దేశీయ మార్కెట్లో రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. పెట్రో ధరలు పెరగడంతో పాటు పొల్యూషన్ ప్రీ జర్నీ పట్ల ప్రజల్లో అవగాహన రావడంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. గతేడాది దేశంలో  2,25,000 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోని టాప్ 4 ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్టో చూడండి.


1. ఓలా ఎలక్ట్రిక్:


కొత్త తరం ఓలా ఇ-స్కూటర్‌ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. S1, S1 ప్రో పేరుతో వినియోగదారులకు లభిస్తోంది. Ola S1 మిడ్ డ్రైవ్ IPM మోటార్‌తో పాటు 2.5 kWh బ్యాటరీతో పని చేస్తుంది. దీని ధర రూ. 79,999 నుండి రూ. 1,40,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. ఈ బైక్ ప్రస్తుతం  ఎయిర్, STD, ప్రో అనే మూడు వెర్షన్లలో అందుబాటులో ఉంది. Ola S1 3 kWh Li-ion బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 141 కిమీ రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. అయితే S1 ప్రో పెద్ద 4 kWh యూనిట్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కో ఛార్జీకి 181 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ రెండు 8.5 kW ఎలక్ట్రిక్ మోటార్లతో రన్ అవుతాయి.


2. బెన్లింగ్ ఆరా:


ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌ లో ఎక్కువ ఖర్చు చేయకూడదు అనుకునే వారికి ఈ బైక్ బెస్ట్ అనుకోవచ్చు.  బెన్లింగ్ ఆరా 2.5kW BLDC మోటార్‌ను కలిగి ఉంది.  72V/40Ah లిథియం-అయాన్ బ్యాటరీతో రన్ అవుతుంది. ధర విషయానికి వస్తే రూ. 91,600 (ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉంది. ఇది ఎకో మోడ్‌లో సగటున 120 కి.మీ పరిధితో 60 కి.మీ.ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఇది లో, స్పోర్ట్స్, టర్బో స్పీడ్ అనే మూడు మోడ్‌లను కలిగి ఉంది.  


3. TVS iQube:


పవర్ డ్రైవెన్ వెహికల్ కోసం చూసే వ్యక్తులకు ఇది పవర్ ఫుల్ ఎంపికగా చెప్పుకోవచ్చు. TVS iQube హబ్‌ను కలిగి ఉంది. 4.4 kW మౌంటెడ్ మోటార్‌తో పాటు 2.25kWh బ్యాటరీతో వస్తుంది. కంపెనీ ఇ-స్కూటర్‌ను మూడు వేర్వేరు వేరియంట్‌లలో అందిస్తోంది- స్టాండర్డ్, S,  STగా అందుబాటులో ఉంది. వీటి ధర రూ. 99,130 నుంచి రూ. 1.04 లక్షల వరకు ఉంటుంది. ఆయా వేరియంట్ ఆధారంగా   అత్యధికంగా 80 Kmph వేగాన్ని అందుకోగలదు.


4. ఏథర్ X:


ఏథర్ 450X ఫీచర్లతో కూడిన స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది 3.7 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో కలిపి 6 kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది.   ఈ ఎలక్ట్రిక్ స్కూటర్  ఒక్కసారి ఛార్జ్ చేస్తే 146 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ప్రస్తుతం, Ather 450X Gen 3 ధర రూ. 1.39 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) లక్షల్లో లభిస్తుంది.


Read Also: సరికొత్తగా స్కోడా కుషాక్ - యానివర్సరీ ఎడిషన్ లాంచ్, ధర, ఫీచర్లు మీ కోసం!