Tata Nexon vs Skoda Kylaq Price and Features | భారతదేశ మార్కెట్లో కాంపాక్ట్ SUV విభాగం వేగంగా పెరుగుతోంది. దాదాపు ప్రతి సంస్థ ఈ విభాగంలో తమ ఉత్పత్తులను తీసుకువచ్చింది. ఈ ఆటోమొబైల్ మార్కెట్ పోటీలో టాటా నెక్సాన్ (Tata Nexon), Skoda Kylaq రెండు పెద్ద పేరున్న బ్రాండ్స్. రెండు SUV లు కూడా వినియోగదారుల కోసం శక్తివంతమైన ఇంజిన్, అధునాతన ఫీచర్లు, అందుబాటులో ఉన్న బడ్జెట్ ధరలతో వస్తాయి. రెండింటిలో మీకు ఏది మంచిది అనే ప్రశ్నకు కార్ల ఇంజిన్, ఫీచర్లు, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

Continues below advertisement

Tata Nexon vs Skoda Kylaq ఇంజిన్

టాటా నెక్సాన్ (Tata Nexon) పెట్రోల్, డీజిల్, CNG ఇంజిన్ వేరియంట్లతో అందుబాటులో ఉంది. దీని 1.2 లీటర్ CNG ఇంజిన్ 73.5 PS శక్తిని, 170 న్యూటన్ మీటర్ల టార్క్ జనరేట్ చేస్తుంది. దీని పెట్రోల్ ఇంజిన్ 88.2 PS శక్తిని, 170 న్యూటన్ మీటర్ల టార్క్ ఇస్తుంది.

Continues below advertisement

డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే.. 1.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంజిన్ 84.5 PS శక్తిని, 260 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ట్రాన్స్మిషన్ ఎంపికలు ఉన్నాయి. మరోవైపు Skoda Kylaq లో 1.0 లీటర్ TSI ఇంజిన్ ఉంది. ఇంజిన్ 85 కిలోవాట్ల ఎనర్జీని, 178 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో 6 స్పీడ్ మాన్యువల్, DCT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక కూడా ఉంది.

Tata Nexon vs Skoda Kylaq కార్ల ఫీచర్లు

ఫీచర్ల విషయానికి వస్తే టాటా నెక్సాన్ (Tata Nexon) లో షార్క్ ఫిన్ యాంటెన్నా, బై-ఫంక్షన్ పూర్తి LED హెడ్లైట్లు, LED DRLs, రూఫ్ రెయిల్స్, పనోరమిక్ సన్రూఫ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫయర్, 360 డిగ్రీస్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అదే Skoda Kylaq కూడా ఇందులో వెనుకబడి లేదు. ఇందులో మెరిసే నలుపు రంగు ముందు గ్రిల్, LED హెడ్లైట్లు, టెయిల్లైట్లు, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఎలక్ట్రికల్గా అడ్జస్టబుల్ సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో పెద్ద డిజిటల్ క్లస్టర్, 25.6 సెంటీమీటర్ల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్, ప్రాక్టికల్ ఫీచర్లు అంటే ట్రంక్ లోకిలోల హుక్ కూడా ఉన్నాయి.

కార్ల ధర

ధర విషయానికి వస్తే Tata Nexon ఎక్కువగా కస్టమర్లకు అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర 7.32 లక్షలకు ప్రారంభమై 14.05 లక్షల వరకు ఉంది. అదే సమయంలో Skoda Kylaq ధర 7.54 లక్షల రూపాయలకు ప్రారంభమవుతుంది. దీని అత్యధిక వేరియంట్ ధర రూ.12.79 లక్షల వరకు వెళుతుంది.

SUV మంచిది?

మీ బడ్జెట్ తక్కువగా ఉండి, మీరు అందుబాటులో ఉన్న మల్టీ, హైబ్రిడ్ ఇంజిన్ ఎంపిక కలిగిన SUV కోరుకుంటే Tata Nexon మీకు మంచిది. కానీ మీరు ఎక్కువ ప్రీమియం డిజైన్, అంతర్జాతీయ అనుభూతి, మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తే, Skoda Kylaq ఒక బెస్ట్ ఛాయిస్. రెండు SUVs కూడా తమ విభాగంలో మంచి ప్యాకేజీలను అందిస్తాయి.