TATA Sierra EV Launched:90ల నాటి ఇండియన్ ఆటోమొబైల్‌ హిస్టరీలో ఒక సంచలనం. టాటా సియరా ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో ఇండియన్ రోడ్లపైకి వచ్చింది. టాటా మోటార్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ టాటా సియరా ఈవీని అధికారికంగా నేడు లాంచ్ చేసింది. పాత తరం క్లాసిక్ డిజైన్‌ను అలాగే ఉంచుతూ, ప్యూచరిస్టిక్‌ Acti.ev+ ఆర్కిటెక్చర్‌పై నిర్మించిన  కారు, ఇటు క్లాస్ లుక్స్‌తోనూ అటు మాస్ ఫీచర్‌తోనూ మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. ఎలక్ట్రిక్‌ కార్ల కొనుగోలుదారులను వేధిస్తున్న అతి పెద్ద సమస్య బ్యాటరీ లైఫ్‌ కాగా, దానికి టాటా మైండ్ బ్లోయింగ్ సొల్యూషన్ ఇచ్చింది. 

Continues below advertisement

భారతీయ ఈవీ రంగంలోనే ఇది హిస్టారికల్ మూమెంట్‌. టాటా మోటార్స్ ఈ కారుతోపాటు ఎవరూ ఊహించని లైఫ్‌ టైమ్ బ్యాటరీ వారంటీని ప్రకటించి సంచలనం సృష్టించింది. కేవలం వారంటీ మాత్రమే కాదు, ఈ కారు ధర రేంజ్, ఇందులో ఇచ్చిన క్వాడ్ వీల్ డ్రైవ్‌ టెక్నాలజీ ఇప్పుడు హ్యాందాయ్‌ ఈవీ, మహీంద్రా బీఈ 6 లాంటి రైవల్స్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 18.99లక్షల ప్రారంభ ధరతో అడుగుపెట్టిన ఈ మోడల్, సింగిల్‌ ఛార్జ్‌పై ఏకంగా 630 కిలోమీటర్ల క్లెయిమ్ రేంజ్ అందిస్తూ రేంజ్ యాంగ్జైటీకి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసింది. 

టాటా మోటార్స్ మాస్టర్‌స్ట్రోక్‌

ఎలక్ట్రిక్‌ వాహనం అనగానే కస్టమర్ల మైండ్‌లో మెదిలే మొదటి ప్రశ్న కొన్నేళ్ల తర్వాత బ్యాటరీ పాడైపోతే మార్చడానికి లక్షల్లో ఖర్చు అవుతుందా? అనేది. ఈ భయానికి చెక్ పెడుతూ టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్‌ సియరా ఈవీతో సరికొత్త రికార్డు సృష్టించింది. కారు టాప్ ఎండ్‌ వేరియంట్లపై మొదటి ఓనర్‌కు లైఫ్‌టైమ్‌ హెచ్‌వీ బ్యాటరీ వారంటీని ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారతీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ఇదో గేమ్‌ఛేంజర్‌ కానుంది. 

Continues below advertisement

ఇది కాకుండా స్టాండర్డ్‌ ప్యాకేజీ కింద మోటార్‌పై 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీని, అలాగే పూర్తి కారుపై మూడేళ్లు లేదా 1,25,000 కిలోమీటర్ల వారంటీని టాటా అందిస్తోంది. ఈ లైఫ్‌టైమ‌ వారంటీ ఆఫర్‌ వల్ల సెకండ్ హ్యాండ్‌ రీసేల్‌ వాల్యూ కూడా అద్భుతంగా పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రిస్క్ లేని ఈవీ జర్నీని కోరుకునే మిడిల్ క్లాస్‌, ప్రీమియం బయ్యర్లకు ఇది పర్ఫెక్ట్‌ ఛాయిస్ అవుతుంది. 

మైండ్ బ్లోయింగ్ రేంజ్‌ 

టాటా సియరా ఈవీని విభిన్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రెండు పవర్‌ఫుల్‌ బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లతో లాంచ్ చేశారు. టాటా హారియర్‌ ఈవీ నుంచి సేకరించిన అధునాతన LFP బ్యాటరీ కెమిస్ట్రీని ఇందులో ఉపయోగించారు. 65 kWh బ్యాటరీ ప్యాక్‌ కేవలం సింగిల్ మోటార్ RWD కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. ఇది క్లెయిమ్డ్‌ రేంజ్ దాదాపు 520 కిలోమీటర్లు కాగా, రియల్ వరల్డ్‌ కండిషన్స్‌లో సులభంగా 400-450 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 75 kWh బ్యాటరీ ప్యాక్‌ లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడే వారి కోసం డిజైన్ చేశారు. ఈ వేరియంట్‌ సింగిల్, డ్యూయల్‌ మోటార్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. దీని అఫీషియల్‌ రేంజ్ ఏకంగా 630 కిలోమీటర్లు. రియల్ వరల్డ్ సిటీ, హైవే మిక్స్డ్‌ డ్రైవింగ్‌లో 500 కిలోమీటర్ల రేంజ్ పక్కా అని టాటా స్పష్టం చేసింది. 

ఛార్జింగ్ సంగతులు

ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే ఈ కారు 100kW డీసీ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. దీని సహాయంతో కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం వరకు బ్యాటరీని టాప్‌ అప్‌ చేసుకోవచ్చు. ఇంటి వద్ద నార్మ్‌ ఏసీ ఛార్జర్‌ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది.

ఇసుక దిబ్బల్లో సామర్థ్య పరీక్షలు 

ఈ కారు కేవలం సిటీ రోడ్లకే పరిమితం కాదు. దుమ్మురేపే అడ్వెంచర్ల కోసం సిద్దమైంది. వేరియంట్లలో లభించే ఎంపవర్డ్‌ QWD AWD సిస్టమ్‌ డ్యూయల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్లతో వస్తుంది. ఇది ప్రతి వీల్‌కు అవసరమైన టార్క్‌ను క్షణాల్లో పంపిణీ చేస్తుంది. ఇటీవలే యూఏఈలోని ప్రపంచ ప్రసిద్ధ తాల్ మొరీబ్‌ ఇసుక దిబ్బలు ఈ కారు విజయవంతంగా అధిరోహించి తన ఆఫ్‌రోడ్ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. 

సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌

డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ మరింత స్మూత్‌గా మార్చడానికి ఇందులో మల్టీ టెర్రైన్ మోడ్స్‌ ఇచ్చారు ఇందులో నార్మల్‌, రఫ్‌, రెయిన్, సాండ్‌, కస్టమ్‌ మోడ్స్ ఉన్నాయి. ఎనర్జీ రీజనేషన్ కోసం 4-లెవెల్‌ రీజెన్‌ మోడ్స్‌ ఉన్నాయి. సెంట్‌ కన్సోల్‌లో ఉన్న ఫిజికల్‌ బూస్ట్ మోడ్‌ బటన్ ప్రెస్‌ చేయగానే కారులోని 150 kW పీక్‌ పవర్‌, గరిష్ట టార్క్‌ అన్‌లాక్‌ అయి, కారు కేవలం కొన్ని సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగంగా రికార్డు అయింది. 

కారు కాదు డిజిటల్ ప్రపంచం

లోపలికి అడుగు పెడితే, సియరా ఈవీ మిమ్మల్ని ఒక సరికొత్త డిజిటల్‌ ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. దీని డ్యాష్ బోర్డులో అమర్చిన త్రిపుల్‌ స్క్రీన్ సెటప్‌‌ ప్రధాన ఆకర్షణ. ఇందులో ఏకంగా 42 ఇంచ్‌ కర్వ్డ్‌ ఫ్లో డిస్‌ప్లే అని అందించారు. ఇది ఇన్ఫోటైన్‌మెంట్‌, డ్రైవర్‌ డిస్‌ప్లే, కో ప్యాసింజర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అవసరాలను తీరుస్తుంది. 

కారు వెనుక భాగంలో క్లాసిక్‌ సియరా ఐడెంటిటీ అయిన లార్జ్‌ గ్లాస్‌ హౌస్‌ డిజైన్ ఉంది. దీని వల్ల కేబిన్ చాలా విశాలంగా కనిపిస్తుంది. వెనుక సీట్లలో కూర్చునే వారికి లగ్జరీ ఫీలింగ్ ఇవ్వడానికి మాన్యువల్ మోడ్ అందించారు. దీని ద్వారా వెనుక నుంచే ముందు సీటును అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. అదనంగా వాయిస్ అసిస్టెడ్‌ పనోరమిక్ సన్‌రూఫ్‌, డ్యూయల్‌ జోన్ క్లైమేట్‌ కంట్రోల్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, వైర్‌లెస్‌ ఛార్జర్ వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి. అం‌తేకాకుండా, మీ లగేజీ కోసం భారీ 622 లీటర్ల బూట్‌స్పేస్‌ లభిస్తుంది. ఈవీ స్పెసిఫిక్ ఫీచర్స్‌ అయిన వెహికల్ టు లోడ్‌, వెహికల్‌ టు వెహికల్‌ టెక్నాలజీ ద్వారా ఈ కారు నుంచి ఇతర గాడ్జెట్లకు లేదా మరో ఈవీ కారుకు ఛార్జింగ్ ఇచ్చుకోవచ్చు. 

నెక్స్ట‌ లెవల్‌ సేఫ్టీ ఫీచర్స్‌ 

సియరా ఈవీ కూడా భారత్ ఎన్‌క్యాప్‌ క్రాష్‌ టెస్టుల 5స్టార్‌ రేటింగ్ సాధించింది. సేఫ్టీని నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్తూ ఇందులో అడాస్ లెవల్‌ 2 ఫీచర్ను చేర్చారు. ఇందులో అడాప్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్‌, లేన్ కీప్ అసిస్ట్‌, అటానస్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్‌ మానిటరింగ్‌తో కూడిన 360 డిగ్రీల కెమెరా సిస్టమ్‌‌ ఉన్నాయి. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌ హిల్ హోల్డ్‌ కంట్రోల్ ఆల్‌ వీల్ డిస్క్ బ్రేక్స్, ఫ్రంట్ పార్కింగ్‌ సెన్సార్లు స్టాండర్డ్‌గా వస్తాయి. చీకటిలో స్పష్టమైన విజన్ కోసం ఫ్రంట్‌ అండ్ రేర్ కనెక్టెడ్‌ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ స్ట్రీప్స్‌, కార్నరింగ్ ఫాగ్‌ ల్యాంప్స్ అందించారు. 

టాటా సియరా ఈవీ మొత్తం ఆరు ప్రధాన వేరియంట్లలో లభ్యమవుతుంది. దీని బేస్ వేరియంట్‌ ధర 18.99 లక్షల నుంచి ప్రారంభమైన టాప్ వేరియంట్‌ 25.49 లక్షల వరకు ఉంటుంది. 

వేరియంట్‌ బ్యాటరీ సామర్థ్యంఎక్స్ షోరూమ్ ధర 
సియరా ఈవీ అడ్వేంచర్‌ 65 kWh, RWD (సింగిల్ మోటార్) రూ. 18.99లక్షలు
సియరా ఈవీ అడ్వేంచర్‌S65 kWh, RWD (పనోరమిక్‌ సన్‌రూఫ్‌) రూ.19.49 లక్షలు
సియరా ఈవీ ఫియర్‌లెస్‌ ప్లస్‌  65 kWh, RWD ( ప్రీమియం టెక్)రూ.20.99 లక్షలు
సియరా ఈవీ ఫియర్‌లెస్‌ ప్లస్‌LR75 kWh, RWD ( లాంగ్ రేంజ్‌)రూ.22.49 లక్షలు
సియరా ఈవీ ఎంపవర్డ్‌ QWD75 kWh, AWD ( డ్యూయల్ మోటార్)రూ.24.99 లక్షలు
సియరా ఈవీ ఎంపవర్డ్‌ స్టెల్త్‌ QWD75 kWh, AWD ( డార్క్‌ ఎడిషన్)

రూ.25.49 లక్షలు