Tata Punch Price, Down Payment, Loan and EMI Details: భారతీయ మార్కెట్లో, ఆర్థికంగా అందుబాటులో ఉండడంతో పాటు మంచి మైలేజీని ఇచ్చే SUVల్లో టాటా పంచ్ ఒకటి. ఇది బడ్జెట్-ఫ్రెండ్లీ కారు. ఈ కారు ధర రూ. 7 లక్షల పరిధిలో ఉంది. టాటా పంచ్ కొనడానికి మీరు పూర్తి చెల్లింపు చేయవలసిన అవసరం లేదు. అయితే, రూ. 10 వేల డౌన్ పేమెంట్‌తో టాటా పంచ్ కొనలేరు, మీ దగ్గర కనీసం లక్ష రూపాయలు ఉండాలి.
తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్ రేటు ఎంత? టాటా పంచ్ బేస్ మోడల్ 'ప్యూర్ పెట్రోల్' వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Tata Punch ex-showroom price) రూ. 6.20 లక్షలు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం దాదాపు రూ. 89,000, ఇన్సూరెన్స్ కోసం దాదాపు రూ. 34,000, ఇతర ఖర్చులు కలుపుకుని... తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్ ఆన్-రోడ్ రేటు (Tata Punch on-road price) రూ. 7.43 లక్షలు అవుతుంది.
టాటా పంచ్ EMI ఆప్షన్స్‌మీరు, ఈ కారు కొనడానికి లక్ష రూపాయలను డౌన్ పేమెంట్ చేస్తే, బ్యాంక్ నుంచి రూ. 6.43 లక్షల రుణం లభిస్తుంది. ఈ లోన్ మీద బ్యాంక్ 9 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తుందని అనుకుందాం. ఇప్పుడు EMI ఆప్షన్స్ చూద్దాం.
7 సంవత్సరాల్లో కార్ లోన్ మొత్తం క్లియర్ చేయాలనుకుంటే, మీరు నెలకు రూ. 10,345 EMI చెల్లించాలి. ఈ ఆప్షన్‌లో, మొత్తం వడ్డీ రూ. 2,26,003 & కారు మొత్తం ధర రూ. 8,69,003 అవుతుంది.
6 సంవత్సరాల్లో లోన్ టెన్యూర్ ఎంచుకుంటే, మీరు నెలకు రూ. 11,590 EMI చెల్లించాలి. ఈ ఆప్షన్‌లో, మొత్తం వడ్డీ రూ. 1,91,510 & కారు మొత్తం ధర రూ. 8,34,510 అవుతుంది.
5 సంవత్సరాల్లో రుణం తీర్చేయగల స్థోమత ఉంటే, మీరు నెలకు రూ. 13,348 EMI చెల్లించాలి. ఈ ఆప్షన్‌లో, మొత్తం వడ్డీ రూ. 1,57,857 & కారు మొత్తం ధర రూ. 8,00,857 అవుతుంది.
4 సంవత్సరాల్లో రుణ కాలపరిమితిని ఎంచుకుంటే, మీరు నెలకు రూ. 16,001 EMI చెల్లించాలి. ఈ ఆప్షన్‌లో, మొత్తం వడ్డీ రూ. 1,25,052 & కారు మొత్తం ధర రూ. 7,68,052 అవుతుంది.
కారు రుణ మొత్తం, వడ్డీ రేటు అంశాలు మీ క్రెడిట్ స్కోరు ఎంత బాగుందన్న విషయంపై ఆధారపడి ఉంటాయి.
పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్SUV సెగ్మెంట్‌లో, టాటా బ్రాండ్ నుంచి వచ్చిన చవకైన కారు టాటా పంచ్. రేటు తక్కువైనప్పటికీ స్టైల్, రక్షణలో ఎలాంటి రాజీ పడని కారు ఇది. ఇందులో 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 6000 rpm వద్ద 88.48 bhp పవర్, 113 Nm టార్క్‌ను జెనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ & AMT ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తుంది. సిటీ డ్రైవింగ్‌లో సౌకర్యవంతంగా ఉంటుంది, హైవే ఎక్కితే విశ్వరూపం చూపుతుంది. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌తో కూడిన ఈ కారు, చిన్న SUV లవర్స్‌కి మంచి ఎంపిక.
ఆకట్టుకునే సేఫ్టీ, టెక్నాలజీ ఫీచర్లుటాటా పంచ్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS విత్ EBD, రియర్ పార్కింగ్ సెన్సర్లు వంటి భద్రత ఫీచర్లు అందించారు. ఇంకా.. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లే సపోర్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి. 5 స్టార్ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్ అందుకున్న కారు ఇది. కాబట్టి, యువతతోపాటు, ఫ్యామిలీ పరంగానూ నమ్మకమైన కారుగా మారింది. స్టైల్, సేఫ్టీ, పనితీరు కలగలిపిన ఈ మినీ SUV, ప్రస్తుత మార్కెట్లో వేగంగా అమ్ముడవుతోంది.