Festival Offers on Maruti Suzuki Cars 2025: దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి కస్టమర్లను ఆకట్టుకునే బంపర్ ఆఫర్ ప్రకటించింది. తాజా జీఎస్‌టీ (GST 2.0) తగ్గింపును పూర్తిగా వినియోగిస్తూ, తన అన్ని మోడల్స్ ధరలను ఏకంగా 1.30 లక్షల రూపాయల వరకు తగ్గిస్తున్నట్టు ఈ కంపెనీ ఇటీవలే ప్రకటించింది.
చిన్న కార్లపై అదనపు డిస్కౌంట్
GST తగ్గింపుతో పాటు చిన్న కార్ల ధరలను మరింత తగ్గిస్తూ మారుతి సుజుకి ప్రత్యేక పండుగ ఆఫర్ ఇచ్చింది. ముఖ్యంగా, బైకులు లేదా స్కూటర్లు (రెండు చక్రాల వాహనాలు) ఉపయోగిస్తున్న వాళ్లు సులభంగా కార్లకు (నాలుగు చక్రాల వాహనాలు) అప్‌గ్రేడ్ అయ్యేలా చేయడమే ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
మారుతి కారు మోడల్ వారీగా ఇవీ తగ్గింపులు & సెప్టెంబర్ 22, 2025 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి:
Maruti S-Presso ధరలు రూ. 1,29,600 వరకు తగ్గాయి.
Maruti Alto K10 రూ. 1,07,600 వరకు డౌన్.
Maruti Celerio రూ. 94,100 వరకు తగ్గింపు.
Maruti Wagon-R రూ. 79,600 వరకు డిస్కౌంట్.
Maruti Ignis రూ. 71,300 వరకు తగ్గింపు.
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ & సెడాన్ మోడళ్లపై తగ్గింపులు
Maruti Swift ధరలు రూ. 84,600 వరకు తగ్గాయి.
Maruti Baleno రూ. 86,100 వరకు డౌన్.
Maruti Dzire రూ. 87,700 వరకు తగ్గింది.
Maruti Fronx ధరలు రూ. 1,12,600 వరకు తగ్గాయి.
Maruti Brezza రూ. 1,12,700 వరకు తగ్గింపు.
Maruti Grand Vitara రూ. 1,07,000 వరకు డిస్కౌంట్.
Maruti Jimny రూ. 51,900 వరకు తగ్గింపు.
Maruti Ertiga రూ. 46,400 వరకు తగ్గింది.
Maruti XL6 రూ. 52,000 వరకు తగ్గింది.
ఇతర మోడళ్లపై తగ్గింపులు
Maruti Invicto రూ. 61,700 తగ్గింది.
Maruti Eeco రూ. 68,000 వరకు తగ్గింది.
Maruti Super Carry LCV రూ. 52,100 వరకు తగ్గింది.
కార్ల ధరలు తగ్గడంతో, కొత్త జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన మొదటి రోజు (సెప్టెంబర్ 22, 2025) నుంచే మారుతి కార్ల బుకింగ్స్ భారీగా పెరిగాయి, రిజిస్ట్రేషన్లలో ఊపు పెరిగింది.
మారుతి సుజుకి GST తగ్గింపులు కేవలం కంపెనీ అమ్మకాలను పెంచడమే కాదు, కామన్ మ్యాన్ జేబుకు కూడా ఊరటనిస్తుంది. ఇప్పుడే షోరూమ్‌కి వెళ్లి, కొత్త డిస్కౌంట్ రేటుతో మీ డ్రీమ్ కార్ బుక్ చేసుకునేందుకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.
ఆటో ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా చిన్న కార్ల అమ్మకాలు తగ్గినప్పటికీ, ఈసారి జీఎస్‌టీ భారీ తగ్గింపులు ఈ రంగాన్ని మళ్లీ పుంజుకునేలా చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అదనంగా, కార్ల సర్వీసింగ్ & మెయింటెనెన్స్‌లో వాడే విడిభాగాలపై కూడా GST తగ్గింది, ఇది కస్టమర్లకు అదనపు ప్రయోజనం ఇస్తుంది.