Top Most Two Wheeler Sales India: ఆగస్ట్ 2025లో, భారత టూ వీలర్ మార్కెట్‌లో భారీ ఉత్సాహం కనిపించింది. హీరో, హోండా, టీవీఎస్‌, బజాజ్ లాంటి బ్రాండ్లు మళ్లీ తమ శక్తిని చూపించాయి. మొత్తం టాప్ 10 మోడల్స్ కలిపి 12.5 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడవ్వగా, గతేడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి నమోదైంది.

అగ్రస్థానంలో Hero Splendor

Hero Splendor మళ్లీ తన పవర్‌ ప్రదర్శించింది, అజేయంగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ బైక్‌, ఒక్క ఆగస్ట్‌లోనే 3,11,698 యూనిట్లు అమ్ముడైంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈసారి దాదాపు 9,000 యూనిట్లు ఎక్కువ అమ్ముడవ్వడం దీని పాపులారిటీని స్పష్టంగా చూపిస్తోంది. ఎక్కువ మైలేజ్‌, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, సింపుల్‌ డిజైన్‌ కారణంగా స్ప్లెండర్‌ను టూ వీలర్ వర్గంలో కింగ్‌గా పిలుస్తున్నారు.

స్కూటర్ మార్కెట్‌ లీడర్ Honda Activa

హోండా యాక్టివా, స్కూటర్‌ విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆగస్ట్ 2025లో 2,44,271 యూనిట్ల సేల్స్‌తో ఇది రెండో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే 16,000 యూనిట్ల పెరుగుదల సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బండి కుటుంబాలకు, ఫస్ట్‌ టైమ్ బయ్యర్స్‌కి ఫేవరేట్‌గా ఉంది.

మూడో స్థానంలో Honda Shine

హోండా షైన్ 1,63,963 యూనిట్లు అమ్ముడైంది. అయితే గత ఏడాదితో పోలిస్తే 11,000 యూనిట్లు తక్కువ. 125cc సెగ్మెంట్‌లో కొత్త పోటీ పెరగడం షైన్ సేల్స్‌ను కొంత తగ్గించింది. అయినా ఆఫీస్‌ గోయర్స్‌కి ఇది ఇంకా పాపులర్‌ ఛాయిస్‌.

గ్రోత్‌ సెన్సేషన్ TVS Jupiter

టీవీఎస్ జూపిటర్ ఈసారి రికార్డు స్థాయిలో సేల్స్ సాధించింది. 1,42,411 యూనిట్లు అమ్ముడవ్వడం ద్వారా 59% వృద్ధి నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈసారి 53,000 యూనిట్లు ఎక్కువ సేల్స్‌ జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో జూపిటర్ డిమాండ్‌ భారీగా పెరగడంతో ఇది స్కూటర్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Bajaj Pulsar & TVS Apache పవర్ పర్ఫార్మెన్స్

బజాజ్ పల్సర్ లైనప్ 1,09,382 యూనిట్లు అమ్ముడై 61% గ్రోత్‌ సాధించింది. యూత్‌కి ఫేవరేట్‌గా నిలిచిన పల్సర్‌కి ఇది మరో మైలురాయి. అదే సమయంలో, టీవీఎస్ అపాచే సిరీస్‌ 45,038 యూనిట్లు అమ్ముడవ్వడం ద్వారా 50% వృద్ధి సాధించింది. తెలుగు యువతలో ఈ బైక్‌కి ఉన్న క్రేజ్‌ ఇంకా పెరుగుతూనే ఉంది.

ఇతర మోడల్స్

Hero HF Deluxe, Suzuki Access వంటి మోడల్స్ కూడా తమ స్థిరమైన మార్కెట్ షేర్‌ను కొనసాగించాయి. యాక్సెస్ సేల్స్‌లో కొంచెం తగ్గుదల ఉన్నా, స్కూటర్ కేటగిరీలో ఇది ఇంకా మంచి ఎంపికగానే ఉంది.

9వ స్థానంలో TVS XL, 10వ స్థానంలో Bajaj Platina నిలిచాయి.

GST 2.0 ప్రభావం & ఫెస్టివ్ సీజన్ బూస్ట్

GST 2.0 కారణంగా టూ వీలర్ల ధరలు తగ్గడం కస్టమర్స్‌కి పెద్ద లాభం చూపించింది. దీంతో, చాలా మంది బైక్స్, స్కూటర్స్ కొనుగోలు చేస్తున్నారు. దసరా, దీపావళి సీజన్‌ ముగిసే సరికి ఈ సేల్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.

హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈ టాప్ మోడల్స్‌కి డిమాండ్‌ బాగా ఉంది. ఆఫీస్‌ యూజర్స్‌, స్టూడెంట్స్‌, ఫ్యామిలీస్‌ - అందరికీ సరిపడే ఆప్షన్లు ఈ టాప్ 10 మోడల్స్‌లోనే లభ్యమవుతున్నాయి.