు చేసుకుందాం.

TVS Apache RTX 300

Continues below advertisement

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.1,99,0002025లో లాంచ్ అయి, అత్యంత హైప్‌ పొందిన అడ్వెంచర్ బైక్‌లలో అపాచీ RTX 300 ఒకటి. గట్టి స్టాన్స్‌, మోడ్రన్ డిజైన్‌, ఆల్‌రౌండర్ స్వభావం దీనికి బలం. ఇందులో ఉన్న 300 సీసీ ఇంజిన్‌ లో & మిడ్‌ రేంజ్‌లో మెరుగైన ట్రాక్టబిలిటీ ఇస్తుంది. టార్మాక్‌తో పాటు గ్రావెల్ రోడ్లపై కూడా నమ్మకంగా నడిచేలా టీవీఎస్ ఈ బైక్‌ను రూపొందించింది.

2025 KTM 390 Adventure

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.3,94,6992025లో అప్‌డేట్ అయిన కేటీఎం 390 అడ్వెంచర్, టూవీలర్‌ మార్కెట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులోని 399cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ ఇప్పటికే పరిచయమైనదే. కానీ కొత్త ఎర్గోనామిక్స్‌, పెరిగిన సస్పెన్షన్ ట్రావెల్ దీనిని లాంగ్ రైడ్స్‌కు మరింత అనుకూలంగా మార్చాయి. మామూలు రోడ్డు మీద, ఆఫ్‌రోడ్‌లోనూ ఒకే ఆత్మవిశ్వాసం చూపించే బైక్ ఇది.

2025 KTM 390 Enduro R

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.3,39,227390 అడ్వెంచర్ కంటే మరింత ఆఫ్‌రోడ్ ఫోకస్‌తో వచ్చిన బైక్‌ 390 ఎండ్యూరో R. ఇదీ 399cc ఇంజిన్‌ వాడుతుంది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్‌, అగ్రెసివ్ ట్రైల్ టైర్లు దీని అసలైన బలం. హార్డ్‌కోర్ ఆఫ్‌రోడింగ్ ఇష్టపడే రైడర్లకు ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది.

Hero Xpulse 210

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.1,62,065హీరో ఎక్స్‌పల్స్ 210 తక్కువ బరువుతో ఈజీ హ్యాండ్లింగ్ ఇచ్చే అడ్వెంచర్ బైక్. ఇందులోని 210cc ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌, రైడర్‌కు ఉపయోగకరమైన పవర్‌పైనే ఫోకస్‌ పెడుతుంది. ట్రికీ ట్రైల్‌లపైనా ఈ మోటార్‌సైకిల్‌ను సులువుగా నడిపించవచ్చు. డాకార్ ర్యాలీ అనుభవాన్ని హీరో ఈ బైక్ డిజైన్‌లో స్పష్టంగా ఉపయోగించింది.

Kawasaki KLX230

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ.1,84,000సింపుల్‌, లీన్ డిజైన్‌తో వచ్చే KLX230 రగ్డ్ నేచర్‌పై ఫోకస్ పెట్టింది. ఇందులో ఉన్న 233cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ మంచి పవర్ ఇస్తుంది. మెయింటెనెన్స్ సులువు, హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది. డర్ట్ రోడ్లపై నమ్మకంగా నడిచే ఈ బైక్ అడ్వెంచర్ రైడింగ్‌లోకి కొత్తగా అడుగు పెట్టే వారికి సరైన ఎంపిక.

2025లో లాంచ్ అయిన ఈ ఐదు అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లు ప్రతి రైడర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చాయి. మీరు లాంగ్ టూరింగ్ కోరుకున్నా, హార్డ్‌కోర్ ఆఫ్‌రోడింగ్ ఇష్టపడినా, లేదా అడ్వెంచర్ రైడింగ్‌లోకి కొత్తగా రావాలనుకున్నా – ఈ లిస్ట్‌లో మీకు సరిపోయే బైక్ తప్పకుండా ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.