పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న క్రమంలో చాలా మంది CNG కార్లకు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు. వాస్తవానికి పెట్రోల్, డీజిల్‌తో పోల్చితే సీఎన్జీ చవకైన, ఆర్థికపరంగా బెస్ట్ ఎంపికగా భావిస్తారు. అయితే, ఇప్పుడు CNG వాహనదారులు సైతం ధరల పెంపు వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ-NCRతో సహా అనేక నగరాల్లో CNG ధరలు పెరుగుతున్నాయి. దీనివల్ల రోజువారీ ప్రయాణించే వారి ఖర్చు వల్ల నెలవారీ బడ్జెట్ దెబ్బతింటుంది. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారిపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది.

Continues below advertisement

ఢిల్లీలో ఇప్పుడు CNG ధర కిలో 80.09 రూపాయలకు చేరింది. హైదరాబాద్‌లో కేజీ సీఎన్జీ ధర రూ.97 అయింది. నోయిడా , గాజియాబాద్ లలో  కిలో ధర 88.70 రూపాయలకు చేరుకుంది. గురుగ్రామ్‌లో CNG కిలో రూ.85.12 కు విక్రయిస్తున్నారు. దీంతో పాటు మీరట్, ముజఫర్‌నగర్, షామ్లీ, ఇతర నగరాల్లోనూ ధరలు పెరిగాయి. గత మూడు రోజుల్లో CNG ధర పెరగడం ఇది రెండోసారి. ఇంతకుముందు కిలోకు రూ. 2 చొప్పున పెంచారు.

Tata Punch CNG మైలేజ్ ఎంత?

Tata Punch CNG కస్టమర్ల ఆధరణ పొందిన ఒక ఫేమస్ కారు. ఇది ARAI ప్రకారం ఒక కేజీకి దాదాపు 22.99 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుత CNG ధర కిలో 80.09 రూపాయలు కనుక ఈ కారు డ్రైవింగ్‌కు ఖర్చు దాదాపు కిలోమీటరుకు 3.48 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్‌లో అయితే 4 రూపాయలకు పైగా ఉంది. టాటా పంచ్ CNG ట్యాంక్ దాదాపు 60 లీటర్లు, ఇందులో దాదాపు 10 కిలోల CNG వస్తుంది కనుక ఒకసారి ట్యాంక్ నింపడానికి దాదాపు రూ.970 వరకు ఖర్చవుతుంది.

Continues below advertisement

Also Read: Tata Nexon లేదా Nissan Magnite .. ధర, మైలేజ్, ఫీచర్ల పరంగా ఏ కారు కొనడం మంచిది?

మారుతి స్విఫ్ట్ సీఎన్జీ మైలేజీ (Maruti Swift CNG Mileage)

Maruti Suzuki Swift CNG కూడా కస్టమర్ల నమ్మకాన్ని పొందిన కారు. ఇందులో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. దీని మైలేజ్ మాన్యువల్ వెర్షన్‌లో దాదాపు 32.85 కిలోమీటర్లు/కిలో CNG వరకు ఉంటుంది. కొత్త CNG ధర ప్రకారం, హైదరాబాద్‌లో ఈ కారు నడపడానికి కిలోమీటరుకు 4 రూపాయలు అవుతుంది. ఢిల్లీలో అయితే దాదాపు 2.44 రూపాయలు ఖర్చవుతుంది. ఈ కారు CNG ట్యాంక్ దాదాపు 55 లీటర్లు. ఇందులో సాధారణంగా 7 నుండి 9 కిలోల CNG ఫిట్ చేస్తారు. కనుక ఒకసారి సీఎన్జీ ట్యాంక్ నింపడానికి దాదాపు 870 రూపాయల వరకు ఖర్చవుతుంది.

ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం. దాంతో సహజ వాయువు వ్యయం పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు అమెరికన్ డాలర్ బలపడటం వల్ల గ్యాస్ దిగుమతి చేసుకోవడం పలు దేశాలతో పాటు భారత్‌కు సైతం ఖరీదుగా మారుతోంది. అందుకే IGL CNG ధరలను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. పెరుగుతున్న ఖర్చులను కొంతవరకు బ్యాలెన్స్ చేయడానికి ధరల స్వల్ప పెంపుదల చేసినట్లు కంపెనీలు చెబుతున్నాయి. 

Read Also: Mahindra BE6 Discount: మహీంద్రా ఈవీపై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి