Tata Tiago EV Price, Down Payment, Car Loan and EMI: ఇప్పుడు ఇంధనం ధరలతో ధనం తగ్గుతోంది గానీ దూరం తగ్గడం లేదు. దీనికి పరిష్కారం ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVs). ఇటీవల, టాటా టియాగో EV తెలుగు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కాంపాక్ట్ సైజ్‌తో స్టైలిష్‌గా, యువతరానికి నచ్చేలా దీనిని డిజైన్ చేశారు. ఫ్రంట్‌లో ఇచ్చిన షార్ప్ హెడ్‌ల్యాంప్స్, బ్లూ హైలైట్స్‌తో ఎలక్ట్రిక్ లుక్ స్పెషల్‌గా కనిపిస్తుంది. కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌తో కారు ప్రెజెన్స్ మోర్ స్పోర్టీగా మారింది. సింపుల్‌గా ఉన్నా మోడర్న్ డిజైన్ కారణంగా సిటీ డ్రైవ్‌కి ఇది పర్ఫెక్ట్ EVగా నిలుస్తుంది.
సాధారణంగా, ఎలక్ట్రిక్ కార్ల రన్నింగ్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఆఫీసు లేదా రోజువారీ అప్&డౌన్‌కు ఎలక్ట్రిక్ కార్లు ఉత్తమంగా ఉంటాయి, టాటా టియాగో EV కూడా దీనికి మినహాయింపు కాదు.
తెలుగు రాష్ట్రాల్లో టాటా టియాగో EV ఆన్-రోడ్ ధరహైదరాబాద్‌లో టాటా టియాగో EV బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.99 లక్షలు. దీనికి RTO ఛార్జీలు దాదాపు రూ. 2,000 & బీమా దాదాపు రూ. 43,000, ఇతర ఖర్చులు కలిపి మొత్తం దాదాపు రూ. 8.44 లక్షలు చెల్లించాలి, ఇదే ఆన్-రోడ్ ధర (Tata Tiago EV on-road price, Hyderabad Vijayawada) . విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాలు, పట్టణాల్లో కూడా దాదాపు ఇదే ఆన్-రోడ్ ధర అమల్లో ఉంది.
టియాగో EV EMI ఆప్షన్స్‌మీరు టాటా టియాగో EV కొనుగోలు కోసం ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. డౌన్ పేమెంట్‌గా రూ. 3 లక్షలు జమ చేస్తే, మిగిలిన మొత్తానికి (రూ. 5.44 లక్షలు) బ్యాంకు నుంచి కార్ లోన్ తీసుకోవాలి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, కనీస వడ్డీ రేటుకే బ్యాంక్ మీకు లోను మంజూరు చేస్తుంది. ఉదాహరణకు, బ్యాంక్ 9% వార్షిక వడ్డీ రేటుతో మీకు రూ. రూ. 5.44 లక్షల కార్ లోన్ ఇచ్చిందని భావిస్తే, EMI ఆప్షన్స్ చూద్దాం.
7 సంవత్సరాలకు లోన్ తీసుకుంటే, నెలకు రూ. 8,745 EMI చెల్లించాలి. ఈ ఏడేళ్లలో రూ. 1,91,032 లక్షలు వడ్డీ చెల్లించాలి.
6 సంవత్సరాల్లో లోన్ క్లియర్ చేయాలంటే, నెలకు రూ. 9,797 EMI చెల్లించాలి. ఈ ఆరేళ్లలో రూ. 1,61,836 లక్షలు వడ్డీ చెల్లించాలి.
5 సంవత్సరాల కాల పరిమితి ఎంచుకుంటే, నెలకు రూ. 11,283 EMI చెల్లించాలి. ఈ ఐదేళ్లలో రూ. 1,33,432 లక్షలు వడ్డీ చెల్లించాలి.
4 సంవత్సరాల లోన్ టెన్యూర్ పెట్టుకుంటే, నెలకు రూ. 13,526 EMI చెల్లించాలి. ఈ నాలుగేళ్లలో రూ. 1,05,700 లక్షలు వడ్డీ చెల్లించాలి.
టియాగో EV పవర్ & రేంజ్‌టాటా టియాగో EV ని రెండు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. దీని బేస్ మోడల్‌ను ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 250 కి.మీ.ల దూరం మళ్లీ ఛార్జింగ్ అక్కరలేదని కంపెనీ చెబుతోంది. టాప్ వేరియంట్‌లో ఈ పరిధి 315 కి.మీ.ల వరకు ఉంటుంది . టియాగో EV టాప్ వేరియంట్‌లో 24 kWh బ్యాటరీ ఉంటుంది. DC 25kW ఫాస్ట్ ఛార్జర్‌తో ఈ EV ని 58 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేయవచ్చు, సాధారణ 15 Amp హోమ్ ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్ కావడానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతుంది.