✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Indigestion Problems : తిన్న వెంటనే కడుపు మంట, ఉబ్బరం వస్తుందా? అయితే ఈ ఫుడ్స్ తినకపోవడమే మంచిది

Geddam Vijaya Madhuri   |  10 Feb 2026 01:44 PM (IST)

Digestion Issues : గ్యాస్, ఎసిడిటీ పెరుగుతున్నాయా? పదేపదే అజీర్ణం రావడానికి కొన్ని ఫుడ్స్ కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. అవేంటో వాటివల్ల కలిగే నష్టాలు ఏంటో చూసేద్దాం.

Indigestion Problems : తిన్న వెంటనే కడుపు మంట, ఉబ్బరం వస్తుందా? అయితే ఈ ఫుడ్స్ తినకపోవడమే మంచిది

గ్యాస్, ఎసిడిటీ పెరుగుతున్నాయా? ఈ ఫుడ్స్​తో జాగ్రత్త

Digestion Problems : నేటి బిజీ లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్ల ప్రభావం నేరుగా జీర్ణవ్యవస్థపై పడుతోంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, బయట వేయించిన ఆహారం తీసుకోవడం, రుచికోసం ఎక్కువ మసాలా ఉండే ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల అజీర్ణ సమస్య పెరుగుతోంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. చాలాసార్లు తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులు, ఛాతీలో మంట కూడా వస్తుంది. వైద్యులు దీని గురించి మాట్లాడుతూ.. మీకు పదేపదే అజీర్ణం సమస్య వస్తుంటే దానికి ఆహారమే ప్రధాన కారణం అంటున్నారు. మరి అజీర్ణం సమస్యను కలిగించే ఆహార పదార్థాలు ఏమిటో.. వాటివల్ల ఎందుకు ఇబ్బంది కలుగుతుందో తెలుసుకుందాం.

మసాలా, వేయించిన ఆహారం

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఎక్కువ మసాలా, వేయించిన ఆహారం తింటే.. అది జీర్ణమవడానికి కష్టంగా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్.. కడుపులో మంట, ఎసిడిటీని పెంచుతాయి. ఇది జీర్ణ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, ఛాతీలో మంట వస్తుంది.

అధిక కొవ్వు పదార్థాలు

అధిక కొవ్వు కలిగిన ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల కడుపు చాలాసేపు నిండినట్లు అనిపిస్తుంది. గ్యాస్, ఉబ్బరం సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వేయించిన ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారం, బయటి ఆహారం అజీర్ణాన్ని పెంచుతాయి.

సిట్రస్ ఫ్రూట్స్

నారింజ, నిమ్మ వంటి సీజనల్ ఫ్రూట్స్, వాటి రసాలు కొందరిలో అజీర్ణం, ఎసిడిటీని కలిగిస్తాయి. వీటిలో ఉండే అధిక ఆమ్లత్వం కడుపు, ఆహార నాళంలో మంటను కలిగిస్తుంది. దీనివల్ల అసౌకర్యం పెరుగుతుంది.

కోల్డ్ డ్రింక్స్, కార్బోనేటేడ్ డ్రింక్స్

సోడా, ఇతర కార్బోనేటేడ్ డ్రింక్స్ కడుపులో గ్యాస్, త్రేన్పుల సమస్యను పెంచుతాయి. వీటిలో అధిక చక్కెర, కృత్రిమ స్వీటెనర్లు కూడా జీర్ణక్రియకు హాని కలిగిస్తాయి.

కెఫీన్, ఆల్కహాల్

కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం కూడా అజీర్ణానికి కారణం కావచ్చు. ఇది కడుపులో ఆమ్ల స్థాయిని పెంచుతుంది. దీనివల్ల ఛాతీలో మంట, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసుకుంటే ఇది మరింత హాని చేస్తుంది.

ప్రాసెస్ చేసిన ఫుడ్

డబ్బాల్లో నిల్వ చేసిన, ప్యాక్ చేసిన స్నాక్స్, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారంలో ఫైబర్ తక్కువగా, ఉప్పు-కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. అజీర్ణం సమస్యను పెంచుతుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

అజీర్ణం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. తేలికపాటి, సమతుల్య ఆహారం తీసుకోండి. సమయానికి తినడం కూడా అంతే ముఖ్యం. అలాగే ఆహారాన్ని బాగా నమలి తినాలి. స్పీడ్గా, ఆత్రంగా తినకపోవడమే మంచిది. వేయించిన, జంక్ ఫుడ్ తగ్గించండి. పూర్తిగా దూరంగా ఉంటే మరీ మంచిది. రోజులో కొంచెం నడవడం, తేలికపాటి వ్యాయామం కూడా మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Published at: 10 Feb 2026 01:42 PM (IST)
Tags:Indigestion Problemfoods that cause indigestiondigestion problems causesindigestion symptomsindigestion and gasacid reflux foodsunhealthy digestion habitsspicy food indigestionfried food digestion issuehigh fat foods digestionindigestion after eating
  • హోమ్
  • లైఫ్‌స్టైల్‌
  • Indigestion Problems : తిన్న వెంటనే కడుపు మంట, ఉబ్బరం వస్తుందా? అయితే ఈ ఫుడ్స్ తినకపోవడమే మంచిది
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.