Tata Punch EV | ప్రస్తుతం భారతదేశంలో అత్యంత తక్కువ దరలో అందుబాటులో ఉన్న 5 సీట్ల ఎలక్ట్రిక్ SUVగా టాటా పంచ్ EV నిలిచింది.  పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల మధ్య, పంచ్ EV మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఛాయిస్‌గా టాటా పంచ్ ఈవీ విక్రయాలు జరుపుకుంటోంది. SUV లాంటి రూపం, టాటా కంపెనీ నమ్మకమైన సేఫ్టీ ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చులు దీనిని ఇతర కార్ల నుంచి ప్రత్యేకంగా చేస్తాయి. పంచ్ ఈవీ నగరాలతో పాటు కఠినమైన రోడ్లపై సౌకర్యవంతమైన డ్రైవ్‌ను అందిస్తుంది. దాని ఫీచర్లు, సౌకర్లు, మైలేజీ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. 

Continues below advertisement

టాటా పంచ్ EV ధర, ఆఫర్లుటాటా పంచ్ EV ఎక్స్-షోరూమ్ ధర బేస్ వేరియంట్, స్మార్ట్ MR కోసం ₹9.99 లక్షల నుండి ప్రారంభమై, టాప్ వేరియంట్  అయితే 14.99 లక్షల రూపాయల వరకు ఉంటుంది. టాటా కంపెనీ ప్రస్తుతం 100 శాతం ఆన్-రోడ్ ఫైనాన్సింగ్, ₹1.20 లక్షల వరకు ప్రయోజనాలతో సహా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. మీరు పంచ్ EVని కేవలం ₹8,099 EMIతో కొనుగోలు చేయవచ్చు. ఇది ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుంది.

బ్యాటరీ, రేంజ్, ఛార్జింగ్ వివరాలుటాటా పంచ్ EV రెండు బ్యాటరీ ఎంపికలలో మార్కెట్లోకి వస్తుంది. మొదటిది 25 kWh బ్యాటరీ ప్యాక్, ఈ వేరియంట్ 315 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. రెండవది 35 kWh లాంగ్-రేంజ్ బ్యాటరీ ప్యాక్ ఇది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 421 కిలోమీటర్ల వరకు జర్నీ చేయవచ్చు. DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు 56 నిమిషాల నుంచి గంట పడుతుంది. విభిన్న డ్రైవ్ మోడ్‌లు మీ డ్రైవింగ్‌ను మరింత ఈజీగా మారుస్తాయి. 

Continues below advertisement

దీనిని ప్రత్యేకంగా చేసే ఫీచర్లుటాటా పంచ్ EVలో పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ డిస్‌ప్లే, 360 డిగ్రీల కెమెరాతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. దీని అధిక గ్రౌండ్ క్లియరెన్స్ భారత రోడ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

భద్రతలో కూడా నంబర్ వన్టాటా పంచ్ EV భద్రత పరంగా మంచి స్థానంలో ఉంది. పంచ్ ఈవీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, హిల్ హోల్డ్ కంట్రోల్, స్ట్రాంగ్ బాడీతో వస్తుంది. భారత్ NCAP నుండి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన ఈవీ. మీరు రూ. 10 లక్షల లోపు సురక్షితమైన, స్టైలిష్, లాంగ్ రేంజ్ ఇచ్చే 5 సీట్ల ఎలక్ట్రిక్ SUVని కోరుకుంటే, టాటా పంచ్ EV మీకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు.