తక్కువ బడ్జెట్‌లో సిటీలో నడపడానికి సెట్ అయ్యే కార్ కోసం చూస్తున్నారా... అలాగే ఫీచర్లు, సేఫ్టీ విషయంలో కూడా మెరుగ్గా ఉండాలనుకుంటే మాత్రం మీకు టాటా టియాగో (Tata Tiago) ఒక అద్భుతమైన ఆప్షన్ కానుంది. ఈ కార్ ఆటో మార్కెట్‌లో విక్రయాల్లో దూసుకెళ్తోంది. సరైన బడ్జెట్ ధర, కాంపాక్ట్ సైజ్, మంచి ఫీచర్లతో కస్టమర్ల ఆదరణ పొందింది. 

Continues below advertisement

ఈ కారును కొనుగోలు చేయడానికి ఫుల్ పేమెంట్ మీ వద్ద లేదని ఎలాంటి ఆందోళన చెందవద్దు. కారు మొత్తం ధరను ఒకేసారి చెల్లించే బదులు లోన్ తీసుకుని చెల్లించి ప్రతినెలా EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ కస్టమర్ కేవలం రూ. 20 వేల డౌన్ పేమెంట్ చేస్తే ప్రతినెల EMI ఎంత చెల్లించాలి లెక్కల వివరాలు తెలుసుకోండి. 

Tiago CNG ఆన్-రోడ్ ధర ఎంత 

Continues below advertisement

Tata Tiago CNG హైదరాబాద్‌లో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.79 లక్షలుగా ఉంది.  కారు ఆన్-రోడ్ ధర సిటీ, RTO, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీల బట్టి పెరుగుతుంది. ఈ కారు ఆన్-రోడ్ ధర సుమారు రూ. 6.33 లక్షలు చెల్లించాలి.

ఒకవేళ మీరు ఈ CNG కారును కొనుగోలు చేయడానికి కేవలం రూ. 20 వేలు డౌన్ పేమెంట్ చేస్తే, 9.5 శాతం వడ్డీ రేటుతో 6,12,868 రూపాయలకుగానూ 4 సంవత్సరాలకి ప్రతినెల రూ. 15,397 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 5 సంవత్సరాలకు రూ. 12,871, అలాగే 6 సంవత్సరాల కాలానికి లోన్ తీసుకుంటే ప్రతినెలా EMI మొత్తం రూ. 11,200 చెల్లించాలి.

Also Read: KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?

మీ నెలవారీ ఖర్చులకు ఇబ్బంది లేకుండా మీరు ఈఎంఐ తగ్గాలని భావిస్తే ఈ కారును 7 సంవత్సరాల కాలానికి లోన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మీరు 9.5 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ. 10,017 రూపాయల్ని EMI కట్టాలి. 

EMI కి సంబంధించిన ఈ గణాంకాలు ఒక ఉదాహరణగా మాత్రమే ఇవ్వబడ్డాయని మీరు తెలుసుకోవడం ముఖ్యం. కారు యొక్క అసలు EMI అనేది బ్యాంక్ వడ్డీ రేటు, లోన్ కాలవ్యవధి, ప్రాసెసింగ్ ఫీజు, కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ మరియు కారు యొక్క ఆన్-రోడ్ ధర ప్రాతిపదికన మారవచ్చు. అందువల్ల కారు కొనుగోలు చేయడానికి ముందు బ్యాంక్ మరియు డీలర్ నుండి ఫైనల్ లోన్ మొత్తం మరియు EMI వివరాలను తప్పకుండా తెలుసుకోవాలి.

ఇటువంటి పరిస్థితుల్లో మీ బడ్జెట్ పరిమితంగా ఉండి, మీరు ఒక కాంపాక్ట్ ఫ్యామిలీ కారును EMI లో కొనుగోలు చేయాలనుకుంటే, Tata Tiago పై ఉన్న ఈ ఫైనాన్స్ ప్లాన్ మీకు ఒక ప్రారంభ ఉదాహరణగా ఉపయోగపడుతుంది.

కారు ఫీచర్లు, కేబిన్

Tata Tiagoని కంపెనీ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌గా తీసుకొచ్చింది. దీని సైజ్ వల్ల సిటీలోని రద్దీ రోడ్లు, ఇరుకైన వీధుల్లోనూ కారు నడపడం చాలా సులభం. కారు డిజైన్‌లో స్టైలిష్ ఫ్రంట్ గ్రిల్, షార్ప్ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ బంపర్, ఆకర్షణీయమైన టెయిల్‌ల్యాంప్స్ వంటివి ఉన్నాయి. దీనివల్ల సాధారణ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌తో పోలిస్తే కాస్త ప్రీమియం లుక్ వస్తుంది.

కేబిన్ విషయానికి వస్తే, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Android Auto, Apple CarPlay, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు లభిస్తాయి. కారులో 5 సీటింగ్ కెపాసిటీ ఉంది. చిన్న కుటుంబాలకు రోజువారీ జర్నీకి, లాంగ్ జర్నీలకు కూడా ఉపయోగపడుతుంది.

Tata Tiagoలో సేఫ్టీపై కోసం కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో కూడిన EBD, ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 360-డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ వంటి ఫీచర్లు కూడా ఇచ్చారు. ఏ కారుకైనా సేఫ్టీ ఫీచర్లు వేరియంట్‌ను బట్టి భిన్నంగా ఉంటాయి. కొనే ముందు ఎంచుకున్న వేరియంట్ ఫీచర్ లిస్ట్‌ను చెక్ చేయాలి. 

Tata Tiagoలో 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. దీనిని 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో కొనవచ్చు. ఇవే కాకుండా కంపెనీ CNG వేరియంట్‌ను తెచ్చింది. పెట్రోల్ మోడల్ లీటరుకు దాదాపు 19-20 కిలోమీటర్లు మైలేజీ, CNG మోడల్ మైలేజ్ 1 కేజీకి సుమారు 26-28 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంది.