Red sandalwood in Andhra Pradesh | యర్రగొండపాలెం: ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఐదు జిల్లాల ఎస్పీలతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా, మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను పరిశీలించిన ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఎర్రచందనం పరిశీలన సమయంలో పవన్ కళ్యాణ్ దిగిన ఫొటోలు పోస్ట్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ పై సైతం వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఓ మంత్రి పనిచేస్తున్నట్లుగా లేదని, ఏదో సినిమా షూటింగ్ కోసం వెళ్లి పవన్ కళ్యాణ్ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ఎర్రచందనం వద్ద పవన్ కళ్యాణ్ బాగానే ఫొటోషూట్ చేశారు, వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. కానీ అధికారంలోకి వచ్చి 18 నెలల్లో ఎర్రచందనంపై బాధ్యత గల మంత్రిగా పవన్ కళ్యాణ్ ఏం చర్యలు చేపట్టారని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఫోటోషూట్ #PawanKalyan ఎర్రచందనంపై వీటికి బదులు చెప్పాలంటూ కొన్ని ప్రశ్నలు అడిగారు.
1. 18 నెలల కాలంలో అటవీ చట్టాలు, ఎర్రచందనం సంరక్షణ నిబంధనలను సవరించడం లాంటివి ఏమైనా చేసారా? 2. ప్రత్యేక కోర్టులు (Special Courts) ఏర్పాటు చేసారా? వేగంగా విచారణ జరగేలా చూడటానికి మీరు తీసుకున్న చర్యలెంటీ?3. మాదకద్రవ్యాల అక్రమ రవాణా స్థాయిలో ఎర్రచందనం రవాణాపై శిక్షలు, జరిమానాలు పెంచడమనే కఠిన నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా?4. శేషాచలం, నల్లమల వంటి అటవీ ప్రాంతాలను ఉపగ్రహాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కోసం ఇస్రో సంస్థతో ఏమైనా సంప్రదింపుల జరిపారా?5. ఉపగ్రహాల సంగతి పక్కనపెడదాం కనీసం అత్యాధునిక డ్రోన్స్ కొనుగోలు చేసారా?6. ప్రతి ఎర్రచందనం చెట్టుకు GPS ట్యాగింగ్ చేయడం – అక్రమంగా కట్ చేసిన చెట్లు తక్షణం గుర్తించబడేలా చేయాలనే స్పృహ ఉందా?7. రాత్రి పర్యవేక్షణ కెమెరాలు (night vision cameras) కనీసం ఒకటైన ఏర్పాటు చేసారా?8. QR కోడ్‌లు / బయోమెట్రిక్ ట్యాగ్‌లు ఉపయోగించి ప్రతి దుంగను గుర్తించలనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా?9. డిజిటల్ ట్రాన్సిట్ పర్మిట్లు (e-permits) ప్రవేశపెట్టలనే ఆలోచన మీకెందుకే రాలేదు?10. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలతో సంయుక్త ఆపరేషన్లు లేదా సమీక్షలు ఎన్ని నిర్వహించారు? 11. DRI, కస్టమ్స్, DGFT వంటి కేంద్ర సంస్థలతో సమన్వయం కోసం మీరు తీసుకున్న చర్యలెంటీ?12. CITES, INTERPOL ద్వారా చైనా, జపాన్, మయన్మార్ వంటి దేశాలకు అక్రమ ఎగుమతి అవుతున్న ఎర్రచందనంపై మీరు రాసిన లేఖలు ఏమైనా ఉన్నాయా?13. అంతర్జాతీయ సంస్థలు గురించి పక్కన పెడదాం స్థానిక అటవీ గ్రామాల ప్రజల భాగస్వామ్యం (Community Forest Management) కోసం చర్యలు ఏమైనా తీసుకున్నారా?14. స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి (Benami & PMLA చట్టాల ప్రకారం) ఏమైనా ప్రయత్నాలు చేసారా?
రాష్ట్ర ప్రభుత్వమే ఎర్రచందనం అమ్మి రూ.335.76 కోట్లు ఆదాయం తెచ్చుకుంటుందని బడ్జెట్ 2025-26 లో పొందుపరిచారు, అయితే పట్టుబడిన రెండున్నర లక్షల ఎర్రచందనం దుంగల్లో ఒక్కటి కూడా అమ్మలేదన్నారు. మరో 4 నెలల్లో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఆ ఎర్రచందనం దుంగలు ఎప్పుడు అమ్ముతారు? ఎప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెడతారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రశ్నించారు.