Tata Nexon Discount Offer August 2025: టాటా మోటార్స్, తన బెస్ట్ సెల్లింగ్ SUV టాటా నెక్సాన్ మీద రూ. 50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్ & ఎక్స్ఛేంజ్ బోనస్ రెండూ ఉన్నాయి. టాటా నెక్సాన్ పై ఈ తగ్గింపు (Tata Nexon Price Drop) మీ నగరం & డీలర్‌షిప్‌ను బట్టి స్వల్పంగా మారవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎక్కువగా ఇష్టపడుతున్న కారు ఇది.
టాటా నెక్సాన్ లుక్స్ చాలా అగ్రెసివ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తాయి. కొత్తగా ఇచ్చిన షార్ప్ హెడ్‌ల్యాంప్స్ & సిగ్నేచర్ LED DRLs కారుకు మోడ్రన్ లుక్ ఇస్తాయి. వంపులు తిరిగిన కండల్లాంటి బంపర్లు, డ్యూయల్‌టోన్ బాడీ ఫినిషింగ్ ఈ SUVని ప్రీమియం ఫీల్‌లోకి తీసుకెళ్తాయి. కారు వెనుక భాగంలో క్రిస్టల్-ఇన్‌స్పైర్డ్ టెయిల్‌ల్యాంప్స్ కారు డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో ధర
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో టాటా నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8 లక్షల (Tata Nexon ex-showroom price, Hyderabad Vijayawada) నుంచి ప్రారంభమవుతుంది & టాప్ మోడల్‌కు ఇది రూ. 15.60 లక్షల వరకు ఉంటుంది. ఆన్-రోడ్ రేటు విషయానికి వస్తే... హైదరాబాద్‌లో (Tata Nexon on-road price, Hyderabad) బేస్ వేరియంట్‌ను దాదాపు రూ. 9.55 లక్షలకు; విజయవాడలో (Tata Nexon on-road price, Vijayawada) దాదాపు రూ. 9.57 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.
టాటా నెక్సాన్ పవర్ & ఫీచర్లు
పవర్ & పెర్ఫార్మెన్స్‌లో టాటా నెక్సాన్‌కు మంచి పేరుంది. ఇది 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ ఇంజిన్ ది 120 bhp శక్తిని & 170Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ ఇంజిన్ ఉంది, ఇది 110 bhp శక్తిని & 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇంటీరియర్ & ప్రీమియం ఫీచర్లు
టాటా నెక్సాన్ లోపలి భాగాన్ని చాలా ప్రీమియంగా & మోడ్రన్ లుక్‌లో తయారు చేశారు. క్యాబిన్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి. ఇంకా.. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎత్తు సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్, క్రూయిజ్ కంట్రోల్ & JBL సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
భద్రతా లక్షణాలు ఎలా ఉన్నాయి?
టాటా నెక్సాన్, తన కస్టమర్ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. 6 ఎయిర్ బ్యాగ్‌లు, ABS, హిల్-అసిస్ట్ & 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్ల నడుమ ఈ కారు ప్రయాణిస్తుంది. ఈ కారు గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా పొందింది.
ఈ ఆఫర్ ఎందుకు ప్రత్యేకమైనది?
శక్తిమంతమైన, సురక్షితమైన & ఆధునిక ఫీచర్లు ఉన్న SUVని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, టాటా నెక్సాన్ ఆగస్టు 2025 ఆఫర్ మీకు గొప్ప అవకాశం కావచ్చు. టాటా నెక్సాన్ ఇప్పటికే దేశంలో నంబర్-1 సేఫ్టీ SUVగా పేరు గడించింది. ఇప్పుడు రూ. 50,000 వరకు తగ్గింపు దీనిని మరింత విలువైన కారుగా మార్చింది.