Tata Sierra Space Comparison With Rivals: ఏదైనా చిన్న వస్తువు కొంటున్నా దాని ప్రయోజనంతో పాటు ఇతర ఉత్పత్తులతో పోల్చి చూస్తుంటాం. అదే మీరు డ్రీమ్ కారు కొనేటప్పుడు ఎక్కువగా దృష్టి పెట్టే విషయం ఏమిటంటే, అందులో లభించే స్థలం, కాంపాక్ట్ SUVలలో ఇది మరింత ముఖ్యం. టాటా మోటార్స్ ఇటీవల సియెర్రాను భారత మార్కెట్లో విడుదల చేయడం తెలిసిందే. ఈ SUV పలు ఇతర కంపెనీల శక్తివంతమైన కార్లకు పోటీనిస్తుంది. ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా పేరు అగ్రస్థానంలో ఉంది. 2 కార్లలో ముందు, వెనుక భాగంలో లభించే స్థలం గురించి తెలుసుకుందాం. కొత్త Sierra ఎక్స్-షోరూమ్ ధరలు ₹11.49 లక్షల నుంచి ₹18.49 లక్షల వరకు ఉన్నాయి.
టాటా సియెర్రాలో ఎంత స్థలం లభిస్తుంది?
టాటా సియెర్రా ముందు సీట్ల విషయానికి వస్తే, వాటి కుషనింగ్ చాలా మృదువుగా లేదా చాలా గట్టిగా లేదని గుర్తించారు. ఇది పూర్తిగా చూసి చెప్పవచ్చు. అదే సమయంలో, ఈ కారులో కూర్చోవడానికి చాలా వరకు కంఫర్ట్ ఉంటుంది. ఈ విభాగంలోని ఇతర కార్లలో ఇంతగా మీకు సౌకర్యవంతంగా అనిపించదు. ఈ కారులో వెనుక సీట్ల కోసం రాకపోకల సౌకర్యంపై కూడా ఫోకస్ చేశారు. దీని కోసం కారులో ఎక్కువగా తెరుచుకునే తలుపులు ఇచ్చారు. ఈ కారులో ముగ్గురు ప్రయాణికులు వెనుక సీటులో సులభంగా కూర్చుని ప్రయాణించవచ్చు. అయితే మధ్య సీటు తక్కువ వెడల్పుగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.
టాటా మోటార్స్ సియెర్రాలో ఒక ప్రత్యేక లక్షణాన్ని యాడ్ చేసింది. అదేమిటంటే ఈ SUV మధ్య సీటు కోసం హెడ్‌రెస్ట్ ఇచ్చారు. ఇది ఇంతకు ముందు టాటా ఏ కారులోనూ ఇవ్వలేదు. ఈ కారులో లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ కూడా మెరుగ్గా ఉన్నాయి. అలాగే టాటా ఈ SUVలో పూర్తి పొడవు పనోరమిక్ సన్‌రూఫ్ కూడా లభిస్తుంది. ఈ కారులో లేత రంగు అప్‌హోల్స్టరీని ఉపయోగించారు. ఇది కారులో మరింత గాలిని అందిస్తుంది. టాటా సియెర్రాలో చాలా స్థలం ఇచ్చారు. సియెర్రాలో స్థలం విషయంలో టాటా మోటార్స్ వినియోగదారునికి చాలా అవసరమైన అన్ని మార్పులు చేసిందని చెప్పవచ్చు.
టాటా సెయెర్రాలో ఇవి బెస్ట్
సిటీ డ్రైవ్‌లో స్టీరింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది. హైవేలో అది ఖచితత్వంతో పని చేయడం వల్ల డ్రైవింగ్ లో ఇబ్బంది అనిపించదు. 205mm గ్రౌండ్ క్లియరెన్స్, టెరైన్ మోడ్స్ వల్ల గతుకుల రోడ్లు, చిన్న గుంతలపై సులువుగా వెళ్లవచ్చు. బాక్సీ షేప్, హై బోనెట్, స్క్వేర్ ఆర్చ్‌లు సియెర్రా ఎస్‌యూవీని మరింత పవర్‌ఫుల్ గా చేస్తాయి. స్లిమ్ LED హెడ్‌ల్యాంప్స్, ఫుల్–గ్లాస్ C పిల్లర్ ప్యానెల్, 19-అంగుళాల డైమండ్ కట్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ మోడ్రన్‌తో పాటు లగ్జరీ లుక్ ఇస్తాయి. ఆటో మోడ్‌లోనే వదిలేస్తే సియెర్రా SUV బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. కానీ, డీజిల్ ఇంజిన్ నాయిజ్ ఎక్కువ అని, NVH లెవల్స్ మెరుగుపరిచాల్సిన అవసరం ఉందని వినిపిస్తోంది.