Internet Reaction over SC stray dog order: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వీధి కుక్కలను శాశ్వత ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ తీర్పునకు సపోర్టుతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి.
ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గాజియాబాద్ వంటి నేషనల్ కేపిటల్ రీజియన్ ప్రాంతాల్లో వీధి కుక్కల బెడ ఎక్కువగా ఉంది. వీటిపై పిటిషన్లు దాఖలు కావడంతో వాటిని శాశ్వత ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వం , స్థానిక సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కుక్కలను తిరిగి వీధుల్లోకి విడుదల చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.
రాబోయే 6-8 వారాల్లో కనీసం 5,000 కుక్కల కోసం ఆశ్రయ కేంద్రాలను స్థాపించాలి. ఈ కేంద్రాలు స్టెరిలైజేషన్ మరియు టీకా కోసం తగిన సిబ్బందిని కలిగి ఉండాలని సుప్రీంకోర్టు స్పషఅటం చేశారు. కుక్కలను విడుదల చేయకుండా నిరోధించడానికి ఆశ్రయ కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని.. కుక్క కాటు సంఘటనలను నివేదించడానికి ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి, నివేదిక వచ్చిన నాలుగు గంటల్లో చర్య తీసుకోవాలని ఆదేశించింది. ఈ ప్రక్రియకు అడ్డుపడే వ్యక్తులు లేదా సంస్థలపై కోర్టు చర్యలు తీసుకుంటుంది. అధికారులు ఆరు వారాల తర్వాత కోర్టుకు ప్రగతి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
సుప్రీం కోర్టు ఆదేశం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చను రేకెత్తించింది, ఇందులో ప్రజల భద్రత , జంతు సంక్షేమంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని RWAs ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి, ప్రజల భద్రత, ముఖ్యంగా పిల్లల భద్రతను ప్రాధాన్యంగా పేర్కొన్నాయి.
కాంగ్రెస్ నేత చిదంబరం కూడా మద్దతు పలికారు. ఈ తీర్పును అన్ని ప్రధాన నగరాల్లో అమలు చేయాల్సి ఉందన్నారు.
అయితే జంతు హక్కుల కార్యకర్తలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. PETA ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ (FIAPO), తర జంతు సంక్షేమ సంస్థలు ఈ ఆదేశాన్ని " అమానవీయం, చట్టవిరుద్ధం" అని విమర్శించాయి. ఢిల్లీలో సుమారు 10 లక్షల సంచార కుక్కలు ఉన్నాయని ఆయా సంస్థలు చెబుతున్నాయి.
వీధికుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సోషల్ మీడియాలో ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.