2025 Tata Curvv Price Hike: టాటా మోటార్స్, ఇటీవల విడుదల చేసిన కూపే స్టైల్ SUV ధరలను సవరించింది. వేరియంట్ ఆధారంగా ధరలో మార్పులు వచ్చాయి & కొన్ని వేరియంట్‌ల రేట్లు రూ. 13,000 వరకు పెరిగాయి. అలాగే, ఈ కంపెనీ టియాగో, టియాగో NRG & టిగోర్ ధరలను కూడా మార్చింది.

టాటా కర్వ్ కొత్త ధరలు

టాటా కర్వ్ బేస్ వేరియంట్ ఇప్పటికీ రూ. 10 లక్షల ప్రారంభ ధరకే అందుబాటులో ఉంది. కొన్ని వేరియంట్‌ల రేట్లు మాత్రం కొద్దిగా మారాయి. మిగిలిన వేరియంట్ల ధర మారలేదు & మునుపటి ధరకే వాటిని అమ్ముతున్నారు.

ఈ వేరియంట్ల రేటు మారలేదు

1. Accomplished S GDI టర్బో-పెట్రోల్ MT డార్క్ ఎడిషన్

2. Accomplished S GDI టర్బో-పెట్రోల్ DCA డార్క్ ఎడిషన్

3. Accomplished+ A GDI టర్బో-పెట్రోల్ MT డార్క్ ఎడిషన్

4. Accomplished+ A GDI టర్బో-పెట్రోల్ DCA డార్క్ ఎడిషన్

5. స్మార్ట్ డీజిల్ MT

6. Accomplished S డీజిల్ MT డార్క్ ఎడిషన్

7. Accomplished S డీజిల్ DCA డార్క్ ఎడిషన్

8. Accomplished+ డీజిల్ MT డార్క్ ఎడిషన్

9. Accomplished+ డీజిల్ DCA డార్క్ ఎడిషన్

ఈ వేరియంట్ల ధర రూ. 3,000 పెంపు

Creative S GDI టర్బో-పెట్రోల్ MT

Accomplished+ A GDI టర్బో-పెట్రోల్ DCA

Creative+ S GDI టర్బో-పెట్రోల్ MT

Creative+ S GDI టర్బో-పెట్రోల్ DCA

Accomplished S GDI టర్బో-పెట్రోల్ MT

Accomplished+ A GDI టర్బో-పెట్రోల్ MT

Accomplished+ A GDI టర్బో-పెట్రోల్ DCA

ఇవి కాకుండా... టాటా కర్వ్‌లోని అన్ని ఇతర వేరియంట్‌ల రేట్లు డైరెక్ట్‌గా రూ. 13,000 పెరిగాయి.

టాటా కర్వ్ ఇంజిన్ ఆప్షన్లు

మన దేశంలో, టాటా కర్వ్ కారును మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో విక్రయిస్తున్నారు, ఇందులో రెండు పెట్రోల్ & ఒక డీజిల్ ఇంజిన్ వేరియంట్‌లు ఉన్నాయి. అవి - 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్; 1.2-లీటర్ హైపెరియన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్.

1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ - ఇది 118 hp పవర్ & 170 Nm పీక్‌ టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ ఇంజిన్ రోజువారీ ప్రయాణానికి చక్కగా సరిపోతుంది & మెరుగైన మైలేజీని అందిస్తుంది. అంటే, డబ్బుకు తగిన విలువను అందించగలదు.

1.2-లీటర్ హైపెరియన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ - ఈ ఇంజిన్ 123 hp పవర్ & గరిష్టంగా 225 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. యువత కోసం, ప్రత్యేకంగా స్పోర్టీ & పవర్‌ఫుల్‌ డ్రైవ్‌ కోరుకునే వాళ్ల కోసం ఈ ఇంజిన్‌ను డిజైన్‌ చేశారు.

1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ - ఈ డీజిల్ ఇంజిన్ 116 hp పవర్ & 260 Nm పీక్‌ టార్క్ జనరేట్‌ చేస్తుంది. హైవేలపై ప్రయాణానికి, ముఖ్యంగా లాంగ్‌ డ్రైవ్‌ వెళ్లే వాళ్లకు ఈ ఇంజిన్‌ బాగుంటుంది & మెరుగైన ఇంధన సామర్థ్యంతో పని చేస్తుంది.

కంపెనీ ఈ మూడు ఇంజిన్‌లను 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ & 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (DCA) గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో పరిచయం చేసింది. తద్వారా.. కస్టమర్‌లు తమ అవసరం & సౌలభ్యం ప్రకారం సరైన వేరియంట్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉంది.