'రాజు వెడ్స్ రాంబాయి' హీరో అఖిల్ రాజ్ (Akhil Raj Uddemari)పై ఇంటర్‌నెట్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఫుడ్ డెలివరీ బాయ్‌తో ఆయన గొడవ పడిన వీడియో వైరల్ అవుతోంది. ఓ బాయ్‌ను అలా కొట్టడం ఏమిటి? అని అఖిల్ రాజ్ మీద విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో వివరణ ఇస్తూ అఖిల్ రాజ్ వీడియో విడుదల చేశారు.

Continues below advertisement

డెలివరీ బాయ్ తాగొచ్చాడు...ఇంకా మా అమ్మను తిట్టాడు!సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే... డెలివరీ బాయ్ తనది తప్పు అయ్యిందని సారీ చెబుతున్నా, అతనిపై అఖిల్ రాజ్ దాడి చేసినట్లు అర్థం అవుతోంది. ఇంకా డెలివరీ బాయ్ ముఖం మీద అఖిల్ తల్లి ఉమ్మి వేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదంపై అఖిల్ రాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.

Also Read: Rahul Ravindran - రాహుల్ రవీంద్రన్ మెడకు పుణె కేతన్ అగర్వాల్ - సియా ఘోయల్ కేసు... ట్విట్టర్‌కు టాటా - ఎందుకంటే?

Continues below advertisement

డెలివరీ బాయ్ మద్యం మత్తులో తమ అపోజిట్ అపార్ట్‌మెంట్‌లో 201 ఫ్లాట్‌కు ఇవ్వాల్సిన పార్శిల్‌ను తమ ఇంటికి తీసుకు వచ్చాడని అఖిల్ రాజ్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''మా ఇంట్లోని నలుగురిలో ఎవరో ఒకరు ఆర్డర్ చేశారని మా నాన్నగారు అనుకొకున్నారు. ఆ పార్శిల్ తీసుకున్నారు. ఆ తర్వాత అది మా పార్శిల్ కాదని తెలిసింది. అప్పటికే మా అమ్మ దానికి ఓపెన్ చేశారు. ఆ తర్వాత విషయం తెలిసి పక్కన పెట్టారు. కాసేపటికి డెలివరీ బాయ్ వచ్చారు. మాది అనుకుని ఓపెన్ చేశామని మా అమ్మ చెప్పగా... 'ఎందే? ఫ్రీగా వస్తే తీసుకుందామని అనుకున్నావా?' అంటూ మాట్లాడాడు. పైగా తాగేసి ఉన్నాడు. మా అమ్మను అసభ్య పదజాలంతో దూషించాడు'' అని చెప్పారు.

Also ReadSudha Kongara Vs Parasakthi Producer Controversy: డబ్బులు ఎగ్గొట్టారు... తమిళ నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్

తన తల్లిని అవమానించడంతో కొడుకుగా తాను రియాక్ట్ అయ్యానని, అంతే తప్ప డెలివరీ బాయ్ పట్ల తనకు ఎలాంటి చిన్నచూపు లేదని అఖిల్ రాజ్ స్పష్టం చేశారు. తాను గతంలో డెలివరీ బాయ్‌గా పని చేశానని, ఆ కష్టం తనకు తెలుసని ఆయన పేర్కొన్నారు. డెలివరీ బాయ్ తప్పు చేయడమే కాకుండా... తిడతావేంటి? అని గట్టిగా అడిగినందుకు 'నువ్వు హీరో కదా! నిన్ను ఎలా వైరల్ చేస్తానో చూడు' అంటూ తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించాడని అఖిల్ రాజ్ వివరించారు. వీడియో చూస్తే... తాను ఎక్కడా కొట్టలేదని, తనను తండ్రి ఆపుతున్నట్టు ఉంటుందని తెలిపారు. 

వైరల్ అవుతున్న చిన్న వీడియో క్లిప్‌ చూసి తన వ్యక్తిత్వాన్ని తప్పుగా అంచనా వేయవద్దని ప్రజలకు అఖిల్ రాజ్ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఉదయం నుంచి తనపై విమర్శలు చేస్తున్న వాళ్ళందరూ... తమ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులను ఎవరైనా తిడితే ఏం చేస్తారని అఖిల్ రాజ్ ప్రశ్నించారు.

Also ReadNTR x Trivikram Controversy - దేవుడికి ప్రాంతాన్ని అంటకడతారా? తెలుగు వర్సెస్ తమిళ్ గొడవ... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాపై కాంట్రవర్సీ... ఏమైందో తెల్సా?