Tata Punch EV Price, Range And Features In Telugu: భారతదేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్‌కు అనుగుణంగా కార్ల తయారీ కంపెనీలు అనేక కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నాయి. EV విభాగంలో టాటా మోటార్స్ కూడా ముందు వరుసలో ఉంది. మీరు, టాటా బ్రాండ్‌లో ఒక బెస్ట్‌ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటే, టాటా పంచ్‌ EV గురించి తెలుసుకోవాలి. ఈ కారును ఫైనాన్స్‌లో కూడా తీసుకోవచ్చు. కొద్దిపాటి మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌ చేస్తే చాలు, టాటా పంచ్‌ EVకి మీరు ఓనర్‌ కావచ్చు.

టాటా పంచ్ EV, కాంపాక్ట్‌ SUV డిజైన్‌తో స్టైలిష్‌ లుక్‌ అందిస్తుంది. స్మూత్‌ LED DRLs, సిగ్నేచర్‌ గ్రిల్‌ డిజైన్‌ & మస్క్యులర్‌ బాడీ లైన్స్‌ దాని రోడ్‌ ప్రెజెన్స్‌ను పెంచుతాయి. డ్యూయల్‌-టోన్ కలర్‌ ఆప్షన్స్‌ & ఆకర్షణీయమైన అలాయ్ వీల్స్‌ టాటా పంచ్‌ EVని మరింత ప్రీమియం అపీల్‌లో చూపిస్తాయి. ఎత్తైన గ్రౌండ్‌ క్లియరెన్స్‌ & స్పోర్టీ స్టాన్స్‌ వంటివి ఈ కారును సిటీ రోడ్స్‌ & ఆఫ్‌-రోడ్‌ ట్రిప్స్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్‌ చేస్తాయి.

హైదరాబాద్‌/విజయవాడలో టాటా పంచ్ EV ఆన్-రోడ్ ధర ఎంత? తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్ EV ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 9.99 లక్షలు. దీనికి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఇన్సూరెన్స్‌, ఇతర ఖర్చులు కలిపితే, హైదరాబాద్‌/విజయవాడలో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 11.50 లక్షలు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాలు & డీలర్‌షిప్‌లను బట్టి ఆన్-రోడ్ ధర కొద్దిగా మారవచ్చు. 

టాటా పంచ్‌ EV ఫైనాన్స్‌ ప్లాన్‌మీరు, టాటా పంచ్‌ EVని రూ. 5 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేస్తే, మిగిలిన రూ. 6.50 లక్షలను బ్యాంకు నుంచి కారు లోన్‌గా తీసుకోవాలి. మీరు ఈ మొత్తాన్ని 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో పొందారని అనుకుందాం. ఇప్పుడు EMI ఆప్షన్స్‌ ఇలా ఉంటాయి:

7 సంవత్సరాల రుణ వ్యవధి పెట్టుకుంటే, మీరు నెలకు రూ. 10,458 EMI చెల్లించాలి. ఏడేళ్లు పూర్తయ్యేసరికి బ్యాంకుకు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 2,28,464 అవుతుంది.

6 సంవత్సరాల రుణ వ్యవధి పెట్టుకుంటే, మీరు నెలకు రూ. 11,717 EMI చెల్లించాలి. ఆరేళ్లు పూర్తయ్యేసరికి బ్యాంకుకు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 1,93,595 అవుతుంది.

5 సంవత్సరాల రుణ వ్యవధి పెట్టుకుంటే, మీరు నెలకు రూ. 13,493  EMI చెల్లించాలి. ఐదేళ్లు పూర్తయ్యేసరికి బ్యాంకుకు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 1,59,576 అవుతుంది.

4 సంవత్సరాల రుణ వ్యవధి పెట్టుకుంటే, మీరు నెలకు రూ. 16,175 EMI చెల్లించాలి. నాలుగేళ్లు పూర్తయ్యేసరికి బ్యాంకుకు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 1,26,413 అవుతుంది.

లోన్‌ టెన్యూర్‌ తగ్గే కొద్దీ మంత్లీ EMI పెరిగినప్పటికీ, బ్యాంక్‌కు కట్టాల్సిన మొత్తం వడ్డీ తగ్గుతుంది. 

కారుపై రుణం పొందడం, వార్షిక వడ్డీ రేటు వంటివి మీ వ్యక్తిగత క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయి. 

టాటా పంచ్ EV స్పెసిఫికేషన్లు & ఇంజిన్టాటా మోటార్స్, పంచ్ ఎలక్ట్రిక్‌ కోసం 25 kWh సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఇచ్చింది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను AC ఛార్జర్‌తో 3.6 గంటల్లో 10 నుంచి 100 శాతం వరకు & DC ఫాస్ట్ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. 

పూర్తిగా ఛార్జ్ చేస్తే, పంచ్ EV 315 కి.మీ. డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదని టాటా మోటార్స్ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్‌ కారు గరిష్టంగా గంటకు 140 కి.మీ వేగంతో నడుస్తుంది. కంపెనీ డేటా ప్రకారం, పంచ్ EV 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని సాధించడానికి 9.5 సెకన్లు పడుతుంది.