Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్, ప్రేమను వెనకేసుకురావడంతో రాత్రి వేదవతి దద్దరిల్లేలా ఈల వేస్తుంది. అత్తయ్య మామయ్య చూస్తారు అంటే ధీరజ్ మాట్లాడినప్పుడే ఈ ఈల వేయాలి అనిపించింది కానీ మీ మామయ్య ఉన్నారని వేయలేదని నర్మదని పట్టుకొని డ్యాన్స్‌లు వేస్తుంది. చాలా చాలా సంతోషపడుతుంది వేదవతి. ప్రేమ మీద ప్రేమని ధీరజ్ ఎంత బాగా చెప్పాడే అని మురిసిపోతుంది. 

Continues below advertisement

ధీరజ్ చెప్పిన డైలాగ్స్ అన్నీ మళ్లీ చెప్తుంది. నర్మద అత్త సంతోషానికి మురిసిపోతుంది. ఇద్దరూ చాలా చాలా సంతోషపడతారు. తప్పని సరి పరిస్థితుల్లో ధీరజ్‌తో నా మేనకోడలి మెడలో తాళి కట్టించాను.. వాళ్లు చక్కగా ఉంటారో లేదో అనుకున్నా కానీ నా భయం ఈ రోజుతో పోయింది.. వాళ్ల మీద ఒకరి మీద ఒకరికి పుట్టిన ప్రేమ ఇద్దరినీ నూరేళ్లు కలిసి బతికేలా చేస్తుంది అంతే.. ప్రేమ, ధీరజ్‌ల పెళ్లి మనమే చేశాం అని మీ మామయ్యకి తెలిసిపోతుందని చాలా భయపడ్డా కానీ ధీరజ్‌కి మీ మామయ్యకి ఏ అనుమానం రాకుండా మాట్లాడాడు. ఒకరు అంటే ఒకరికి ముందు పడదు.. కానీ ఇప్పుడు వాళ్ల మనసులో ప్రేమ మొదలైందని వేదవతి చాలా చాలా సంతోషపడుతుంది. ప్రేమ, ధీరజ్ ఒకరి కోసం ఒకరు బతుకుతారు.. ఒకటై బతుకుతారు అని చాలా హ్యాపీగా అరుస్తుంది.

ప్రేమ, ధీరజ్‌లు చెరోవైపు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ ధీరజ్ తన గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇద్దరి కోసం భోజనం తీసుకొస్తుంది. ధీరజ్ దగ్గర కూర్చొని తినమని చెప్తుంది. ధీరజ్ వద్దని అంటాడు. ప్రేమ చాలా సరదాగా మాట్లాడుతుంది. ధీరజ్ అలా చూస్తే ఏంటి షాక్ అవుతున్నావా ఇంతకు ముందు వరకు పట్టరాని దుఃఖంతో ఉండి ఇప్పుడు ఇలా ఉన్నానని అనుకుంటున్నావా.. పెద్ద సమస్య నుంచి గట్టెక్కినప్పుడు.. అండగా ఓ చేయి ఉన్నప్పుడు.. మన చేతిని ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఒక చేయి ఉంది అన్న భరోసా మనకు ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అని తన హ్యాపీనెస్ చెప్తుంది. 

Continues below advertisement

ధీరజ్‌కి తినమని చెప్తుంది. అయినా ధీరజ్ తినను అనడంతో నువ్వు తినే వరకు నేను తినను అని ప్లేట్ పక్కన పెట్టేస్తుంది. ధీరజ్ తినడానికి రావడంతో ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ప్రేమ ధీరజ్‌తో నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. ఎందుకు అలా అడిగావ్ అని ధీరజ్ అంటే నువ్వు ఇందాక నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పావ్.. ముందు కల్యాణ్‌ గాడి సమస్య నుంచి నన్ను గట్టెక్కించడానికి మామయ్యతో అలా చెప్తున్నావ్ అనుకున్నా.. కానీ మనం చెప్పేది నిజమో అబద్ధమో మన కళ్లు చెప్తాయి అంటారు. ఆ క్షణం నీ కళ్లలో అబద్ధం కనిపించలేదు మన మనసులో ఏం ఉంటే అదే బయటకు వస్తుంది. ఒకవేళ అబద్ధం చెప్తే మాట తడబడుతుంది కానీ నాకు నీ మాటలో తడబాటు ఎక్కడా కనిపించలేదు.. గొడవల్లో ప్రేమ పుడుతుందని నువ్వు చెప్పావ్.. అది నిజం కాకపోతే నీ నోటి నుంచి ఆ మాట రాదు అని నేను అనుకుంటున్నా ఏం అంటావ్.. నా ప్రశ్నకి సమాధానం చెప్పు ధీరజ్.. నీ మనసులో నిజంగా నా మీద ప్రేమ ఉందా.. అని ప్రేమ అడుగుతుంది.

ధీరజ్ ప్రేమని చూస్తూ ఏం మాట్లాడడు.. తెలీకుండా ధీరజ్ చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. ఏం చెప్పకుండా ఉండటంతో ప్రేమ మనసులో నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే లేదు అని గట్టిగా చెప్పేవాడివి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్ అనడానికి నీ మౌనమే సమాధానం.. నీ దృష్టిలో నేను ఒక వస్తువు అన్నావ్‌రా కానీ నీ జీవితమే నేను రా అని ప్రేమ అనుకుంటుంది. తర్వాత ప్రేమ ధీరజ్-ప్రేమల పేర్లు  కలిపి ధీమ అని రాసుకుంటుంది. అది చూసి మురిసిపోతుంది. ధీరజ్ చూసి ఏంటి అని సైగ చేస్తాడు. ధీమ ఏంటి అని ధీరజ్ అనుకుంటాడు.

భద్రావతి ఇంట్లో అందరూ తెగ ఆలోచించేస్తారు. నా కూతురి మీద అంత పెద్ద నింద వేస్తారా.. ఎలా పెంచుకున్నాను నా కూతుర్ని.. వ్యక్తిత్వంలో ఆకాశం అంత ఎత్తులో పెంచుకున్నా అలాంటి నా కూతురి మీద బురద జల్లుతారా అని సేన రగిలిపోతాడు. ఆ రామరాజు ఎంత వాడి బతుకు ఎంత.. మనం తిండి వేస్తే తిని బతికిన వాడు మన ఇంటి బిడ్డ మీద నింద వేస్తాడా.. బదులు తీర్చుకుంటానని సేన అంటాడు. నేను ఇప్పటికి అదే పనిలో ఉన్నానని విశ్వ అంటాడు. ఆ రామరాజు చేసిన మోసానికి బదులు తీర్చుకుంటా తిరిగి నా చెల్లిని ఇంటికి తీసుకొచ్చే వరకు వదలను అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.