Renault Triber Facelift 2025 Price And Features: రెనాల్ట్ ఇండియా, చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న 7-సీటర్ కాంపాక్ట్ MPV 'రెనాల్ట్ ట్రైబర్'లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ నెలలోనే విడుదల చేయబోతోంది. జులై 23, 2025న ఈ కొత్త వెర్షన్‌ను పరిచయం చేయబోతోంది. కారు బయటి డిజైన్‌ను ఫ్రెష్‌గా తాజాగా & ప్రీమియం లుక్‌లోకి మార్చడానికి కంపెనీ చాలా కీలక మార్పులు చేసింది. ఈ కారు భారతీయ మార్కెట్లో మారుతి ఎర్టిగాకు ప్రత్యామ్నాయ కారుగా నిలుస్తుందని, గట్టి పోటీని ఇస్తుందని భావిస్తున్నారు.
రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో సరికొత్త హెడ్‌ల్యాంప్ యూనిట్, కొత్త ఫ్రంట్ గ్రిల్ & కొత్త అల్లాయ్ వీల్స్ ఉంటాయన్న లీక్స్ వినిపిస్తున్నాయి. ఇంకా.. రియర్ ప్రొఫైల్‌లో కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు, కొత్త టెయిల్‌ల్యాంప్ సిగ్నేచర్ & బంపర్ డిజైన్ ఉండవచ్చు.
కొత్త ఇంటీరియర్ & స్మార్ట్ ఫీచర్లురెనాల్ట్ ట్రైబర్ 2025 లోపలి డిజైన్‌లోనూ అనేక మార్పులు ఉంటాయి. కొత్త డ్యూయల్-టోన్ థీమ్, మెరుగైన నాణ్యమైన మెటీరియల్ ఫినిషింగ్ & కొన్ని అధునాతన ఫీచర్లను ఈ కారులో చూడవచ్చు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే & టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కొత్త ట్రైబర్‌లో ఇవ్వవచ్చని భావిస్తున్నారు. క్యాబిన్ లేఅవుట్ & స్పేస్ మునుపటి లాగే ఉంటాయి, తద్వారా ఈ MPV తన 7-సీట్స్ లేఅవుట్ & బూట్ స్పేస్‌ను ఏమాత్రం కోల్పోదు, పెద్ద ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది.
ఇంజిన్ & పనితీరులో మార్పులు ఉండవుకొత్తగా రాబోయేది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కాబట్టి రెనాల్ట్ ట్రైబర్ మెకానికల్ సెటప్‌లో ఏ మార్పులు ఉండవు. ప్రస్తుత వెర్షన్‌లో అందుబాటులో ఉన్న అదే 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల అవుతుంది. ఈ ఇంజిన్ దాదాపు 72 bhp పవర్‌ను & 96 Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది, బండిని రేసు గుర్రంలా పరిగెత్తిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ & AMT ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఎంపికలు కూడా రెనాల్ట్ ట్రైబర్‌లో అందుబాటులో ఉన్నాయి, ఇవి రైడింగ్‌ను చాలా స్మూత్‌గా మారుస్తాయి. ముఖ్యంగా, పెద్ద వయస్సు వ్యక్తులు కారులో ఉన్నప్పుడు ఎలాంటి జర్క్‌లు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు 5-స్పీడ్ గేర్‌బాక్స్ చక్కగా పని చేస్తుంది. పెద్ద కుటుంబం కోసం బడ్జెట్‌లో వచ్చే మెరుగైన 7-సీటర్ కోసం చూస్తున్న కస్టమర్లకు ఈ మోడల్ ఒక మంచి ఎంపిక కాగలదు.
రెనాల్ట్ ట్రైబర్ రేటుప్రస్తుతం ఉన్న వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర 6,14,995 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో ఈ MPVని రూ. 7.39 లక్షల నుంచి రూ. 10.74 లక్షల వరకు ఆన్-రోడ్ ధరగా కొనవచ్చు. ఈ నెల 23న విడుదలయ్యే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
కొత్త SUV లైనప్‌ను సిద్ధం చేస్తున్న రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ తర్వాత, రెనాల్ట్ తన సబ్ కాంపాక్ట్ SUV కిగర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా భారతీయులకు పరిచయం చేయబోతోంది. ఇంకా, భవిష్యత్తులో మరో రెండు కొత్త ఉత్పత్తులను (కొత్త 5-సీట్ల SUV & దీనిలోనే 7-సీట్ల వెర్షన్) విడుదల చేస్తామని కూడా కంపెనీ ప్రకటించింది. మార్కెట్‌లో పోటీ చాలా తీవ్రంగా మారిన సమయంలో, భారత మార్కెట్లో తన పట్టును బలోపేతం చేసుకోవాలనుకునే రెనాల్ట్ వ్యూహంలో ఇది భాగం.