ప్రపంచంలో ఉన్న కార్ల తయారీ బ్రాండ్లన్నీ ఒకెత్తు అయితే... రోల్స్ రాయిస్ మాత్రం మరో ఎత్తు. ఇవి కేవలం ఎక్స్‌క్లూజివ్ కార్లు మాత్రమే కాదు. ఎంతో ఖరీదైన కార్లు కూడా. ఇప్పుడు రోల్స్ రాయిస్ తన కొత్త ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్ కారును మనదేశంలో లాంచ్ చేసింది. ఘోస్ట్ లగ్జరీ సెడాన్‌లో ఇది లేటెస్ట్ మోడల్. బ్లాక్ బ్యాడ్జ్ రేంజ్‌లో ఈ కారు లాంచ్ అయింది. రోల్స్ రాయిస్ రేంజ్‌లో అత్యంత డైనమిక్, పవర్ ఉన్నది దీనికే.
ప్రస్తుతం రోల్స్ రాయిస్ రేంజ్‌లో ఫాంటం లగ్జరీ సెడాన్, కల్లినాన్, ఘోస్ట్ ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ బ్యాడ్జ్ రేంజ్‌లో కల్లినాన్‌తో పాటు ఘోస్ట్ కూడా లాంచ్ అయింది. ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్ ఎక్స్‌టీరియర్‌కు చాలా మార్పులు చేశారు. ఇందులో మరింత పవర్ ఫుల్ ఇంజిన్ అందించారు. దీంతోపాటు కొత్త ఇంటీరియర్ అప్‌డేట్స్ కూడా చేశారు.
మొత్తంగా 44 వేల రంగుల్లో వినియోగదారులు ఈ కారును కొనుగోలు చేయవచ్చు. కానీ బ్లాక్ బ్యాడ్జ్‌లోని బ్లాక్ పెయింట్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అత్యంత చిక్కని బ్లాక్ కలర్‌ను రప్పించడం కోసం ఏకంగా 45 కేజీల పెయింట్‌ను ఉపయోగించారు. దీన్ని హ్యాండ్ పాలిష్ చేయడం విశేషం. ఈ కారును పెయింట్ చేయడానికి ఐదు గంటల సమయం పట్టనుంది.
21 అంగుళాల కార్బన్ ఫైబర్ చక్రాలను ఈ కారులో అందించారు. చక్రాల పక్క భాగంలో కూడా హ్యాండ్ పెయింటెడ్ కోచ్ లైన్ ఉండనుంది. పూర్తిగా బ్లాక్ లుక్ తీసుకురావడం కోసం డార్కర్ క్రోమ్ ట్రిమ్‌ను ఉపయోగించారు. ఈ కారు ఇంటీరియర్ స్టాండర్డ్ ఘోస్ట్ కంటే కొంచెం కొత్తగా ఉంది. కార్బన్, మెటాలిక్ ఫైబర్స్‌లో డీప్ డైమండ్ ప్యాటర్న్ చూడవచ్చు. బ్లాక్ బ్యాడ్ కొనుగోలు చేసిన వారు తమ కారు లుక్‌ను వర్చువల్‌గా మార్చుకోవచ్చు.
ఈ కారు డ్యాష్ బోర్డులో 152 ఎల్ఈడీలు అందించారు. ఇవి నక్షత్రాల ఆకారంలో కనిపించనున్నాయి. కారు హెడ్ లైనర్‌ను కూడా నక్షత్రాలు ఉన్న ఆకాశంలా కనిపించేలా డిజైన్ చేశారు. ట్విన్ టర్బో చార్జ్‌డ్ 6.75 లీటర్ వీ12 ఇంజిన్‌ను ఈ కారులో అందించారు. 8 స్పీడ్ ఆటోమేటిక్‌ను స్టాండర్డ్ వేరియంట్లో అందించగా... ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్ వేరియంట్లో స్పోర్టియర్ డ్రైవింగ్ కోసం అదనంగా ‘లో’ బటన్‌ను అందించారు.
ఈ కారు ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే లీకుల ప్రకారం చూస్తే ఈ కారు ధర మనదేశంలో రూ.13 కోట్ల రేంజ్‌లో ఉండనుంది. ఈ ధరతో లాంచ్ అయితే మనదేశంలో ఇదే అత్యంత ఖరీదైన కొత్త కారు కానుంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?