Top 5 Automatic Cars Under Rs 10 Lakh: ప్రస్తుతం మనదేశంలో ఆటోమేటిక్ కార్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. వీటివైపు వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో డ్రైవర్‌పై ఇవి ఎక్కువ ప్రెజర్ పెట్టవు. అలాగే కార్ల కొనుగోలుదారులు కూడా రూ.10 లక్షల్లోపు ధరను ప్రిఫర్ చేస్తున్నారు. నిజానికి ఈ ధర రేంజ్‌లో ఎన్నో కార్లు అందుబాటులో ఉన్నాయి. రూ.10 లక్షల్లోపు ధరలో అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఏవో చూద్దాం.




హ్యుందాయ్ ఐ20 (Hyundai i20)
రూ.10 లక్షల్లోపు ఆటోమేటిక్ కార్ల కోసం చూడాలంటే హ్యుందాయ్ ఐ20 మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో కొత్త గ్రిల్, డీఆర్ఎల్స్, టెయిల్ ల్యాంప్స్‌ను ఇన్‌స్టాల్ చేశారు. దీని కారణంగా కారు లుక్స్ బాగా మెరుగయ్యాయి. ఈ కారు ధర రూ.9.38 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎక్స్ షోరూం ధర అనేది గుర్తుంచుకోవాలి.




టాటా టియాగో (Tata Tiago)
ఇందులో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. టాటా టియాగో ఎక్స్ షోరూం ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. టియాగో ఎలక్ట్రిక్ వేరియంట్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే నాన్ స్టాప్‌గా 315 కిలోమీటర్లు కొట్టేయచ్చన్న మాట. అలాగే ఈ కారు 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.7 సెకన్లలోనే అందుకోనుంది.




మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
ఇటీవలి కాలంలో మారుతి సుజుకి లాంచ్ చేసిన మంచి కార్లలో ఫ్రాంక్స్ ఒకటి. ఈ కారులో 1.0 లీటర్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజిన్ అందించారు. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కారు ధర మనదేశంలో రూ.8.37 లక్షల నుంచి ప్రారంభం కానుంది.




టయోటా గ్లాంజా (Toyota Glanza)
టయోటా పోర్ట్ ఫోలియోలో ఉన్న బెస్ట్ కార్లలో టయోటా గ్లాంజా ముందంజలో ఉంటుంది. ఈ కారులో కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ కారు ఏకంగా 22.94 కిలోమీటర్ల మైలేజీని అందించనుందని కంపెనీ తెలిపింది. టయోటా గ్లాంజా ధర రూ.8.25 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎక్స్ షోరూం ధర.




హోండా అమేజ్ (Honda Amaze)
హోండా అమేజ్ లుక్ కూడా ప్రీమియం తరహాలో ఉంటుంది. ఈ కారు లీటరు ఫ్యూయల్‌కు 18.6 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది. ఇందులో 1199 సీసీ ఇంజిన్‌ను అందించారు. హోండా అమేజ్ ఎక్స్ షోరూం ధర రూ.7.15 లక్షల నుంచి ప్రారంభం కానుంది. తక్కువ ధరలో ఆటోమేటిక్ కారు కావాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. కొత్త హోండా అమేజ్ కూడా త్వరలో మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. కొత్త అమేజ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.2 లీటర్ 4 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తోనే రానుందని నివేదికలు సూచిస్తున్నాయి.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!