Tata Sierra Tailgate Spare Wheel Modification Viral:  ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా సియెర్రా ఎస్‌యూవీ తన ఐకానిక్ స్టైలింగ్‌తో ఎంతో పాపులర్ అయింది. అయితే ఈ కారు బాక్సీ డిజైన్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ లగ్జరీ ఎస్‌యూవీని పోలి ఉండటంతో చాలా మంది వాహనదారులు దీనిని డిఫెండర్‌లా మార్చడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ అయిన ఒక వీడియోలో టాటా సియెర్రా ఓనర్ తన కారును ల్యాండ్ రోవర్ డిఫెండర్ లుక్ వచ్చేలా మోడిఫై చేశాడు. కారు వెనుక వైపు టెయిల్‌గేట్‌పై స్పేర్ వీల్‌ను మౌంట్ చేయడం ఈ మోడిఫికేషన్ స్పెషాలిటీ. ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుకు వెనుక వైపు ఇలాగే టైర్ ఉండటం వల్ల ఈ చిన్న మార్పుతో సియెర్రా కారుకు లగ్జరీ, రగ్గడ్ ఆఫ్-రోడ్ లుక్ వచ్చింది. సాధారణంగా కంపెనీ ఇచ్చే స్టాక్ మోడల్లో స్పేర్ వీల్ కారు బాడీ కింద అమర్చి ఉంటుంది.

Read Also: National Highways News: నేషనల్ హైవేలపై రాత్రి పూట లైట్లు ఎందుకు ఉండవు.. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ  క్లారిటీ ఇదే !

మోడిఫికేషన్ లోపాలు..ఈ వీడియోను నిశితంగా గమనిస్తే ఓనర్ వెనుక గేటు మధ్యలో స్పేర్ వీల్‌ను అమర్చాడు. దీనివల్ల కారు వెనుక ఉండే విండ్‌స్క్రీన్, సియెర్రా బ్యాడ్జ్, కనెక్టెడ్ లైట్ బార్ సగం వరకు కవర్ అయిపోయాయి. ఈ మోడిఫికేషన్ కోసం ఓనర్ ఆఫ్టర్ మార్కెట్ వీల్స్ వాడకుండా కంపెనీ ఇచ్చిన స్టాక్ అలాయ్ వీల్‌నే ఉపయోగించాడు. చూడటానికి ఈ లుక్ చాలా బాగున్నప్పటికీ, దీనివల్ల కారుకు కొన్ని స్ట్రక్చరల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టాటా సియెర్రా హయ్యర్ వేరియంట్లలో వెనుక డోర్ ఎలక్ట్రికల్‌గా ఓపెన్, క్లోజ్ అవుతుంది. ఈ స్పేర్ వీల్ బరువు వల్ల ఆ ఆటోమేటిక్ ఫంక్షన్ దెబ్బతినవచ్చు. పదే పదే వాడటం వల్ల హైడ్రాలిక్ స్ట్రట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే టెయిల్‌గేట్ ప్యానెల్ అంత బరువును మోసేలా డిజైన్ చేయకపోవడం వల్ల ఆ గేట్ షేప్ అవుట్ అవ్వచ్చు. 

Read Also: Best 7 Seater Cars: మారుతి ఎర్టిగా నుండి అల్కాజార్ వరకు.. అధిక మైలేజీ ఇచ్చే బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే

ఇంజిన్ ఆప్షన్స్, ధర వివరాలు..ఇండియన్ మార్కెట్లో టాటా సియెర్రా కారు ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ ఎస్‌యూవీ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే మాన్యువల్ గేర్‌బాక్స్ (MT), 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, డిసిఎ (DCA) ఆప్షన్లను కస్టమర్ల కోసం టాటా మోటార్స్ అందుబాటులో ఉంచింది.