Tata Tiago Facelift Interior Revealed Officially Ahead of India: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తన అప్‌డేటెడ్ 2026 టియాగో ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఇంటీరియర్ లుక్‌ను అధికారికంగా రివీల్ చేసింది. ఈ మోడల్ ధరల వివరాలను కంపెనీ మే 28న అనౌన్స్ చేయనుంది. ఇదివరకు ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను మాత్రమే చూపించిన టాటా సంస్థ, ఇప్పుడు కారు లోపలి భాగాన్ని భారీ మార్పులతో సరికొత్తగా డిజైన్ చేసింది. సాధారణ మిడ్-సైకిల్ అప్‌డేట్స్ లాగా కాకుండా, టియాగో క్యాబిన్‌ను మరింత లగ్జరీగా, హైటెక్ ఫీచర్లతో రీడిజైన్ చేశారు. ఈ మార్పులు కారు విజువల్ అప్పీల్‌ను పూర్తిగా పెంచేలా ఉన్నాయి.
Read Also: AC ఆన్‌లో ఉన్నా Petrol ఖర్చులు తగ్గించుకోవచ్చు.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి
డ్యూయల్ ఫ్రీ ఫ్లోటింగ్ స్క్రీన్లు..
కొత్త టాటా టియాగో ఇంటీరియర్ లో ప్రధాన మార్పు డ్యూయల్ ఫ్రీ-ఫ్లోటింగ్ స్క్రీన్ల సెటప్. ఇందులో ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం ఒకటి, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం మరొక డిజిటల్ స్క్రీన్‌ను అమర్చారు. పాత మోడల్ లో ఉన్న ఎల్‌సీడీ డిస్‌ప్లే స్థానంలో వచ్చిన ఈ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కారుకు మోడర్న్ లుక్ ఇస్తోంది. ఈ కొత్త స్క్రీన్ లేఅవుట్ వల్ల డ్యాష్‌బోర్డ్ డిజైన్ పూర్తిగా మారింది. పాత మోడల్ లోని ఇంటిగ్రేటెడ్ లేఅవుట్‌ను తీసేసి, లేయర్డ్ డిజైన్‌ను జోడించారు. డోర్ ప్యాడ్స్ మార్చడంతో పాటు కొత్తగా ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, బ్లాక్ అండ్ గ్రే డ్యూయల్-టోన్ ఫ్యాబ్రిక్ సీట్లను ఇచ్చారు.
రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్..
కారు సెంటర్ కన్సోల్‌ను గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్‌తో అప్‌గ్రేడ్ చేసి, అందులో రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లను అమర్చారు. అయితే దీని వల్ల పాత మోడల్ లో ఉన్న స్టోరేజ్ స్పేస్ తగ్గింది. కొత్త టియాగోలో కొత్త ఏసీ వెంట్స్, క్లైమేట్ కంట్రోల్ కోసం ఫ్లోటింగ్ ప్యానెల్ ఇచ్చారు. అయితే హెచ్‌వీఏసీ (HVAC) స్విచ్ గేర్ మాత్రం పాతదే ఉంది. ఈ అప్‌డేట్స్ అన్నీ ఐసీఈ (ICE) పెట్రోల్ వెర్షన్ కు సంబంధించినవి కాగా, తియాగో ఈవీ (EV) మోడల్ లో కూడా కొన్ని చిన్న మార్పులతో ఇవే ఫీచర్లు రానున్నాయి. ఎక్స్‌టీరియర్ పరంగా కొత్త బంపర్లు, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.
ఇంజన్ కెపాసిటీ..
మెకానికల్ విషయానికి వస్తే ఈ కారులో ఎలాంటి మార్పులు లేవు. ఇది మునుపటి లాగే 86 హార్స్‌పవర్ ఇచ్చే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 75.5 హార్స్‌పవర్ ఇచ్చే సీఎన్‌జీ (CNG) ఆప్షన్లలో లభిస్తుంది. రెండింటిలోనూ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ (AMT) గేర్‌బాక్స్ ఛాయిస్ ఉంటుంది. ప్రస్తుతం ఈ కారు ధరలు రూ. 4.60 లక్షల నుండి రూ. 7.68 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండగా, కొత్త ఫేస్‌లిఫ్ట్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్ లో ఇది మారుతి సెలెరియో, మారుతి వ్యాగన్ ఆర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
