Tata Punch Facelift Design Launch Date And Price: టాటా మోటార్స్ కార్లలో పంచ్‌కి ప్రత్యేక పొజిషన్ ఉంది. స్మాల్ SUV సెగ్మెంట్‌లో ఇది బెస్ట్ సెల్లర్‌గా నిలుస్తూ, యూత్ నుంచి ఫ్యామిలీస్ వరకు అందరి ఫేవరెట్‌గా మారింది. ఇప్పుడు, పంచ్ కొత్త అవతారంలో, అంటే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా రాబోతోంది. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న రిపోర్ట్స్ ప్రకారం, టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ ఏడాది అక్టోబర్‌లో, అంటే ప్రస్తుత పండుగ సీజన్‌లోనే లాంచ్ చేయవచ్చు. ఇది మిస్ అయితే 2026లో లాంచ్ చేయవచ్చు.
ఎక్స్‌టీరియర్ డిజైన్ అప్‌డేట్స్
తాజాగా లాంచ్ చేసిన టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ (Tata Altroz Facelift) లో వచ్చిన మార్పులే ఇప్పుడు పంచ్‌లో కూడా కనబడబోతున్నాయని సమాచారం. ముఖ్యంగా, రియర్ లుక్‌లో కనెక్టెడ్ LED లైట్‌బార్ పెద్ద హైలైట్ కావచ్చు. ఇప్పటి పంచ్‌లో చిన్న టెయిల్‌ల్యాంప్స్ ఉన్నా, కొత్త డిజైన్ SUV లుక్స్ ఇస్తుంది. అదనంగా కొత్త బంపర్, హెడ్‌ల్యాంప్స్, రియర్ వైపర్ కూడా యాడ్ అవుతాయని తెలుస్తోంది.
ప్రీమియం ఇంటీరియర్
ఇంటీరియర్ విషయానికి వస్తే, పంచ్ ఫేస్‌లిఫ్ట్ మరింత ప్రీమియం లుక్‌తో రానుంది. టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఇల్యూమినేటెడ్ (ప్రకాశించే) లోగో, పెద్ద టచ్ స్క్రీన్ - ఇవన్నీ పంచ్ EV తరహాలోనే అందించబోతున్నారు. సెంటర్ కన్సోల్ కూడా కొత్త డిజైన్‌లో ఉంటుంది.
ఫీచర్లలో అప్‌డేట్స్
కొత్త పంచ్‌లో ప్రీమియం ఆడియో సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు రానున్నాయి. ఈ మార్పులు ఈ కారును కేవలం చిన్న SUV లాగా కాకుండా, హై-ఎండ్ అనిపించేలా మారుస్తాయి.
ఇంజిన్ & పవర్‌ట్రెయిన్
ఇంజిన్ ఆప్షన్స్‌లో పెద్దగా మార్పులు లేవు. ఇప్పటిలాగే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్ & AMT గేర్‌బాక్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అదనంగా CNG వెర్షన్ కూడా కొనసాగుతుంది.
లాంచ్ టైమ్‌లైన్
ముందుగా Tata Sierra ని మార్కెట్‌లోకి తీసుకురానుంది. దాని తర్వాతే పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అవుతుంది. ఈ ప్రకారం చూస్తే, 2026 ప్రారంభంలో కొత్త పంచ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ధర అంచనా
కొత్త డిజైన్, ఫీచర్లు జోడించినందున, పంచ్ ఫేస్‌లిఫ్ట్ ధరలో కాస్త పెరుగుదల ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో, ప్రస్తుతం ఉన్న పంచ్ బేస్ వేరియంట్ రూ. 5.50 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది, టాప్-ఎండ్‌కు రూ. 9.30 లక్షల వరకు ఉంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రూ. 6.00 లక్షల స్థాయి నుంచి ప్రారంభం అవుతుందని అంచనా, టాప్-ఎండ్‌కు 11.00 లక్షల వరకు ఉండొచ్చు. పంచ్ ఫేస్‌లిఫ్ట్ ధర పెరిగినప్పటికీ, కొత్త లుక్, అదనపు టెక్నాలజీ వల్ల అది కస్టమర్లకు సరైన డీల్ అని చెప్పొచ్చు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా టాటా పంచ్‌కు చాలా డిమాండ్ ఉంది, ఇది అత్యంత క్రియాశీలమైన మోడల్. ఫేస్‌లిఫ్ట్‌తో మరింత స్టైలిష్‌గా, ప్రీమియంగా మారబోతోంది. ఆల్ట్రోజ్ తరహా అప్‌డేట్స్‌తో రాబోయే పంచ్, హాట్ టాపిక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.