Tata Tiago Price, Mileage And Features In Telugu: టాటా మోటార్స్ కార్లు ధర పరంగా చౌకగా ఉండటంతో పాటు ఆధునిక ఫీచర్లు & సేఫ్టీ రేటింగ్స్‌లో ముందుంటాయి. అందువల్ల, భారత మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. టాటా బ్రాండ్‌లో, మోడ్రన్‌ ఫీచర్లతో వచ్చిన తక్కువ ధర కారు "టాటా టియాగో". చీప్‌ అండ్‌ బెస్ట్‌ కారు కోరుకునేవాళ్లకు ఇది మంచి ఆఫర్‌ అవుతుంది. అంతేకాదు, మీ జీతం రూ.  30,000 వేల నుంచి ప్రారంభమైనప్పటికీ, మీరు సులభంగా టాటా టియాగో కొనుగోలు చేయవచ్చు. 

టాటా టియాగో కాంపాక్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ అయినప్పటికీ స్టైలిష్‌గా కనిపించే ఆకర్షణీయమైన కారు. ముందు భాగంలో షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌ & సిగ్నేచర్‌ గ్రిల్‌ కారు రూపానికి స్పోర్టీ లుక్స్‌ ఇస్తాయి. సైడ్‌ ప్రొఫైల్‌లో స్మూత్‌ లైన్స్‌ & డ్యూయల్‌ టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌ కారు డిజైన్‌కు ప్రీమియం ఫీల్‌ ఇస్తాయి. వెనుక భాగంలో LED టెయిల్‌ల్యాంప్స్‌ & బోల్డ్‌ బంపర్‌ యువతరాన్ని ఆకట్టుకునేలా స్టైల్‌గా కనిపిస్తాయి.

తెలుగు రాష్ట్రాల్లో టాటా టియాగో ధరమన తెలుగు రాష్ట్రాల్లో ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షలు (Tata Tiago ex-showroom price, Hyderabad Vijayawada). అయితే, గుడ్‌ న్యూస్‌ ఏంటంటే.. మీరు టాటా టియాగో కారును సొంతం చేసుకోవడానికి ఈ డబ్బు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 50,000 డౌన్ పేమెంట్ చెల్లించి కారు తాళాలు మీ జేబులో వేసుకోవచ్చు. అంటే, ఈ కారును కార్‌ లోన్‌/ఫైనాన్స్‌ ద్వారా తీసుకునే వెసులుబాటు ఉంది. 

హైదరాబాద్‌లో, టాటా టియాగో బేస్ XE (పెట్రోల్) మోడల్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 6.03 లక్షలు (Tata Tiago on-road price, Hyderabad). ఈ ధరలో RTO ఛార్జీలు దాదాపు రూ. 72,000 & బీమా రూ. 30,000, ఇతర అవసరమైన ఖర్చులు కలిసి ఉన్నాయి. విజయవాడలో, టాటా టియాగో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 6.05 లక్షలు (Tata Tiago on-road price, Vijayawada). తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన నగరాల్లోనూ దాదాపుగా ఇదే రేటు ఉంటుంది.

హైదరాబాద్‌లో, టాటా టియాగో బేస్‌ వేరియంట్‌ కోసం మీరు రూ. 50,000 డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 5.53 లక్షల కారు లోన్ తీసుకోవాలి. బ్యాంకు నుంచి 9% వడ్డీ రేటుతో ఈ లోన్‌ పొందారని అనుకుందాం. 

Tata Tiago EMI ఆప్షన్స్‌

7 సంవత్సరాల కాలానికి రుణం తీసుకుంటే, మీ EMI నెలకు రూ. 8,897 అవుతుంది. 

6 సంవత్సరాల్లో కార్‌ లోన్‌ క్లియర్‌ చేయాలనుకుంటే, మీ EMI నెలకు రూ. 9,968 అవుతుంది. 

5 సంవత్సరాల రుణ కాలపరిమితి పెట్టుకుంటే, మీ EMI నెలకు రూ. 11,479 అవుతుంది. 

4 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ ఎంచుకుంటే, మీ EMI నెలకు రూ. 13,761 అవుతుంది. 

మీ నెలవారీ జీతం/ఆదాయం రూ. 30,000 - రూ. 40,000 మధ్య ఉంటే, 7 సంవత్సరాల EMI ప్లాన్ మీకు ఉత్తమంగా ఉంటుందన్నది ఆర్థిక నిపుణుల సలహా.

బ్యాంక్‌ ఇచ్చే లోన్‌ మొత్తం, వార్షిక వడ్డీ రేటు మీ క్రెడిట్‌ స్కోర్‌, బ్యాంక్‌ విధానంపై ఆధారపడి ఉంటాయి.

Tata Tiago CNG టాటా టియాగోలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది & CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిలోనూ వస్తుంది. ARAI ప్రకారం, పెట్రోల్ వెర్షన్‌లో దీని మైలేజ్ లీటరుకు 20.09 కిలోమీటర్లు, CNG వెర్షన్‌లో మైలేజ్ కిలోగ్రాముకు 28 కిలోమీటర్లు. CNG మోడ్‌ ఎంచుకున్నవాళ్లకు ఇంధన ఖర్చులు బాగా తగ్గుతాయి.