Tata Sierra 1.5 NA petrol review: 2025లో భారతీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో అత్యంత చర్చకు వచ్చిన మోడళ్లలో Tata Sierra ఒకటి. బుకింగ్స్‌ ప్రారంభించిన రోజే 70 వేలకుపైగా ఆర్డర్లు రావడం చూస్తే, ఈ పేరుకు ఉన్న క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 1990ల నాటి సియేరాను ఆధునిక టెక్నాలజీతో మళ్లీ తీసుకొచ్చిన టాటా మోటార్స్‌, ఈ SUVని మూడు ఇంజిన్‌ ఆప్షన్లతో అందిస్తోంది. 

Continues below advertisement

కొత్త టాటా సియేరాను స్వయంగా నడిపిన ఆటోమొబైల్‌ ఎక్స్‌పర్ట్‌ల అభిప్రాయాలు ఇవి:

టాటా సియేరాలో బేస్‌ వేరియంట్‌గా వచ్చిన 1.5 లీటర్‌ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వేరియంట్‌ ధరను ఆకర్షణీయంగా ఉంచేందుకు టాటా ఈ ఇంజిన్‌ను ఎంపిక చేసింది. ప్రారంభ ధర ₹11.49 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉండటం వల్ల, కాంపాక్ట్‌ SUV నుంచి అప్‌గ్రేడ్‌ అవ్వాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌.

Continues below advertisement

ఈ 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ Atkinson సైకిల్‌పై పనిచేస్తుంది. దీని ప్రధాన లక్ష్యం పవర్‌ కంటే ఇంధన సామర్థ్యం ఇవ్వడం. గరిష్టంగా 106hp పవర్‌, 145Nm టార్క్‌ మాత్రమే అందిస్తుంది. కాగితాలపై ఇవి పెద్ద సంఖ్యలు కాకపోయినా, సిటీ డ్రైవింగ్‌కు సరిపడే ట్యూనింగ్‌ ఉంది. 2,100rpm నుంచే టార్క్‌ అందుబాటులోకి రావడంతో, ట్రాఫిక్‌లో సియేరా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. కానీ ఓవర్‌టేక్‌లు చేయాలంటే ముందుగానే ప్లాన్‌ చేయాల్సిందే. 0 నుంచి 100km వేగానికి చేరుకోవడానికి సుమారు 17 సెకన్లకు పైగా సమయం పడుతుంది. అంటే ఇది డ్రైవర్‌ను ఉత్సాహపరిచే SUV కాదు, కానీ... నెమ్మదిగా, సౌకర్యంగా ప్రయాణించాలనుకునే వారికి సరిపోతుంది.

మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ చాలా స్మూత్‌6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ టాటా ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత స్మూత్‌ యూనిట్లలో ఒకటి. క్లచ్‌ తేలికగా ఉండటం వల్ల నగరంలో డ్రైవింగ్‌ చాలా సులభంగా ఉంది. ఆటోమేటిక్‌ వేరియంట్‌గా వచ్చే 7-స్పీడ్‌ DCA గేర్‌బాక్స్‌ పూర్తిగా కంఫర్ట్‌ కోసం ట్యూన్‌ చేశారు. గేర్‌ మార్పులు మృదువుగా ఉన్నా, వెంటనే రెస్పాండ్‌ అయ్యే స్వభావం కాస్త తక్కువగా అనిపిస్తుంది.

మైలేజ్‌ విషయానికి వస్తే, ఇది భారీ SUV అయినప్పటికీ 17-18 km లీటర్లు (క్లెయిమ్డ్‌) ఇస్తుంది. ఇది హ్యుందాయ్‌ క్రెటా 1.5 NA పెట్రోల్‌తో పోల్చదగిన స్థాయిలోనే ఉంది. 

మెప్పించే సస్పెన్షన్‌సియేరా అసలు బలం రైడ్‌ కంఫర్ట్‌. Frequency Selective Damping సస్పెన్షన్‌ వల్ల చెడ్డ రోడ్లపై కూడా కారు చాలా స్థిరంగా ఉంటుంది. 17-ఇంచ్‌ వీల్స్‌, 65 ప్రొఫైల్‌ టైర్లు ప్రయాణికులకు అదనపు సౌకర్యాన్ని ఇస్తాయి. మలుపుల్లో కూడా బాడీ కంట్రోల్‌ మెప్పిస్తుంది.

ఇంటీరియర్‌ అయితే టాటా బ్రాండ్‌కు ఒక కొత్త బెంచ్‌మార్క్‌. మెటీరియల్‌ క్వాలిటీ, ఫిట్‌ అండ్‌ ఫినిష్‌ చాలా ప్రీమియంగా అనిపిస్తాయి. ముందు సీట్లు, వెనుక సీట్లు రెండూ పెద్ద ప్రయాణాలకు బాగా సరిపోతాయి. వెనుక సీట్లో లెగ్‌రూమ్‌, అండర్‌థై సపోర్ట్‌ ఈ సెగ్మెంట్‌లో బెస్ట్‌ అని చెప్పొచ్చు.

ఫీచర్లుఫీచర్ల పరంగా కూడా సియేరా ఎక్కడా తగ్గదు. పానోరమిక్‌ సన్‌రూఫ్‌, 360 డిగ్రీ కెమెరా, పెద్ద టచ్‌స్క్రీన్‌, డిజిటల్‌ క్లస్టర్‌, ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి.

మొత్తానికి, Tata Sierra 1.5 NA పెట్రోల్‌ పవర్‌ ప్రేమికుల కోసం కాదు. కానీ కంఫర్ట్‌, స్పేస్‌, రైడ్‌ క్వాలిటీ, ఫీచర్లు ముఖ్యమని భావించే వారికి ఇది మంచి ఆప్షన్‌. ప్రశాంతంగా ప్రయాణించాలనుకునే కుటుంబాలకు, చాఫర్‌ డ్రైవెన్‌ SUVగా కూడా ఇది బాగా సరిపోతుంది. డ్రైవింగ్‌లో ఉత్సాహం కావాలంటే మాత్రం డీజిల్‌ లేదా టర్బో పెట్రోల్‌ వేరియంట్‌ వైపు చూడాల్సిందే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.