ఈ రోజుల్లో చాలా మంది SUVలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. మంచి లుక్, అంతకు మించి ఫీచర్లు, సేఫ్ అండ్ సెక్యూరిటీ జర్నీకి అనుకూలంగా SUVలు ఉండటంతో  వాటినే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో SUVలు ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో 40 శాతంగా ఉన్నాయి. ఇక లేటెస్ట్ SUVలను కొనుగోలు చేయాలి అనుకునే వారు మంచి బూట్ స్పేస్‌ ఉన్న వాహనాలనే ఎంచుకుంటున్నారు. దేశంలో రూ. 10 లక్షల లోపు అత్యుత్తమ బూట్ స్పేస్ కలిగిన SUVలు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..   


 Renault Kiger 405L


రెనాల్ట్ కిగర్ 405 లీటర్ల బూట్ స్పేస్‌తో నెంబర్ వన్ గా ఉంది. రెనాల్ట్ కిగర్ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). రెనాల్ట్ కిగర్‌ను రెండు ఇంజన్ ఎంపికలతో వినియోగదారులకు అందుబాటులో ఉంది. 71 bhp, 96 nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0 L పెట్రోల్ ఇంజన్ తో పాటు 98.63 bhp, 160 nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0 L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. కిగర్ ఎస్‌యూవీకి దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుంది.


నిస్సాన్ కిక్స్ 400L


నిస్సాన్ కిక్స్ ఈ లిస్టులో సెకెండ్ ప్లేస్ లో ఉంది.  ఇది 405 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.   నిస్సాన్ ఈ కారు అమ్మకాలను భారీగా పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా పెద్దగా సక్సెస్ కావడం లేదు. రూ.10 లక్షల లోపు ధర కలిగిన ఏకైక కాంపాక్ట్ SUV కూడా ఇదే. నిస్సాన్ రెండు ఇంజన్ ఎంపికలలో వస్తుంది. 104.5 bhp, 142 nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5 L  నేచురల్లీ అస్పిరేటెడ్ ఇంజన్, 153.8 bhp, 254 nm టార్క్ ఉత్పత్తి చేసే 1.3 L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది.  నిస్సాన్ కిక్స్ ధర రూ. 9.50 లక్షలు (ఎక్స్-షోరూమ్).


కియా సోనెట్ 392L


కియా సోనెట్ అనేది ఒక సబ్-కాంపాక్ట్ SUV. ఇది పలు రకాల ఇంజన్ ఎంపికలతో వస్తుంది. కియా మూడు ఇంజన్ ఎంపికలలో సోనెట్‌ను అందిస్తుంది - 81.9 bhp,  115 nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.2 L నేచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 118.3 bhp,  172 nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0 L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్,   MT వెర్షన్, AT వెర్షన్ కోసం 113.4 bhp, 240 nm టార్క్ తో లభిస్తుంది. కియా సోనెట్ ప్రారంభ ధర రూ.7.49 లక్షలు. కియా సోనెట్ 392 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది.


టాటా పంచ్ 366L


టాటా పంచ్ అత్యంత సరసమైన SUV.  దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.93 లక్షలు. ఇది 366 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది. టాటా ఒకే ఇంజన్ ఎంపికలో పంచ్‌ను అందిస్తుంది.  84.8 bhp, 113 nm టార్క్ ఉత్పత్తి చేసే 1.2 L పెట్రోల్ ఇంజన్ ఉంది.  


హోండా WRV 363L


హోండా WRV జాజ్/ఫిట్  అండర్‌పిన్నింగ్‌లను కలిగి ఉంది. ఈ  SUV చాలా బాగా బ్యాలెన్స్‌డ్ డ్రైవ్‌ను అందిస్తుంది. హోండా డబ్ల్యుఆర్‌విని రూ. 9.11 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు అందిస్తుంది. హోండా WRV 363 లీటర్ల బూట్ స్పేస్‌ ను కలిగి ఉంది.