New Tata Sierra Comparison: 2025 టాటా సియారాతో మిడ్‌సైజ్ SUV మార్కెట్‌లో పోటీ మరింత హాట్‌గా మారింది. Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara, Maruti Victoris, Toyota Hyryder, Honda Elevate, Skoda Kushaq, VW Taigun, MG Astor, Citroen Aircross వంటి బలమైన ప్రత్యర్థులతో ఉన్న సెగ్మెంట్‌లోకి టాటా ఈ కొత్త SUVని తీసుకొచ్చింది. సైజ్, శక్తిమంతమైన ఇంజిన్ ఆప్షన్లు, అప్‌డేటెడ్ డిజైన్ - ఇవి సియారాను ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే, ప్రత్యర్థి కార్లు కూడా తక్కువ తినలేదు, అవి ఇప్పటికే తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకున్నాయి.
సైజ్ విషయంలో సియారా పైచేయికొత్త టాటా సియారా 4.3 మీటర్ల పొడవుతో ఈ సెగ్మెంట్‌లో పెద్ద SUVల లెక్కలోకి వస్తోంది. 1,715 mm హైట్ కారణంగా ఇది అన్ని ప్రత్యర్థి కార్ల కంటే ఎత్తుగా ఉంటుంది. అలాగే 2,730 mm వీల్‌బేస్ ఈ సెగ్మెంట్‌లోనే అతి పెద్దది. ఈ సంఖ్యలు చూసినపుడు కేబిన్‌లో లెగ్‌రూం, హెడ్‌రూం, వెనక సీటింగ్ కంఫర్ట్ మరింత మెరుగ్గా ఉంటాయని స్పష్టమవుతుంది.
622 లీటర్ల భారీ బూట్ స్పేస్ కూడా సియారాను ప్రత్యేకంగా నిలబెడుతుంది. లాంగ్ ట్రావెల్స్, ఫ్యామిలీ ట్రిప్స్, లగేజ్ తీసుకెళ్లేందుకు పెద్ద స్పేస్ కోసం చూస్తున్న వారికి ఇది అదనపు సౌకర్యం.
NA పెట్రోల్ ఇంజిన్ – సిటీ డ్రైవింగ్‌కు సరైన ఎంపికసియారా.. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) పెట్రోల్ ఇంజిన్‌తో 106 hp శక్తి, 145 Nm టార్క్‌తో వస్తోంది. ఇది హోండా ఎలివేట్, క్రెటా, విక్టోరిస్ వంటి ప్రత్యర్థులతో సమానంగా ఉంటుంది. స్మూత్‌గా రన్ అయ్యే ఈ ఇంజిన్ సిటీ డ్రైవింగ్‌కు బాగా సరిపోతుంది. 6-స్పీడ్ మాన్యువల్ & 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల ఆప్షన్లు వినియోగదారుల ఎంపికను పెంచుతున్నాయి.
టర్బో పెట్రోల్ – పవర్‌ఫుల్ డ్రైవింగ్ కోసం1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 hp శక్తి, 255 Nm టార్క్‌తో అందుబాటులో ఉంది. ఇది క్రెటా, సెల్టోస్, కుషాక్, టైగున్ టర్బో వెర్షన్‌లతో సమానంగా ఉంటుంది. 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఈ ఇంజిన్‌కు సరైన జోడీ. హైవే డ్రైవ్స్, వేగంగా ఓవర్‌టేక్ చేయాల్సిన పరిస్థితుల్లో ఇది మంచి పంచ్ ఇస్తుంది.
డీజిల్ ఆప్షన్ – సెగ్మెంట్‌లో అరుదైన USPఇప్పటికే చాలా బ్రాండ్లు డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌ను తీసివేశాయి. కానీ సియారా 1.5-లీటర్ టర్బో డీజిల్ 118 hp శక్తితో వచ్చింది. 260–280 Nm టార్క్‌తో ఇది సుదీర్ఘ ప్రయాణాలు చేసే డ్రైవర్స్‌కి మంచిది. ప్రత్యేకంగా డీజిల్–ఆటోమేటిక్ కాంబినేషన్ ఈ సెగ్మెంట్‌లో పెద్ద ఆధిక్యం.
సైజు, ఇంజిన్ ఎంపికలు, ధర.... అన్ని కలిసి సియారా స్ట్రాంగ్ ప్యాకేజ్
సైజు విషయంలో సియారా స్పష్టంగా ప్రత్యర్థులకంటే పెద్దది. మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లు (NA పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్) ఒకే SUVలో ఇవ్వడం ప్రస్తుతం చాలా అరుదు. ఇవన్నీ కలిసి సియారాను మంచి ప్యాకేజ్‌గా నిలబెడుతున్నాయి.
ఇక రియల్-వరల్డ్ మైలేజ్, సస్పెన్షన్ కంఫర్ట్, దీర్ఘకాలిక నమ్మకంలోనూ మంచి రేటింగ్ సాధిస్తే, సియారా మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో భారీ పోటీ ఇచ్చే మోడల్ అవుతుందని స్పష్టంగా చెప్పొచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.