టాటా పంచ్ కామో ఎడిషన్‌ను కంపెనీ టీజ్ చేసింది. హారియర్ కామో ఎడిషన్ తరహాలోనే టాటా పంచ్ కామో ఎడిషన్ కూడా మిలటరీ గ్రీన్ ఎక్స్‌టీరియర్ కలర్‌లో వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు కొత్త అప్‌హోల్స్టీ, కొన్ని అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. కజిరంగ ఎడిషన్ తర్వాత టాటా పంచ్‌లో రానున్న కొత్త స్పెషల్ ఎడిషన్ ఇదే.


ఈ కొత్త టాటా పంచ్‌లో కూడా 1.2 లీటర్ త్రీ-సిలిండర్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది 6000 ఆర్‌పీఎం వద్ద 84.48 హెచ్‌పీని, 3300 ఆర్‌పీఎం వద్ద 113 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కొత్త వేరియంట్ మార్కెట్లోకి రానుంది.


టాటా పంచ్ లాంచ్ అయిన 10 నెలల్లోనే లక్ష యూనిట్లు అమ్ముడు పోయింది. కేవలం 10 నెలల్లోనే ఈ ఫీట్ సాధించిన మొదటి ఎస్‌యూవీ ఇదే. 2021 అక్టోబర్‌లో ఈ కారు లాంచ్ అయినప్పటి నుంచి వినియోగదారుల నుంచి దీనికి మంచి రెస్పాన్స్ ఉంది. 


ఈ సూపర్ హిట్ ఎస్‌యూవీలో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్, ఐఆర్ఏ కనెక్టివిటీ సూట్, ఏడు అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉన్నాయి. ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్, పుష్ బటన్ స్టాప్/స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, టూ డ్రైవింగ్ మోడ్లు కూడా అందించారు.


టాటా అల్ట్రోజ్ ప్లాట్‌ఫాంపైనే ఈ పంచ్‌ను కూడా రూపొందించారు. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ సేఫ్టీని ఇది సాధించడం విశేషం. అయితే ఇది టాటా ఆల్ట్రోజ్ కంటే ఎన్నో విషయాల్లో మెరుగ్గా ఉంది. పంచ్ స్టాండర్డ్ వెర్షన్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, యాబ్స్, ఐసోఫిక్స్ యాంకరేజెస్ అందించారు. హయ్యర్ వేరియంట్లలో కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, బ్రేక్ అవే కంట్రోల్ అందుబాటులో ఉన్నాయి.


టాటా పంచ్ ధర (అన్ని వేరియంట్లు)
ప్రారంభ వేరియంట్ అయిన టాటా పంచ్ ప్యూర్ ధర రూ.5.65 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది. టాటా పంచ్ ప్యూర్ రిథమ్ ధర రూ.5.84 లక్షలుగా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు. ఇక టాటా పంచ్ అడ్వెంచర్‌లో మాన్యువల్ వేరియంట్ ధర రూ.6.39 లక్షలుగానూ (ఎక్స్-షోరూం), ఏఎంటీ వేరియంట్ ధర రూ.6.99 లక్షలుగానూ (ఎక్స్-షోరూం) ఉంది. టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్‌లో మ్యాన్యూవల్ వేరియంట్ ధర రూ.6.74 లక్షలుగానూ (ఎక్స్-షోరూం), ఏఎంటీ వేరియంట్ ధర రూ.7.34 లక్షలుగానూ (ఎక్స్-షోరూం) నిర్ణయించారు.


ఇక టాటా పంచ్ అకాంప్లిష్డ్‌లో మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ.7.29 లక్షలు (ఎక్స్-షోరూం) కాగా, ఏఎంటీ వేరియంట్ ధర రూ.7.89 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది. టాటా పంచ్ అకాంప్లిష్డ్ డాజిల్‌లో మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ.7.74 లక్షలుగానూ (ఎక్స్-షోరూం), ఏఎంటీ వేరియంట్ ధర రూ.8.4 లక్షలుగానూ (ఎక్స్-షోరూం) నిర్ణయించారు. టాటా పంచ్ క్రియేటివ్ మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ.8.49 లక్షలు (ఎక్స్-షోరూం) కాగా, ఏఎంటీ వేరియంట్ ధర రూ.9.09 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ టాటా పంచ్ క్రియేటివ్ ఐఆర్ఏ మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ.8.7 లక్షలు (ఎక్స్-షోరూం) కాగా, ఏఎంటీ వేరియంట్ ధర రూ.9.39 లక్షలుగా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?