మీరు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మార్కెట్లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న మహీంద్రా BE 6 మోడల్ వివరాలు తెలుసుకోండి. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా మే 2026 నెలకు గానూ ఈ బీఈ 6 కారుపై బంపర్ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, అదిరిపోయే రేంజ్‌తో యువతతో పాటు ఫ్యామిలీ కస్టమర్లను సైతం మహీంద్రా ఈవీ (EV) ఆకట్టుకుంటోంది.

Continues below advertisement

రూ. 2 లక్షల వరకు తగ్గింపు ఆఫర్ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు మహీంద్రా ఆఫర్లతో ముందుకు వచ్చింది. మహీంద్రా BE 6 కి చెందిన MY2025 మోడళ్లపై ప్రస్తుతం దాదాపు 2 లక్షల రూపాయల వరకు భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. అయితే, ఈ ఆఫర్ పరిమిత స్టాక్‌కు మాత్రమే వర్తిస్తుందని సమాచారం. నగరాలు, డీలర్‌షిప్‌లను బట్టి ఈ తగ్గింపు ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఒకవేళ డీలర్ల వద్ద కొత్త MY2026 స్టాక్ ఉంటే ఈ ఆఫర్ వర్తించకపోవచ్చు. కనుక కొనుగోలుకు ముందే స్థానిక డీలర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని బెనిఫిట్స్ పొందాలి. 

మహీంద్రా బీఈ 6 ధర, డిజైన్ మహీంద్రా BE 6 ప్రారంభ ధర సుమారు రూ. 18.90 లక్షల నుండి మొదలై టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 26.90 లక్షల వరకు ఉంది. దీని స్పోర్టీ, ఫ్యూచరిస్టిక్ లుక్ రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మోడ్రన్ ఎల్‌ఈడీ (LED) లైటింగ్, ఏరోడైనమిక్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్స్ ఈ కారుకు లగ్జరీ లుక్‌ను ఇస్తున్నాయి. 

Continues below advertisement

Also Read: Five Best Electric SUVs: పెట్రోల్ డీజిల్ ధరల సెగ-  మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే

బ్యాటరీ సామర్థ్యం, మైలేజీ రేంజ్ఈ మహీంద్రా ఎస్‌యూవీలో కస్టమర్ల కోసం 59 kWh, 79 kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. ఇందులో ఉండే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 683 కిలోమీటర్ల రేంజ్ వరకు హాయిగా దూసుకెళ్లవచ్చు అని కంపెనీ చెబుతోంది. లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడం ప్లస్ పాయింట్.

నెక్స్ట్ లెవెల్ హైటెక్ ఫీచర్లుఫీచర్ల పరంగా మహీంద్రా BE 6 లో ఎక్కడా రాజీ పడలేదు. 

పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే

వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే

360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు

హెడ్-అప్ డిస్‌ప్లే

సేఫ్టీ ఫీచర్లు: లెవెల్-2 ADAS టెక్నాలజీ, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Read Also: Top 5 Hybrid Cars Mileage: ఆఫీసుకు వెళ్లేవారికి అద్భుతమైన మైలేజ్ ఇచ్చే టాప్ 5 హైబ్రిడ్ కార్లు ఇవే

మార్కెట్లో పెరిగిన డిమాండ్.. ఆ కార్లకు గట్టి పోటీభారత ఆటో మార్కెట్లో ఈ కారుకు ఆదరణ పెరుగుతోంది. ఏప్రిల్ 2026 సేల్స్ రిపోర్ట్ ప్రకారం.. BE 6 అమ్మకాల్లో ఏకంగా 113 శాతం వృద్ధి నమోదు చేసింది.  భారత్‌లో వాహనదారులు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఎంతలా మొగ్గు చూపుతున్నారని ఇది రుజువు చేసింది. ప్రస్తుత మార్కెట్లో ఈ మోడల్.. టాటా కర్వ్ EV, మారుతి ఈ-విటారాతో పాటు హ్యుందాయ్ క్రెటా EV వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తోంది.