Best Neo retro motorcycles 2025: 2025 సంవత్సరం నియో రెట్రో మోటార్‌సైకిళ్లకు ప్రత్యేకంగా నిలిచింది. క్లాసిక్ డిజైన్‌ను ఇష్టపడుతూనే మోడ్రన్ టెక్నాలజీ కూడా కావాలనుకునే బైకర్లకు ఈ సెగ్మెంట్ అసలైన పండుగలా మారింది. ఇంజిన్ పవర్, ఫీచర్లు ఎంత ముఖ్యమైనా... ఈ బైకులను చూసిన వెంటనే కలిగే ఫీలింగే అసలైన మ్యాజిక్. గతాన్ని గుర్తు చేసే డిజైన్, ఈ కాలానికి సరిపోయే ఇంజినీరింగ్‌తో 2025లో లాంచ్ అయిన ఈ ఐదు నియో రెట్రో బైకులు ప్రత్యేకంగా నిలిచాయి, బైకర్ల మనస్సు దోచుకున్నాయి.
Honda CB350C
హోండా, తన 350 సీసీ నియో రెట్రో లైనప్‌ను CB350Cతో మరింత విస్తరించింది. ₹1.88 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఈ బైక్ కేవలం హోండా BigWing షోరూమ్‌లలోనే లభిస్తుంది. కొత్త కలర్ స్కీమ్, డీకల్స్, గ్రాబ్ రైల్, ఫెండర్స్, సీట్స్‌లో చిన్న మార్పులతో ఇది మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది.
348 సీసీ సింగిల్ సిలిండర్ FI ఇంజిన్ ఇందులో ఉంది. ఇది 20.7 bhp శక్తి, 29.5 Nm టార్క్ ఇస్తుంది. సిటీ రైడింగ్‌కు సరిపడే టార్క్‌తో పాటు హైవేపై కూడా ప్రశాంతంగా క్రూయిజ్ చేసే సామర్థ్యం దీని బలం.
Honda CB650R
CBR650Rకు నేకడ్ వెర్షన్‌లా కనిపించే Honda CB650R అసలైన నియో రెట్రో స్టైల్‌కు బెస్ట్ ఉదాహరణ. Candy Chromosphere Red, Matte Gunpowder Black Metallic కలర్ ఆప్షన్‌ల్లో లభిస్తుంది. మోడ్రన్ ఫీచర్లతో పాటు రెట్రో డిజైన్ లాంగ్వేజ్ దీని ప్రత్యేకత.
649 సీసీ లిక్విడ్ కూల్డ్, ఇన్‌లైన్ ఫోర్ ఇంజిన్ ఇందులో ఉంది. ఇది 12,000 rpm వద్ద 94 bhp శక్తి, 9,500 rpm వద్ద 63 Nm టార్క్ ఇస్తుంది. ఇప్పుడు E-Clutch కూడా అందిస్తున్నారు. ధర ₹10.30 లక్షలు ఎక్స్-షోరూమ్.
Royal Enfield Hunter 350
Hunter 350 కొత్తది కాదు. కానీ 2025 వెర్షన్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ దీనిని మరింత మెరుగుపరిచింది. కొత్త కలర్స్‌తో పాటు LED హెడ్‌ల్యాంప్స్, టైప్ C ఫాస్ట్ ఛార్జర్, కొత్త హ్యాండిల్‌బార్, మెరుగైన సీట్ ఫోమ్ ఇచ్చారు.
గ్రౌండ్ క్లియరెన్స్ పెంచేందుకు ఎగ్జాస్ట్ రీ రూట్ చేశారు. స్లిప్పర్ క్లచ్, కొత్త రియర్ సస్పెన్షన్‌తో కంఫర్ట్ కూడా మెరుగైంది. ధర ₹1.37 లక్షలు ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభమవుతుంది.
Royal Enfield Classic 650
Classic 650 రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బైక్. 650 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ స్మూత్‌నెస్, శక్తిమంతమైన టార్క్, థ్రిల్ పంచే ఎగ్జాస్ట్ నోట్‌కు ఇది ప్రసిద్ధి.
Super Meteor, Shotgun 650 తరహా ఫ్రేమ్, Showa ట్యూన్ చేసిన సస్పెన్షన్, డ్యూయల్ సీట్స్‌తో ఇది క్లాసిక్ లుక్‌ను అలాగే ఉంచుతూ క్వాలిటీని మరో స్థాయికి తీసుకెళ్లింది. ధర ₹3.61 లక్షలు ఎక్స్-షోరూమ్.
Triumph Speed Twin 1200
ట్రయంఫ్ Speed Twin 1200 ఈ జాబితాలో డిజైన్ పరంగా టాప్‌లో నిలుస్తుంది. టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, సర్క్యులర్ హెడ్‌ల్యాంప్, బార్ ఎండ్ మిరర్స్, ట్విన్ ఎగ్జాస్ట్‌లు దీన్ని సిసలైన రెట్రోలా చూపిస్తాయి.
1200 సీసీ లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ 103 bhp శక్తి, 112 Nm టార్క్ ఇస్తుంది. కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర ₹13.84 లక్షలు ఎక్స్-షోరూమ్.
మొత్తానికి, 2025లో లాంచ్ అయిన ఈ నియో రెట్రో బైకులు ఒక్కోటి ఒక్కో స్టైల్ స్టేట్‌మెంట్. క్లాసిక్ డిజైన్ ఎప్పటికీ పాతబడదని, సరైన మోడ్రన్ టచ్ ఇస్తే అది ఇంకా అందంగా మారుతుందని ఈ బైకులు మరోసారి నిరూపించాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.