Tata Punch New Price GST 2,0 Cut: తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUV టాటా పంచ్, ఇప్పుడు మరింత తక్కువ ధరలోకి మారింది. గతంలో, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 5,99,990. ఈ నెల 22వ తేదీ నుంచి కొత్త GST 2.0 అమలుతో, కంపెనీ ఈ ధరను రూ. 5,49,990 కి తగ్గించింది. అంటే, ఈ కారును ఇప్పుడు కొనే కస్టమర్లు ప్పుడు నేరుగా రూ. 50,000 ఆదా చేయగలుగుతారు. బడ్జెట్ రేటులో ప్రీమియం & 5-స్టార్ సేఫ్టీ SUVని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మార్పు ఒక గొప్ప శుభవార్త.
ప్రీమియం & మోడ్రన్ ఇంటీరియర్స్కొత్త టాటా పంచ్ 2025 లోపలి భాగాన్ని మరింత ప్రీమియంగా తీర్చిదిద్దారు. లెదర్‌తో చుట్టిన 2-స్పోక్ స్టీరింగ్ వీల్, ప్రకాశవంతమైన టాటా లోగో ఇచ్చారు. పెద్ద 10.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ ఇస్తుంది. డ్రైవర్ కోసం 7-అంగుళాల డిజిటల్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంది, ఇది అవసరమైన అన్ని సమాచారాలను స్పష్టంగా ప్రదర్శిస్తుంది. అదనంగా, క్యాబిన్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ & ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వంటి లక్షణాలు ఉన్నాయి. టాప్ వేరియంట్‌లలో సన్‌రూఫ్ & వెంటిలేటెడ్ సీట్లు కూడా వస్తాయి, ఇది దాని విభాగంలో మరింత ప్రత్యేకంగా ఉంటుంది.
ఫీచర్లుటాటా పంచ్ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు & క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో నిండిపోయింది. అదనంగా.. రివర్స్ పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, పుష్-బటన్ స్టార్ట్ & కీలెస్ ఎంట్రీ దీన్ని మరింత సౌకర్యవంతంగా మార్చాయి. టాప్ వేరియంట్లలో టచ్-అండ్-టోగుల్ ఆడియో కంట్రోల్స్ & కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఈ టెక్నాలజీతో కస్టమర్‌లు రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ & రిమోట్ కంట్రోల్ ఫీచర్‌లను సద్వినియోగం చేసుకోవచ్చు.
5-స్టార్ రేటింగ్ భద్రతటాటా పంచ్ గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందడం మరో హైలైట్. దీంతో, అత్యంత సురక్షితమైన వాహనాలలో ఒకటిగా ఈ కారు నిలిచింది. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌లో ఇప్పుడు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS & EBD, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, వెనుక పార్కింగ్ సెన్సార్లు & టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. దీని దృఢమైన నిర్మాణం & అధిక-బలం కలిగిన స్టీల్.. క్రాష్ ప్రొటెక్షన్‌ను మరింత మెరుగుపరుస్తాయి. భద్రత మీద ఎక్కువ దృష్టి పెట్టే కస్టమర్‌లకు ఇది టాప్ ఆప్షన్ అవుతుంది.
ఇంజిన్ & మైలేజ్కొత్త టాటా పంచ్ 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ 87 bhp & 115 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని CNG వేరియంట్ 72 bhp & 103 Nm టార్క్ ఇస్తుంది. ఈ కారు మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 20.09 kmpl మైలేజీని అందిస్తుందని, CNG వేరియంట్ 26.99 km/kg ఆకట్టుకునే మైలేజీని అందిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది.
ప్రత్యర్థి కార్లు కూడా చవకటాటా పంచ్ పోటీ కార్లు - Hyundai Exter & Maruti Suzuki Ignis. Tata Altroz, Tata Tiago & Renault Kiger తోనూ ఇది పోటీ పడుతుంది. ఇటీవలి GST తగ్గింపు తర్వాత, హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర ₹31,000 నుంచి ₹86,000 వరకు తగ్గింది. మారుతి ఇగ్నిస్ ధర ₹50,000 నుంచి ₹70,000 వరకు దిగి వచ్చింది. అంటే, ప్రస్తుతం కస్టమర్‌లకు తక్కువ ధరల్లోనే చాలా ఫీచర్-లోడెడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి.