భారతదేశంలో అగ్రగామి లోకల్ ల్యాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫాంలో అగ్రగామి అయిన VerSe Innovation  AI ఆధారిత టెక్నాలతో సేవలు అందిస్తుంది. ఈ సంస్థ FY25లో 88% వృద్ధి సాధించింది. అలాగే EBITDA బర్న్‌లో ఖర్చులు 20 శాతం తగ్గించుకుంది. ఓవైపు ఆదాయాన్ని పెంచుకుంటూ, మరోవైపు ఖర్చులను తగ్గించుకుంటున్న సంస్థ తమ కార్యకలాపాలు పెంచుకునే పనిలో బిజీగా ఉంది.  ఆపరేషనల్ సామర్థ్యాన్ని వేగవంతం చేసి స్థిరమైన లాభాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. 

Continues below advertisement

FY25 పనితీరులో వృద్ధి, సామర్థ్యం, వైవిధ్యం హైలైట్స్థిరమైన ఆదాయ వృద్ధి: FY24లో భారత కరెన్సీలో 1,029 కోట్లు నుండి FY25లో 1,930 కోట్లు వరకు చేరింది. ఆపరేషన్ల నుంచి ఆదాయం ఏకంగా 88% పెరిగింది. మొత్తం ఆదాయం FY24లో 1,261 కోట్లు నుండి FY25లో 2,071 కోట్లకు అంటే 64 శాతం వృద్ధి సాధించింది. ఆపరేషన్ల ద్వారా ఆదాయం FY24లో 1,029 కోట్లు నుండి FY25లో 1,373 కోట్లకు అంటే 33% పెరిగింది. ఖర్చు నియంత్రణలో భేష్.. EBITDA బర్న్ (నాన్-క్యాష్ ఖర్చులు మినహాయించి) సంవత్సరానికి 20 శాతం ఖర్చులు తగ్గించుకున్నారు. దాంతో FY24లో 920 కోట్లు నుండి FY25లో 738 కోట్లకు ఖర్చులు దిగొచ్చాయి. EBITDA మార్జిన్ 89 శాతం నుండి 38 శాతానికి మెరుగుపడింది.

సామర్థ్య వృద్ధి: VerSe Innovation ఆపరేషన్ల ద్వారా వచ్చిన ఆదాయంతో పోల్చితే సేవల ఖర్చు FY24లో 112% నుండి FY25లో 77 శాతానికి తగ్గింది. సర్వర్ లీజు, సాఫ్ట్‌వేర్ ఛార్జీలను మినహాయిస్తే ఇది 83 శాతం నుండి 56 శాతానికి మెరుగైంది. నిర్వహణ ఖర్చులు (నాన్-క్యాష్ అంశాలు మినహాయించి) 77 శాతం నుండి 61 శాతాకి మెరుగుపడింది. సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో షేర్‌హోల్డర్ల ద్వారా ఈ ఆడిట్ చేసిన లెక్కలు నిర్ధారించారు. 

Continues below advertisement

 

ఆర్థిక సంవత్సరం 2024

ఆర్థిక సంవత్సరం 2025

% మార్పు

మొత్తం ఆదాయం

1,261

2,071

+64%

ఆపరేషన్ల ద్వారా ఆదాయం

1,029

1,930

+88%

ఆపరేషన్ల ద్వారా ఆదాయం (అక్విజిషన్ మినహాయింపు)

1,029

1,373

+33%

EBITDA శాతం (నాన్ క్యాష్ ఖర్చులు మినహా)

- 89%

- 38%

 
సర్వీసుల ద్వారా రెవెన్యూ (ఆదాయం శాతం)

112%

77%

 
సర్వీసులకు ఖర్చు (సర్వర్, సాఫ్ట్ వేర్ ఛార్జీలు మినహా)

83%

56%

 
ఇతర ఖర్చులు (నాన్ క్యాష్)

77%

61%

 

ఈ ఆర్థిక సంవత్సరం H2లో బ్రేక్-ఈవెన్ సైతంVerSe Innovation EBITDA సానుకూలతను చేరుకోబోతోంది. వార్షిక ఏడాది 2026 రెండవ భాగంలో గ్రూప్-స్థాయి బ్రేక్-ఈవెన్, లాభదాయకత సాధించే అవకాశం కోసం చూస్తోంది. ఉత్పత్తి, AI ఆటోమేషన్, ఆర్ధిక సంక్షిప్తత, స్థిరమైన ఆదాయ వృద్ధి వంటి విషయాల్లో నియంత్రణలో ఉంది. సంస్థ లాభాలకు కొన్ని అంశాలు కారణం.

AI రిలేటెడ్ మానిటైజేషన్: NexVerse.ai, VerSe  ప్రోగ్రామాటిక్ అడ్టెక్ ఇంజిన్, ప్రకటనదారుల ROIని పెంచింది. డేటా సంబంధించి అవగాహన పెరుగుతుంది.

సబ్‌స్క్రిప్షన్‌లో వృద్ధి: Magzter ద్వారా ప్రేరణ పొందిన డైలీహంట్ ప్రీమియం ప్లాట్‌ఫారమ్ ప్రీమియం కంటెంట్‌ను భారీ మొత్తంలో విస్తరించింది.

కమ్యూనిటీ, క్రియేటర్ ఎంగేట్మెంట్.. Josh Audio Calling వినియోగదారులను క్రియేటర్లతో లింక్ కావడానికి అనుమతిస్తుంది. అదే సమయంలో VerSe Collab క్రియేటర్ ప్రచారాలను పెద్ద స్థాయిలో నిర్వహించడానికి పూర్తి స్థాయి ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెట్‌ప్లేస్‌ను ఇస్తుంది.

ఇతర వ్యూహాలు.. Magzter (ప్రీమీయం కంటెంట్), ValueLeaf (ఎంటర్‌ప్రైజ్ ఎంగేజ్మెంట్ పరిష్కారాలు) లను అనుసంధానం చేయడం ద్వారా B2B, వినియోగదారుల ఎకోసిస్టమ్స్‌లో మానిటైజేషన్‌ను పెంచుతూ VerSe విధానాలను నిర్ధారించడంలో దోహదం చేస్తుంది.