Tata Tiago vs Maruti Celerio Comparison: టాటా టియాగో, షార్ప్ హెడ్‌ల్యాంప్స్, హనీకాంబ్ గ్రిల్ డిజైన్‌తో స్పోర్టీగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మారుతి సెలెరియో సింపుల్‌గా ఉన్నా మోడర్న్ లుక్‌తో, సాఫ్ట్ కర్వ్స్ కలిగిన బాడీ డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. టియాగోలోని కాంట్రాస్ట్ కలర్ రూఫ్, స్టైలిష్ అలాయ్ వీల్స్ దానికి యూత్‌ఫుల్ ఫీలింగ్ ఇస్తాయి. సెలెరియోలోని కాంపాక్ట్ ప్రొపోర్షన్స్, క్లీన్ లైన్స్ నగర రోడ్లపై స్మార్ట్‌గా కనిపించేలా చేస్తాయి. ఈ రెండు కార్లు బెస్ట్ మైలేజీని ఇస్తాయి.
మీరు మీ మొదటి ఉద్యోగంలో చేస్తూ, తక్కువ ధరకు మంచి మైలేజీని ఇచ్చే కార్ కొనాలని చూస్తుంటే, టాటా టియాగో CNG లేదా మారుతి సెలెరియో CNG లో ఒకదానిని ఎంచుకోవచ్చు. ఆ కార్ల ధర, ఫీచర్లు & మైలేజ్ వివరాలు తెలుసుకుంటే, మీకు ఏ కారు సరైనదో మీరే ఈజీగా అర్ధం చేసుకోవచ్చు.
ధరఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో టాటా టియాగో CNG ధర దాదాపు రూ. 6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ ధర రూ. 8.75 లక్షల వరకు ఉంటుంది. ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుంది - XE, XM, XT & XZ+, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (AMT) ఆప్షన్ ఒక ప్రత్యేకమైన ఆఫర్. మరోవైపు, మారుతి సెలెరియో CNG ఒకే ఒక వేరియంట్ (VXI)లో అందుబాటులో ఉంది, దీని ధర రూ. 6.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది?టాటా టియాగో CNG విషయంలో, కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ మాన్యువల్ మోడ్‌లో 26.49 కి.మీ./కిలో & ఆటోమేటిక్ మోడ్‌లో 28 కి.మీ./కిలో. అయితే, నిజ జీవితంలో డ్రైవింగ్ చేసేటప్పుడు, ఇది సగటున 24–25 కిమీ/కిలో ఇస్తుంది. దీని అర్ధం ఏంటంటే, టాటా టియాగో సిటీ ట్రాఫిక్‌లో ఇంధనాన్ని పొదుపుగా వాడుకోగలదు. మరోవైపు, మారుతి సెలెరియో CNG క్లెయిమ్డ్ మైలేజ్ 35.60 కి.మీ./కిలో. ఈ సెగ్మెంట్‌లోని ఇతర కార్లతో పోలిస్తే సెలెరియో CNG ఇస్తున్న నంబర్ అన్నిటికంటే అధికం. ఈ కారు, ఇంధన సామర్థ్యం పరంగా టాటా టియాగో CNG కంటే చాలా ముందుంది. రోజువారీ ప్రయాణికులకు, ముఖ్యంగా ఇంధన ధరలు పెరిగిన ఈ తరుణంలో ఇది పెద్ద ప్రయోజనం అవుతుంది.
ఫీచర్లు & ఇంటీరియర్టాటా టియాగో CNG చాలా ఫీచర్లతో కూడిన కారు. దీనికి LED DRLsతో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ వంటి ఉన్నాయి. ఇంకా, ట్విన్-సిలిండర్ టెక్నాలజీ కారణంగా బూట్ స్పేస్ ఇతర CNG కార్ల కంటే ఎక్కువగా ఉంటుంది. మారుతి సెలెరియో CNG లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పుష్-బటన్ స్టార్ట్ & పవర్ విండోస్ ఉన్నాయి, ఇవి డ్రైవింగ్‌లో మోడర్న్ టచ్‌ను అందిస్తాయి. అయితే, దీనికి AMT ఎంపిక లేదు లేదా బూట్ స్పేస్ కూడా టియాగో లాగా సౌకర్యవంతంగా ఉండదు.
భద్రత పరంగా ఏ కారు ఎక్కువ సురక్షితం?భద్రత పరంగా, టాటా టియాగో CNG కారు గ్లోబల్ NCAP నుంచి 4-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇది డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, వెనుక కెమెరా, CNG లీక్ డిటెక్షన్ సిస్టమ్ & మైక్రో-స్విచ్ వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. మారుతి సెలెరియో CNG లో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇస్తున్నారు, ఇది పెద్ద అప్‌గ్రేడ్. అయితే, దాని క్రాష్ టెస్ట్ రికార్డ్ టియాగో తరహాలో బలంగా లేదు. అందువల్ల, సురక్షితమైన డ్రైవింగ్ పరంగా టియాగో ఇప్పటికీ ఒక అడుగు ముందుంది.
సేఫ్టీ ఫీచర్లు, ఇంటీరియర్, మైలేజ్, లుక్స్‌ను బట్టి మీ అవసరానికి ఏ కారు తగినదో మీరు ఊహించవచ్చు.