Dream Wedding on a Budget : పెళ్లి అనేది లైఫ్​ జరిగే అత్యంత ముఖ్యమైన ఈవెంట్. అందుకే దీనిని అందంగా, చిరస్మరణీయంగా మార్చుకునేందుకు చూస్తారు. దానిలో భాగంగానే తెలియకుండా ఎక్కువ డబ్బులు ఖర్చు చేసేస్తారు. కానీ సరైన ప్రణాళిక లేకుంటే అది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీనివల్ల లోన్ తీసుకోవడం, అప్పు చేయడం వంటివి జరుగుతాయి. కాబట్టి పెళ్లి బడ్జెట్​లో అవ్వాలి.. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలనుకుంటే కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి అంటున్నారు నిపుణులు. లేదంటే పెళ్లి తర్వాత ఆ అప్పు మీ ఆనందాన్ని కిల్ చేసేస్తుంది. మరి మీ బడ్జెట్‌లో మీ డ్రీమ్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూసేద్దాం. 

Continues below advertisement

రాతపూర్వక బడ్జెట్  

మీరు రూపాయి ఖర్చు పెట్టినా.. పోతే పోనివ్వు అని వదిలేయకుండా రాతపూర్వకమైన ప్రణాళికను స్టార్ట్ చేయాలి. మైండ్ కాలిక్యులేట్ చేయడానికి బదులుగా ఖర్చులు గురించి రాసిపెట్టుకోండి. వేదిక, ఆహారం, అలంకరణ, డ్రెస్​లు, స్టేయింగ్ వంటి విభాగాలలో ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో రాసుకోండి. తద్వారా మీ డబ్బు ఎక్కడికి.. ఎంత వెళ్తుందో ఈజీగా తెలుస్తుంది. పైగా ఇలా రాసిపెట్టుకోవడం వల్ల మీరు త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ పరిమితిలో ఏది సరిపోతుందో తెలుస్తుంది. బడ్జెట్ ఎక్కడ అడ్జెస్ట్ చేయగలరో చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ తరహా కాలిక్యులేషన్ మిమ్మల్ని అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంచుతుంది. 

చివరి నిమిషంలో వద్దు

వేదిక, ఆహారం, అలంకరణ లేదా డ్రెస్​లు వంటి కొన్ని అంశాలలో మీరు రాజీ పడకూడదనుకోవచ్చు. కానీ వాటిని ముందుగా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత చివరి నిమిషంలో ప్లాన్ మార్చడం వల్ల ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం, కొనడం, తెలిసిన వాళ్లను తీసుకెళ్లడం వల్ల  కాస్త తగ్గింపులు ఉంటాయి. ఆఫర్‌లు పొందవచ్చు. ఇది నాణ్యతతో రాజీ పడకుండా బడ్జెటింగ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

Continues below advertisement

సరిపోల్చుకోండి 

ఒక నిర్ణయం తీసుకునే ముందు.. మీ ఎంపికలను సరిపోల్చడానికి, తూకం వేయడానికి సమయం కేటాయించండి. ఇది మీ బడ్జెట్‌లో బెస్ట్​గా ఉందో లేదో తెలియజేస్తుంది. అలాగే మొత్తం ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుంది. కొన్నిసేవలు అప్పటికప్పుడే బుక్ చేసుకోవడం వల్ల ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి.. తప్పక కావాల్సినవి బుక్ చేసుకోవాలి. అలాగే వివిధ షాప్​లలో, వ్యక్తుల దగ్గర ధరలను పోల్చి.. ఛార్జీల పరంగా ఏది ఎంచుకోవాలో డిసైడ్ అవ్వాలి. కొన్నిసార్లు చిన్న తగ్గింపులు కూడా ఎక్కువ మిగల్చవచ్చు. 

స్మార్ట్ నెగోషియేషన్ (బేరమాడటం)

పెళ్లి అనే కాదు.. ఏ ఈవెంట్ సమయంలో అయినా నెగోషియేషన్ చాలా ముఖ్యమైన అంశం. దీనికి కాస్త నైపుణ్యం, ఓపిక ఉంటే చాలు. మెరుగైన డీల్స్ పొందడానికి కొన్ని సేవలను క్లబ్ చేయండి. లేదా రష్​లేని రోజుల్లో బుక్ చేసుకోవాలి. దీనివల్ల ఖర్చులు తగ్గించడానికి వీలైనంత వరకు సర్దుబాటు ఉంటుంది. విక్రేత ధరను తగ్గించడానికి అంగీకరించకపోతే.. అదనపు అలంకరణ అప్‌గ్రేడ్‌లు, మెనూకు సర్దుబాట్లు వంటివి చేయించుకోవాలి. దీనివల్ల ఖర్చు కంట్రోల్​లో ఉంటుంది.

మరిన్ని జాగ్రత్తలు 

ఆహారం, దుస్తులు, ఆభరణాలకు యాడ్-ఆన్ ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఫోటోగ్రాఫర్‌లు, మేకప్ ఆర్టిస్టులు ఇచ్చిన సమయం కంటే ఎక్కువ టైమ్ ఉంటే.. ఓవర్ టైం వసూలు చేయవచ్చు.  కాబట్టి యాడ్ ఆన్ ఖర్చులు ఏంటి.. తగ్గిన ఖర్చులు ఏంటనేవి క్లియర్​గా రాసుకోవాలి. దీనివల్ల మీరు బడ్జెట్​ను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. అధిక ఖర్చును నివారించుకోగలుగుతారు. కాబట్టి మీరు క్లియర్ బడ్జెట్​తో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు.. చేతి లెక్కలు, గాలిలో మేడలు కాకుండా.. రాతపూర్వకమైన ప్రణాళికను సిద్ధం చేసుకుంటే ఒత్తిడి లేని బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవెంట్ చేసుకోగలుగుతారు.