Tata Sierra vs Renault Duster: భారతీయ ఆటో మొబైల్ రంగంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం ఎప్పుడూ ఒక యుద్ధభూమిలాగా ఉంటుంది. ఇక్కడ పోటీ కేవలం బ్రాండ్ల మధ్య మాత్రమే కాదు. టెక్నాలజీ, పవర్‌, వినియోగదారుడికి లభించే వాల్యూ, మధ్య కూడా జరుగుతుంది. సాధారణంగా ఆటోమొబైల్‌ విశ్లేషణలు, చర్చలు అన్నీ టాప్‌ ఎండ్‌ వేరియంట్ల చుట్టూనే తిరుగుతుంటాయి. కానీ వాస్తవానికి మార్కెట్‌లో భారీ అమ్మకాలను సాధించి, కంపెనీ మార్కెట్‌ వాటాను పెంచేవి మాత్రం ఎంట్రీ లెవల్‌ వెర్షన్లే. ఈ క్రమంలో త్వరలో భారత్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతున్న రెనాల్డ్ డస్టర్‌, ఇప్పటికే మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న టాటా సియెర్రా మధ్య ఆసక్తికరమైన పోరు మొదలైంది. 

Continues below advertisement

ఈ రెండు దిగ్గజ సంస్థలు తమ ఎంట్రీ లెవల్ మోడళ్లను అత్యంత వ్యూహాత్మకంగా రూపొందించాయి. ముఖ్యంగా బడ్జెట్‌ పరిమితులు ఉండి, ఏస్‌యూవీ అనుభఊతిని కోరుకునే సామాన్య వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ పోటీ సాగుతోంది. ఈ కథనంలో టాటా సియెర్రా, రెనాల్డ్‌ డస్టర్‌ పవర్‌ ట్రెయిన్, పనితీరు, మార్కెట్ వ్యూహాల గురించి చూద్దాం. 

రెనాల్ట్ డస్టర్‌- టర్బో పెట్రోల్‌ వ్యూహం

రెనాల్ట్‌ డస్టర్‌ భారత్‌ మార్కెట్‌లోకి మూడు రకాల ఇంజన్‌ ఆప్షన్లతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అయితే ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నవి మాత్రం దాని ఎంట్రీ లెవల్‌ 1.0 లీటర్ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌. 

Continues below advertisement

సాధారణంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రారంభ ధరల వద్ద కంపెనీలు టర్బోచార్జ్డ్‌ ఇంజన్లను అందించవు. కానీ రెనాల్ట్ ఇక్కడ ఒక భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. ఈ 1.0 లీటర్ టర్బో ఇంజన్ 100 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇక్కడ ఒక పరిమితి ఉంది. ఈ ఇంజన్ కేవలం 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఇంజిన్‌ ఆప్షన్ డస్టర్‌కు చెందిన అన్ని ట్రిమ్‌లలో లభించదు. కేవలం బేసిక్ వేరియంట్లకే పరిమితం చేశారు. 

డస్టర్ బ్రాండ్‌ను తిరిగి భారత మార్కట్‌లో నిలబెట్టడానికి, పోటీ ధర వద్ద ఎస్‌యూవీని అందించడానికి ఈ ఎంట్రీ లెవల్‌ ఇంజన్ అత్యంత కీలకమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే టర్బో ఇంజన్ ఇచ్చే పిప్‌, డ్రైవింగ్ అనుభవం వినియోగదారులను ఎంత వరకు మెప్పిస్తుందనేది చూడాలి. 

టాటా సియెర్రా- పవర్, ఆప్షన్‌ల సమాహారం 

రెనాల్ట్ డస్టర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తున్న టాటా సియెర్రా, తన సొంత శైలిలో మార్కెట్‌లోకి వచ్చింది. సియెర్రా కూడా మూడు రకాల ఇంజిన్‌‌ ఎంపికలను అందిస్తున్నప్పటికీ దాని ఎంట్రీ లెవల్ వెర్షన్‌ డస్టర్ కంటే భిన్నంగా ఉంటుంది. 

సియెర్రాకు చెందిన ప్రారంభ వేరియంట్లలో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజన్ 110 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది డస్టర్‌కు చెందిన 1.0 లీటర్‌ టర్బో ఇంజన్‌ కంటే 10 బీహెచ్‌పీ ఎక్కువ 

సియెర్రాలో మరో పెద్ద అడ్వాంటేజ్‌ దాని ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లు. రెనాల్ట్ డస్ట్‌ ఎంట్రీ లెవల్ కేవలం మాన్యువల్‌ గేర్ బాక్స్‌ పరిమితం కాగా, టాటా సియెర్రా తన 1.5 లీటర్ ఇంజన్‌తోపాతు డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్ మాన్యువల్‌ గేర్‌బాక్స్ రెండింటినీ ఆఫర్ చేస్తోంది. రద్దీగా ఉండే నగరాల్లో ఆటోమేటిక్‌ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుంటే, టాటా ఇక్కడ ఒక అడుగు ముందే ఉందని చెప్పాలి. 

పవర్‌ వర్సెస్‌ టెక్నాలజీ 

పవర్ ట్రెయిన్ పరంగా చూస్తే టాటా సియెర్రా ప్రస్తుతానికి పైచేయి సాధించినట్టు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు గమనిస్తే... సియెర్రా అందించే 110 బీహెచ్‌పీ పవర్‌, డస్టర్ ఇచ్చే 100 బీహెచ్‌పీ కంటే మెరుగైంది. వినియోగదారులకు మాన్యువల్, ఆటోమేటిక్‌ అనే రెండు ఆప్షన్‌లు ఇవ్వడం వల్ల సియెర్రా వైవిధ్యంగా నిలుస్తోంది. 

అయితే రెనాల్ట్ డస్టర్‌ తనదైన ప్రత్యేకతను కలిగి ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ప్రారంభ ధరలకే టర్బో పెట్రోల్‌ టెక్నాలజీని అందించడం డస్టర్‌కు ప్లస్ అవుతుంది. ఇతర పోటీదారులు సాధారణంగా హై ఎండ్‌ వేరియంట్లకే టర్బో ఇంజన్లను కేటాయిస్తారు. కానీ రెనాల్ట్ దీనిని ఎంట్రీ లెవల్‌ ధరలకే తీసుకురావడం సామాన్య వినియోగదారులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. 

మార్కెట్ విశ్లేషణ 

ప్రస్తుతం గణాంకాల ప్రకారం సియెర్రా శక్తివంతమైనప్పటికీ, మార్కెట్ గమనాన్ని నిర్ణయించేది మాత్రం ధర త్వరలో ప్రారంభమయ్యే రెనాల్ట్ డెస్టర్‌, టాటా సియెర్రా కంటే మరింత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. క వేళ రెనాల్ట్ తన టర్బో ఇంజిన్‌తో కూడిన డస్టర్‌ను అత్యంత తక్కువ ధరకే లాంచ్ చేస్తే ఇది మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షించటంలో విజయం సాధించవచ్చు. 

మరోవైపు భారతీయ వినియోగదారులు ఇప్పుడు కేవలం మైలేజీ మాత్రమే కాకుండా, సేఫ్టీ, టెక్నాలజీని కూడా చూస్తున్నారు. టాటా కంపెనీ ఇప్పటికే తన వాహనాల్లో ఫైవ్ స్టార్ సేఫ్టీ, ఆధునిక ఫీచర్‌లను అందించడంలో పేరు పొందారు. సియెర్రా తన ఎంట్రీ లెవల్ ఇంజన్‌తోపాటు మంచి ఆటోమేటిక్ ఆప్షన్ను కూడా ఇవ్వడం వల్ల నగరవాసులకు ఇది మొదటి ఎంపిగా మారే ఛాన్స్ ఉంది.